Movies

₹400కోట్లకు పైనే

Akshay Kumar Is The Only One Who Got Into Forbes 2019 List

ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆర్జన కలిగిన ఫోర్బ్స్ సెలబ్రిటీల జాబితాలో భారత్ నుంచి కేవలం అక్షయ్ కుమార్ ఒక్కరికే చోటు దక్కింది. టేలర్ స్విఫ్ట్ నెంబర్ వన్ స్ధానంలో నిలిచిన ఈ జాబితాలో ఖిలాడీ స్టార్ అక్షయ్కు 35వ స్ధానం దక్కింది. సినిమాకు రూ 35 కోట్ల నుంచి రూ 70 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ రాబట్టే అక్షయ్ను బాలీవుడ్ టాప్ ఎర్నింగ్ స్టార్గా ఈ మేగజైన్ అభివర్ణించింది.సినిమాలే కాకుండా వాణజ్య ప్రకటనల్లోనూ మెరుస్తూ అక్కీ పెద్దమొత్తంలో వెనకేస్తున్నారు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో 20 ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. ఇక సినిమాల పరంగా ప్రస్తుతం అక్షయ్ కుమార్ నటించిన మిషన్ మంగళ్ విడుదలకు సిద్ధంగా ఉండగా, హౌస్ఫుల్ 4, గుడ్ న్యూస్, లక్ష్మీబాంబ్, సూర్యవంశీ చిత్రాలు సెట్స్పై ఉన్నాయి. జూన్ 2018 నుంచి ఈ ఏడాది జూన్ వరకూ మొత్తం రూ 444 కోట్ల సంపాదనతో అక్షయ్ కుమార్ అంతర్జాతీయ స్టార్లు రిహన, జాకీ చాన్, బ్రాడ్లీ కూపర్, స్కార్లెట్ జహన్సన్లను అధిగమించారు.