ప్రతిసారి ధోనీ వచ్చి మ్యాచ్ ఫినిష్ చేస్తాడనుకోవడం చాలా పొరపాటని టీమిండియా లెజెండ్ సచిన్ అన్నాడు. సెమీస్‌లో ఇండియా ఓడినా.. ఫైటింగ్ స్పిరిట్ మాత్రం ఆకట్టుకుందని కొనియాడాడు. అయితే టాపార్డర్‌లో రోహిత్, కోహ్లీపై ఎక్కువగా ఆధారపడటాన్ని మాస్టర్ తప్పుబట్టాడు. ‘240 రన్స్ టార్గెట్ చాలా చిన్నది. దీన్ని ఛేదించకపోవడం నన్ను తీవ్రంగా కలిచి వేసింది. స్వల్ప వ్యవధిలో మూడు టాప్ వికెట్లు తీసి కివీస్ డ్రీమ్ స్టార్ట్‌ను అందుకుంది. ప్రతిసారి రోహిత్, కోహ్లీ బ్యాటింగ్‌పైనే ఆధారపడటం పెద్ద తప్పు. వాళ్లు విఫలమైనప్పుడు మిగతా ప్లేయర్లు మరింత బాధ్యతగా ఆడాలి. కానీ ఎవరూ ఆడలేదు. 92/6 స్కోరు ఉన్నప్పుడు మ్యాచ్ కివీస్ చేతుల్లోకి వెళ్లిపోయింది. కానీ చివర్లో ధోనీ, జడేజా చూపిన తెగువను ఎంత ప్రశంసించినా తక్కువే. ఈ ఇద్దరు పోరాడిన తీరు సూపర్బ్.ప్రతిసారి ధోనీ మ్యాచ్ ఫినిష్ చేస్తాడనుకోవడం కూడా చాలా పెద్ద పొరపాటు. గతంలో చాలా మ్యాచ్‌లు గెలిపించాడని.. ప్రతిసారి అతనే ఈ పని చేయాలంటే ఎలా? జడేజాలాగా ప్రతి ఒక్కరు బాధ్యతతో ఆడితే ఫలితం మరోలా ఉండేది’ అని మాస్టర్ పేర్కొన్నాడు. ఇక రిటైర్మెంట్ విషయాన్ని ధోనీకే వదిలేయాలని సచిన్ సూచించాడు. ఇందులో ఎవరూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్నాడు. టీమిండియాకు మహీ అందించిన సేవలను ప్రతి ఒక్కరు గౌరవించాలన్నాడు. ఇండియన్ క్రికెట్‌లో ధోనీది ప్రత్యేక స్థానమని చెప్పిన సచిన్.. అలాంటి కెరీర్ ఎవరికీ ఉండదన్నాడు. సెమీస్‌లో అతను ఉన్నంతసేపు ఇండియా విజయావకాశాలు సజీవంగానే ఉన్నాయన్నాడు. ఇప్పటికీ ధోనీ బెస్ట్ ఫినిషర్ అని ఈ లెజెండ్ కితాబిచ్చాడు. టోర్నీ అసాంతం పరుగుల వరద పారించిన రోహిత్‌ను తలుచుకుంటే చాలా బాధగా ఉందన్న సచిన్.. అతను కోలుకోవడానికి సమయం పడుతుందన్నాడు.
ప్రతిసారి ధోనీ చేయలేడు
Related tags :