బాలీవుడ్ నటులు తాప్సి, భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సాండ్ కీ ఆంఖ్’. తుషార్ హీరానందని దర్శకత్వం వహించిన ఈ చిత్ర టీజర్ గురువారం విడుదలైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని జోహ్రి అనే గ్రామానికి చెందిన చంద్రో తోమర్, ప్రకాశీ తోమర్ అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉండేవారు. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేయడంతో కుటుంబం కోసమే తమ జీవితాన్ని వెచ్చించారు. తమలా తమ కుమార్తెల జీవితాలు కాకూడదని భావించి 50 ఏళ్ల వయసులో తుపాకీ చేతపడతారు. వారి చదువులను అడ్డుకోవాలని చూసేవాళ్లని తుపాకీలతో బెదిరించేవారు. ఈ నేపథ్యంలో తుపాకీతో టార్గెట్ మిస్సవకుండా దేన్నైనా కొట్టగలిగే సామర్ధ్యం తమలో ఉందని వారికి తెలుస్తుంది. అలా వారు జాతీయ స్థాయిలో జరిగిన రైఫిల్ షూటింగ్లో పాల్గొన్నారు. ఇద్దరూ దాదాపు 300లకు పైగా పతకాలు సాధించారు. వారి జీవితాధారంగా తెరకెక్కిన చిత్రమే ‘సాండ్ కీ ఆంఖ్’. దీపావళికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
https://www.youtube.com/watch?v=veJZPsd7iN0
అక్కచెల్లెళ్ల గురి [Video]
Related tags :