తైవాన్ విషయంలో జోక్యం తగదని అమెరికాకు చైనాను హెచ్చరించింది. ఆ దేశానికి ఆయుధాలను అమ్మేందుకు అమెరికా సిద్ధమైన నేపథ్యంలో చైనా ఈ విధంగా స్పందించింది. నిప్పుతో చెలగాటమొద్దని ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ అమెరికాను హెచ్చరించారు. హంగరీలో పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ విదేశీ శక్తి పునరేకీకరణను ఆపలేదని ఆయన తైవాన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. స్వతంత్రంగా వ్యవహరిస్తున్న తైవాన్ తమదేశంలో అంతర్భాగమని చైనా ఎప్పట్నుంచో వాదిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా 2.2 బిలియన్ డాలర్ల విలువైన యుద్ధ సామగ్రిని తైవాన్‌కు విక్రయించేందుకు సిద్ధమైంది. దీనిపై చైనా మండిపడుతోంది. అమెరికా- చైనా బంధానికి కొత్త సమస్యలు సృష్టించాలని అమెరికా చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వాంగ్ హెచ్చరించారు.
తైవాన్‌లో తలదూర్చకు
Related tags :