DailyDose

పన్నెండేళ్ళ తరువాత మృతదేహానికి పోస్టు మార్టం-నేరవార్తలు–07/13

Ayesh Body To Be Re-PostMortemed-Crime News-July 13 2019

* ఆయేషా కేసు కీలక మలుపు తిరుగుతోంది. 12 ఏళ్ల తర్వాత ఆయేషా మృతదేహానికి సీబీఐ రీపోస్టుమార్టం చేయనుంది. సీబీఐ తమకు కూడా డీఎన్‌ఏ టెస్ట్‌ చేసిందని ఆయేషా తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆయేషా డీఎన్‌ఏ టెస్ట్‌కు తమ మతపెద్దలు ఒప్పుకోలేదని, కోర్టు ద్వారా సీబీఐ అనుమతి తెచ్చుకుందని, టెస్టులకు తాము సహకరిస్తామన్నారు. అయేషా కేసులో దర్యాప్తు సంస్థలకు తాము సహకరిస్తూనే ఉన్నామని, తమకు పోలీసులు, కోర్టులు, రాజకీయ నాయకులపై నమ్మకం లేదని ఆరోపించారు.
సీబీఐ కూడా న్యాయం చెయ్యకపోతే ఇక ఏ వ్యవస్థను ప్రజలు నమ్మరని ఆయేషా తల్లిదండ్రులు తెలిపారు.
* ప.గో.జిల్లా కోర్టుకు హాజరు అవుదామని వస్తున్న యువతి ని కిడ్నాప్ చెయడానికి ప్రయత్నం శ్రీను అనే వ్యక్తి
శ్రీను ప్రగడవరం గ్రామాన్ని కి చెందిన వ్యక్తిగా గుర్తింపు..యువతి ఎక్కిన ఆటోలోనే శ్రీను ఎక్కి మధ్య దారిలో ఆటో ఆపి బలవంతంగా లాక్కెళ్తూ ఉండగా గుర్తించిన స్థానికులు…శ్రీను ని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పిన స్థానికులు.
* కడప జిల్లా చెన్నూరు మండలం దుగ్గనపల్లె వద్ద టయోటా వాహనంలో తరలిస్తున్న 12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం… ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.చెన్నూరు నుంచి చెన్నై కి తరలిస్తూ నీటి కోసం దుగ్గనపల్లె చేరుకున్న తరుణంలో పోలీసులు దాడులు..పోలీసులు వచ్చినట్లు సమాచారం తెలుసుకోని పరారైన నలుగురు వ్యక్తులు..ఒకరిని పట్టుకున్న స్థానికులు…నలుగురు పరార్.. పరారైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు.
* దోహాకు చెందిన ఓ ప్రయాణికుడు కేరళలోని కన్నూర్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్‌ అయ్యాడు. నిషేదిత గంజాయి పదార్థాన్ని తీసుకొని వెళ్తుండగా అధికారులు గుర్తించి పట్టుకున్నారు. పట్టుబడ్డ 690 గ్రాముల పదార్థం విలువ రూ. 7 లక్షలుగా సమాచారం. చెప్పుల్లో ఉంచి తరలిస్తుండగా అధికారులు గుర్తించి పట్టుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరోకు అప్పగించారు
* గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం తూబాడులో తెదేపా కార్యకర్తలపై వైకాపా వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఇవాళ ఉదయం జరిగిన ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురిని చిలకలూరిపేట ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలపాలైన మరో ఇద్దరిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…గ్రామంలోని ఎస్సీకాలనీలో ఉన్న తెదేపా కార్యకర్త వాసిమల్ల పెద్ద అంకమ్మ ఇంటి ఎదుట రహదారికి అడ్డంగా వైకాపా వర్గానికి చెందిన గుడిపూడి నీలాంబరం మొక్కలు నాటారు. ఈ విషయంలో శుక్రవారం ఇరు వర్గీయుల మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో శనివారం నీలాంబరం అతని కుటుంబ సభ్యులు కలిపి అంకమ్మ కుటుంబసభ్యులపై గొడ్డళ్లు, గడ్డపారలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అంకమ్మ కుమారులు సాగర్‌, ఏసేబు, జీవన్‌బాబు, అంకమ్మ కోడలు జ్యోత్స్నకు గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని విచారిస్తున్నారు.
* పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సీటీలో ఓ తెలుగు విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందినవ్యక్తిగా గుర్తించారు. మానసిక ఒత్తిడి వల్లనే ఆత్మహత్యకు పాల్పడినట్టు విద్యార్థి రాసిన సూసైడ్‌ నోట్‌ వల్ల తెలుస్తోంది. ఒంటరి జీవితాన్ని ముగిస్తున్నానని విద్యార్థి లేఖలో పేర్కొన్నాడు. సూసైడ్‌ నోట్‌ ప్రకారం.. ‘ఇక సెలవు. వెళ్లిపోతున్నాను. మిమ్ములనందరినీ వదిలిపెట్టి. నా చావుకు నేనే కారణం. నా ఈ 20 ఏళ్ల ప్రయాణంలో ఎవరైనా నావళ్ల ఇబ్బంది పడుంటే సారీ, దయచేసి హాస్టల్స్‌లో ఉన్నప్పుడు రూమ్‌లలో ఒంటరిగా ఉండకండి.రోజుకి కనీసం గంటైనా ఆడుకోవటానికి వెళ్లండి. రిలాక్స్‌ కావడానికి అదే మంచి మార్గం. లేకుంటే నాలాగే సూసైడ్‌ ఆలోచనలు వస్తాయి. సూసైడ్‌ చేసుకునే వారిని పిరికివాళ్లుగా తీసిపారేయకండి. ఆత్మహత్య చేసుకునేంత ధైర్యం వందేళ్లు బతికినా రాదు. అంతకష్టం సూసైడ్‌ చేసుకోవడం. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే. మా అమ్మానాన్నల గురించి చెప్పాలంటే, నేను ఎన్ని తప్పులు చేసినా క్షమించే గొప్పవాళ్లు. ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చేవాళ్లు. పాపం వారెలా తట్టుకుంటారో నేను చనిపోయానని తెలిసి.నా రియల్‌ లైఫ్‌లో జగదీష్‌ అంత దానకర్తని చూడలేదు. చిన్నప్పటినుంచి మా అన్నవాళ్లు కూడా సపోర్టు చేస్తూ వచ్చారు. ఇంక మీరే అమ్మానాన్నని బాగా చూసుకోవాలి. ఇంక చెప్పడానికేం లేదు. నా ప్రాణస్నేహితులకు, మిత్రులకు, శత్రువులకు, బంధువులందరికీ నా జీవితంలో మీరూ భాగమైందుకు కృతజ్ఞతలు. నాకు ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేదు. గుడ్‌బై. వీలైతే మరణానంతరం నా అవయవాలు దానం చేయండి’అని ముగించాడు. ఇక విద్యార్థి మృతదేహాన్ని సొంతూరికి తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం.
* కర్నూలు బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన కర్నూలు జిల్లాలో కలకలం రేపుతోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కర్నూలు జిల్లా పంచలింగాల గ్రామంలో ఓ యువకుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. బాలికకు కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో బాలిక ప్రసవించింది. కానీ శిశువు మృతి చెందింది. యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.
* కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం పెందుర్రులోని ఆలయంలో చోరీ కి విఫలయత్నంబైక్ పై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియన వ్యక్తులుచోరీ చేస్తూ గ్రామస్థుల కంట పడిన దొంగలుపట్టుకోబోతుండా ఓ వ్యక్తి తలపగలకొట్టి పరారైన నిందితులుతీవ్రంగా గాయపడిన గ్రామానికి చెందిన ప్రత్తి శ్రీనివాసరావుదాడి చేయటంతో పాటు శ్రీనివాసరావుకు చెందిన AP16W 3757 నెంబర్ గల బైక్ ను తీసుకువెళ్ళిన దుండగులు
* కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలం నల్లమలలో కలకలం సర్వ నరసింహ స్వామి ఆలయ ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహంతల మొండెం వేరు చేయబడ్డ మృతదేహం యువకుని హత్య క్షుద్ర పూజలో భాగమేనా..తల మొండెం వేరుగా ఉండడంతో పలు అనుమానాలుమృత దేహం పక్కనే పడి వున్న నిమ్మకాయలు. పూజా ద్రవ్యాలు
* జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామ శివారు పంటపొలాలలో, నెమళ్ళు మృతి.
కుర్వ లక్ష్మన్న కు చెందిన వ్యవసాయ భూమిలో, మరణించిన నాలుగు నెమళ్లు.ఒకేచోట 4 నెమళ్లు, నిర్జీవంగా పడిఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.వన్యప్రాణుల వేటగాళ్ల విషప్రయోగమై ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. రెవిన్యూ, ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చిన గ్రామస్థులు…
* ఢిల్లీ నగరంలోని జిల్‌మిల్ ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం జరిగింది. రబ్బరు ఫ్యాక్టరీలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 26 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలు ఆర్పతున్నారు. పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.
* మహారాష్ట్రలోని నవీ ముంబయిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇండస్ట్రీయల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఏరియాలో ముగ్గురు వ్యక్తులను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. హత్య విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
* సోమాలియాలో ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. కారు బాంబుతో ఓ హోటల్‌పై విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. సోమాలియా పోర్టు సిటీ కిస్మాయోలోని అసాసే హోటల్‌లో తొలుత కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదులు అనంతరం కారు బాంబును పేల్చారు. ఈ దుశ్చర్యకు బాధ్యులము తామేనని ఆల్‌-షబాబ్‌ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.
* 8 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న ప్రేయసిపై అనుమానంతో దారుణానికి ఒడిగట్టాడో వ్యక్తి. అందరూ చూస్తుండగానే ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన ఢిల్లీలోని మునిక్రాలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది.
*రంగారెడ్డిజిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని ఓఆర్‌ఆర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగివున్న లారీని వెనుక నుంచి బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
* మెట్రో నగరాలలో ఫోర్ వీలర్ వాహనాలను దొంగిలిస్తున్న ముఠాను మాదాపూర్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పుణేకు చెందిన నిదీష్ వినాయక్ కళాంకర్ మరో ముగ్గురు మిత్రులతో కలిసి ముఠాగా ఏర్పడి వాహనాల చోరీకి పాల్పడుతున్నారు. ఈ ముఠా నుంచి పోలీసులు 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు.
* దేశ రాజధాని దిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఝిల్‌మిల్‌ పారిశ్రామిక వాడలోని ఓ రబ్బరు ఫ్యాక్టరీలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. అత్యంత ఇరుకుగా ఉండే ఈ ప్రాంతంలో మంటలు చెలరేగి వెంటనే నాలుగు అంతస్తులకు వ్యాపించాయి. సమాచారమందకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. దాదాపు 24 అగ్నిమాపక యంత్రాలు మంటల్ని ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
*విశాఖ ఏజెన్సీ నుంచి ఉత్తరప్రదేశ్లోని మధురకు రెండు వ్యాన్లలో తరలిస్తున్న 1386 కేజీల గంజాయిని ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు.
*తూనికలు, కొలతలశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎరువుల దుకాణాలు, గిడ్డంగుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని దుకాణాల్లో 50 కిలోల ఎరువుల బస్తాలో 4.1 కిలోల వరకు తూకంలో తేడా ఉన్నట్లు గుర్తించారు. విశాఖపట్నం, నెల్లూరు, కర్నూలు అనంతపురం, గుంటూరు, కడప, విజయనగరం, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో తనిఖీలు సాగాయి.
*ఎమ్మార్ కుంభకోణం వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రత్యేక హోదా ఉన్న సీబీఐ కోర్టు శుక్రవారం నిందితుడైన కోనేరు మధుకు మరోసారి సమన్లు జారీ చేసింది.
*మోజో టీవీ మాజీ సీఈవో రేవతిని ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కేసులో బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
*టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్కు షరతులతో కూడిన ముందస్తు బెయిలును హైకోర్టు మంజూరు చేసింది.
*కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో ప్లాట్ఫాంపైకి ఓ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.
*హైదరాబాద్ నగరంలోని అబిడ్స్ తాజ్ మహల్ హోటల్ భవనం పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి మద్యం సేవించి తెల్లవారు జామున తాజ్ మహల్ హోటల్ 2వ అంతస్తు పై నుంచి దూకి మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు.
*మద్యం మత్తులో ద్విచక్ర వాహనంపై వచ్చిన యువకులు ఓ నిండు ప్రాణం పోవడానికి కారణమయ్యారు. వారి నిర్లక్ష్యం కారణంగా కన్నతండ్రి కళ్లెదుటే వైద్యురాలు మృత్యవాత పడింది. పోలీసుల కథనం ప్రకారం… తిరుప్పూరు జిల్లా దారాపురం చత్రం ప్రాంతానికి చెందిన పళనిస్వామి రైతు. ఆయన భార్య కుప్పాత్తాల్.