Movies

ఛీటింగ్ కేసులో సిన్హా

Cheating Case Filed On Sonakshi Sinha

బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాపై ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర పోలీసులు ఛీటింగ్ కేసు న‌మోదు చేశారు. గురువారం సాయంత్రం ముంబైలోని జుహూలో ఉన్న సోనాక్షి ఇంటికి కేసు ద‌ర్యాప్తు చేసేందుకు పోలీసులు వెళ్ల‌గా ఆ స‌మ‌యంలో సోనాక్షి అందుబాటులో లేదు. యూపీ పోలీసులు సోనాక్షిపై ఐపీసీ సెక్షన్ 420, 406 ల కింద కేసు నమోదు చేశారు. వివ‌రాల‌లోకి వెళితే 2018 ఫిబ్ర‌వ‌రిలో సోనాక్షి సిన్హా ఢిల్లీలో స్టేజీ ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చేందుకు గాను 24 ల‌క్ష‌లు అడ్వాన్స్ తీసుకుంద‌ట‌. కాని ఆ త‌ర్వాత కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాలేదు. దీంతో ఈవెంట్ ఆర్గ‌నైజ‌ర్ ప్ర‌మోద్ శ‌ర్మ ఆమెపై మోర‌ద‌బాద్‌లో కేసు న‌మోదు చేశాడు. ఈ రోజు యూపీ పోలీసులు మ‌రోసారి సోనాక్షి ఇంటికి వెళ్ళ‌నున్న‌ట్టు తెలుస్తుంది. సోనాక్షి తండ్రి శతృఘ్న సిన్హా ఇటీవ‌ల జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన సంగ‌తి తెలిసిందే. ఇక ఆమె త‌ల్లి సమాజ్‌వాదీ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ప్ర‌స్తుత సోనాక్షి ద‌బాంగ్ 3 చిత్రంతో బిజీగా ఉంది. దీంతో పాటు కందానీ ష‌వాఖానా, మిష‌న్ మంగ‌ళ్‌, భుజ్‌: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా చిత్రాల‌తో బిజీగా ఉంది.