ScienceAndTech

PayTM చేతిలో మోసపోయిన తెలుగు ప్రయాణీకులు

Telugu Air Passengers Gets Cheated By PayTM At Delhi Airport

ఢిల్లీ విమానాశ్రయంలో ఇరుక్కున్న తెలుగు ప్రయాణికులు….ఢిల్లీ విమానాశ్రయంలో ఇరుక్కొని తెలుగు ప్రయాణికులు కష్టాలు పడుతున్నారు. దాదాపు 40 మంది ప్రయాణికులు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు పేటిఎం ద్వారా టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే ఈ టికెట్లు చెల్లవని గో ఎయిర్ సిబ్బంది తెలపడంతో ప్రయాణికులు ఆవాక్కయ్యారు. అలాగే వెబ్‌సైట్‌లో ఒకే పీఎన్‌ఆర్‌పై వేర్వేరు పేర్లు ఉన్నాయని గో ఎయిర్ సిబ్బంది తెలుపుతూ ప్రయాణికులను ఎక్కించుకోకుండానే విమానం హైదరాబాద్ వెళ్లిపోయింది. దీంతో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తెలుగు ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. కాగా తమ టికెట్ల వ్యవహారంపై అటు పేటీఎం యాజమాన్యం కాని, ఇటు గో ఎయిర్ యాజమాన్యం కాని స్పందించకపోవడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.