Food

పండ్లు తీసుకుంటే అందంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది

Fruits not only gives health but improves beauty as well

ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా మనం తినే ఆహారం ముఖ్యం. చాలా మందికి పండ్లు తినడం పెద్దగా అలవాటు ఉండదు. కానీ ఆయా సీజన్లలో దొరికే పండ్లతో ఆరోగ్యంగా ఉండవచ్చని చెబుతున్నారు న్యూట్రిషియన్లు. పండ్లను తినడం వల్ల ఆరోగ్యంతోపాటు సౌందర్యంకూడా సొంతం అవుతుంది. చర్మం తాజాగా ఉండాలన్నా, మూడ్స్ బాగుండాలన్నా, మంచి ఆలోచనలు రావాలన్నా తీసుకునే ఆహారం కూడా కారణం అవుతుందంటున్నారు నిపుణులు. పండ్లలో విటమిన్స్, మినరల్స్, ఫైబర్, పొటాషియం మొదలైనవి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి కొత్త జీవం తెచ్చి ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తాయి.
***అవకాడో
చర్మం ఆరోగ్యంగా కనిపిస్తే అది ఫిట్‌నెస్‌కి సూచనగా చెప్పుకోవచ్చు. అవకాడో చర్మానికి పోషణ, మెరుపునిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను మార్చడం, కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఫైబర్, విటమిన్ ఎ,సి,డి,ఇ,కె, బి1, బి2,బి3, బి5,బి6, బి12 లున్నాయి. దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకోవాలంటున్నారు.
**అందానికి
* మగ్గిన అవకాడోను బాగా మ్యాష్ చేసి క్రీమీ పేస్టు తయారుచేయాలి. తర్వాత అందులో 2 చెమ్చాల పాలు, 1 చెమ్చా తేనె కలిపి మిశ్రమం తయారు చేసుకుని ముఖం, మెడపై రాసుకుని 30 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా చేస్తే ముఖం మెరుస్తుంది. * అవకాడో ముక్కలను రోజ్‌వాటర్, చిటికెడు కర్పూరంలో కలిపి కూడా ముఖంపై అప్లై చేసుకోవచ్చు. * 2 అవకాడాల్లో ఒక కివి పండును బాగా మ్యాష్ చేసి దాన్ని పేస్టుగా తయారు చేసుకోండి. ఇందులో కాస్త తేనె కూడా కలపండి. తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడిగేయండి. చర్మం మెరుస్తుంది.
***బొప్పాయి
కొవ్వును కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్‌ఎ, సి, బి, మినరల్స్ , యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లాంటి సుగుణాలు చర్మాన్ని రక్షిస్తాయి. బొప్పాయి తోలు అల్సర్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
**అందానికి
ముఖంపై మచ్చలు, ట్యాన్ పోవాలంటే బొప్పాయి గుజ్జులో నిమ్మరసం, పావు చెంచా పసుపు కలిపి ముఖానికి రాయాలి. 10 నిమిషాలపాటు ఉంచుకుని శుభ్రం చేసుకోవాలి. * పొడి చర్మం కలవారు బొప్పాయి గుజ్జులో అర చెమ్చా బాదం నూనె కలిపి ముఖంపై రాసుకోవాలి. తర్వాత 10 నిమిషాల తర్వాత తడి గుడ్డతో తుడవాలి. వారానికి 2 సార్లు ఇలా చేయాలి.
***ఆరెంజ్
* ఇందులో విటమిన్‌సి, నైసీన్, విటమిన్ బి6, ఫోలెట్, మెగ్నీషియం, కాపర్ లున్నాయి. ఈ పండులోని విటమిన్ సి వల్ల సూర్యుని తీవ్ర కిరణాలు, కాలుష్యం నుంచి చర్మాన్ని కాపాడుతుంది. ముడతలను తగ్గిస్తుంది.
*అందానికి
* 3 చెమ్చాల ఆరెంజ్ జ్యూస్‌లో 1 చెమ్చా నిమ్మరసం, 1 చెమ్చా పాలు, అరచెమ్చా పసుపు కలిపి ముఖంపై రాసుకుంటే చర్మం తాజాగా ఉంటుంది.
* 3 చెమ్చాల ఆరెంజ్ జ్యూస్‌లో 1 చెమ్చా నిమ్మరసం, 2 చెమ్చాల శనగపిండి, చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి.
* పిగ్మెంలేషన్ ఉన్న చోట జ్యూస్ రాయడం వల్ల మార్పు తెలుస్తుంది.
*****దానిమ్మ
దానిమ్మ తినడం వల్ల మృతకణాలు తొలగిపోతాయి. దాంతో చర్మంపై సహజ మెరుపు వస్తుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ప్రీరాడికల్స్‌ను తొలగించడంతో పాటు అందులోని యాంటీ ఏజింగ్ సుగుణాలు ముడతలు, ఫైన్‌లైవ్స్‌ను తొలగిస్తాయి. ఇందులో విటమిన్ కె, బి, సి మినరల్స్ ఉండడంతో కణాల నిర్మాణంలోనూ ఉపయోగపడతాయి.
***అందానికి
* కొంచెం దానిమ్మ రసంలో కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలిపి కాటన్‌తో ముఖానికి రాసుకోవాలి. అరగంట తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ట్యానింగ్ మాయమౌతుంది.
* దానిమ్మ జ్యూస్‌లో ఒక చెమ్చా ట్రీన్‌టీ, పెరుగు, తేనె కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం తాజగా ఉంటుంది. ఇది స్కిన్ టోన్‌ను మెరుగు పరుస్తోంది.
***కీరా
కీరాలో నీటిశాతం ఎక్కువ. శరీరానికి చల్లదనాన్నిస్తుంది. ఇందులోని విటమిన్ కె, సి, ఫైబర్ మొదలైనవి ఎక్కువ మోతాదులో ఉంటాయి. కీరా దోస స్కిన్ టోన్‌ను మార్చడంతోపాటు ముడతలను తగ్గిస్తుంది.
***అందానికి
* ఏక్నే వల్ల కలిగిన మంటను తగ్గించడానికి తురిమిన కీరాలో ఒక చెమ్చా శనగపిండి, 1 చెమ్చా రోజ్‌వాటర్ కలిపి ముఖంపై రాసుకోవడం వల్ల ఏక్నే సమస్య మంచి బయటపడవచ్చు.
* కీరా రసంలో సమాన మోతాదులో నిమ్మరసం, కాస్త అలోవెరా జెల్ కలిపి చర్మంపై రాసుకుని పావుగంట ఉంచాలి. దీనివల్ల ట్యానింగ్ పోయి ముఖం మెరుస్తుంది.
***కివీ
ఇందులోని విటమిన్ సి, అమినోయాసిడ్ వల్ల చర్మం తాజాగా ఉంటుంది. దాంతోపాటే విటమిన్ ఇ వల్ల కొత్తకణాల నిర్మాణంతో చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరి సుగుణాలు ఉండడం వల్ల దాన్ని వాడితే ఏక్నే నుంచి కూడా కాపాడుతుంది.
*అందానికి
* గుజ్జులో నానబెట్టిన బాదం పేస్టును కలిపి ముఖంపై రాసుకోవడం వల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. ఇందులో విటమిన్ ఇ, సి ల కాంబినేషన్ ఉంటుంది.
*- పెరుగులో కివీ గుజ్జు కలిపి రాసుకోవచ్చు.