అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నేత నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఉద్దేశం చూస్తుంటే ప్రతిపక్షానికి చట్టసభల్లో అప్రకటిత నిషేధంలా ఉందంటూ ట్వీట్ చేశారు. అత్యున్నత శాసనసభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిటీడీపీని ఉద్దేశించి తాము 151 మంది ఎమ్మెల్యేలం ఉన్నాం, మేమంతా లేస్తే మీ 23 మంది శాసన సభ్యులు అసెంబ్లీలో నిలవగలరా అంటూ వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. అసెంబ్లీలో 23 మంది శాసన సభ్యులకే రక్షణ లేకపోతే ఎలా? అంటూ ట్విట్టర్ ద్వారా నారాయణ ప్రశ్నించారు. ఈ వ్యవహారం చూస్తుంటే చట్టసభలలో తక్కువ మంది ఉన్న ప్రతిపక్షాలకు అప్రకటిత నిషేధాన్ని తలపిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే శుక్రవారం అసెంబ్లీలో సున్నా వడ్డీ పథకంపై అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సభ్యులను ఉద్దేశించి సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదరంగా మారాయి.
జగన్…అలా మాట్లాడటం తప్పు
Related tags :