DailyDose

సుజుకీ కొత్త బైక్‌ వచ్చేసింది-వాణిజ్య-07/12

Daily Business News - Maruthi Releases New Bike - July 12 2019

* ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థ సుజుకి మోటార్ కార్పొరేషన్ శుక్రవారం సరికొత్త సుజుకి జిక్సెర్‌ను లాంచ్‌ చేసింది. 155 సీసీ ఇంజీన్‌, ఏబీఎస్‌ టెక్నాలజీతో ఈ బైక్‌ను ఆవిష్కరించింది. దీని ధరను రూ .1 లక్ష (ఎక్స్-షోరూమ్‌, ఢిల్లీ)గా నిర్ణయించింది.
* ఐఫోన్‌.. దీనికుండే క్రేజే వేరబ్బా. కానీ ధరమో ఆకాశంలో ఉంటుంది. అందుకే చాలా మంది ఐఫోన్లు కొనేందుకు కాస్త ఆలోచిస్తుంటారు. అలాంటి వారికి శుభవార్త. త్వరలో భారత విపణిలో ఐఫోన్‌ ధరలు తగ్గనున్నాయట. మేడ్‌ ఇన్‌ ఇండియానే ఇందుకు కారణం.
*ఇన్స్టెంట్ కాఫీ తయారీ కంపెనీ సీసీఎల్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.34.67 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది.
*ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) జాతీయ, ప్రాంతీయ మండలి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముగ్గురు కాస్ట్ అకౌంటెంట్స్ సభ్యులుగా ఎన్నికయ్యారు. 2019-23కుగాను కేంద్ర మండలి సభ్యునిగా సీఎంఎ డాక్టర్ కె.హెచ్.ఎ.వి.ఎస్.ఎన్.మూర్తి, ప్రాంతీయ మండలి సభ్యులుగా సీఎంఏ విజయ్ కిరణ్ అగస్థ్య, సీఎంఏ మునిశేఖర్ దారపనేని ఎన్నికయ్యారు.
*అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించనున్నట్లు టాటా, సింగపూర్ ఎయిర్లైన్స్ (సీఐఏ) సంయుక్త సంస్థ విస్తారా ప్రకటించింది.
*అడిగిన వివరాలన్నీ చెప్పి, మన సమాచారాన్ని చేజేతులా సైబర్ మోసగాళ్లకు అందిస్తున్నామనీ కే7 కంప్యూటింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పురుషోత్తమన్ అన్నారు.
*సంస్థలు వ్యాపార నిర్వహణ, సాధించిన విజయాలకు గుర్తింపుగా ఏటా ఇచ్చే విశిష్ట పురస్కారాలను ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీసీసీఐ) ప్రకటించింది.
*భారత్లో విస్తరించే వ్యూహంతో ఎస్అండ్పీ గ్లోబల్ హైదరాబాద్లో మరో కార్యాలయాన్ని ప్రారంభించింది. రేటింగ్స్, అనలిటిక్స్, డేటా సేవలను అందిస్తోన్న ఈ సంస్థ తన కొత్త ఓరియన్ కార్యాలయంలో 750 మంది కొత్త ఉద్యోగులను తీసుకుంది.
*హోండా కార్స్ ఇండియా (హెచ్సీఐఎల్) నుంచి కాంపాక్ట్ ఎస్యూవీలో కొత్త వేరియంట్ డబ్ల్యూఆర్-వీ గురువారం విపణిలోకి విడుదలైంది.
*హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న రక్షణ ఉత్పత్తుల సంస్థ కల్యాణి రఫేల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (క్రాస్)కు 100 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.700 కోట్లు) కాంట్రాక్టు లభించింది.
*పంజాబ్ నేషనల్ బ్యాంక్కు రుణాలు ఎగవేసిన కేసులో నిందితుల్లో ఒకరైన మెహుల్చోక్సీ ఆస్తులపై ఈడీ కొరడా ఝళిపించింది. భారత్ సహా విదేశాల్లో ఉన్న రూ.24.77 కోట్ల విలువైన అతని ఆస్తుల్ని జప్తు చేసింది.