Movies

“పింక్” బాలయ్య

Nandamuri Balakrishna To Shine In Pink Telugu Remake

హిందీ బ్లాక్‌బస్టర్‌ ‘పింక్‌’ను తెలుగులోనూ తెరకెక్కించేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రీమేక్‌లో అమితాబ్‌ బచ్చన్‌ పాత్రను బాలకృష్ణతో చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నిర్మాత దిల్‌రాజు ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారట. ఈ మేరకు తెగ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది. మరోపక్క బాలయ్య, దిల్‌రాజు కాంబినేషన్‌లో ఓ సినిమా రావడం ఖాయమని చెబుతున్నారు. మరి ఆ ప్రాజెక్టు ఇదే అవుతుందా? లేక మరేదైనా కొత్త కథతో వస్తారా? అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ‘పింక్‌’ తమిళ రీమేక్‌ను అజిత్‌తో తీస్తున్నారు. చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ‘నేర్‌కొండ పార్‌వై’ టైటిల్‌తో బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో అజిత్‌పాటు శ్రద్ధా శ్రీనాథ్, విద్యా బాలన్‌ నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి ఆదరణ లభించింది.