దేశ రాజధాని ఢిల్లీ.. స్మోకర్లకు కూడా క్యాపిటల్గా మారింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో 15 నుంచి50 ఏళ్ల మధ్య ఉన్న వారిలో ప్రతి ముగ్గురిలో ఒకరు పొగ తాగుతున్నరు. ఇందులో సగం మంది 20 నుంచి 30 ఏళ్ల లోపు వాళ్లే. ‘అండర్స్టాండింగ్ స్మోకింగ్ యాటిట్యూడ్ ఇన్ యూత్’ పేరుతో గుర్గావ్ కు చెందిన ఏవిస్ హెల్త్ ఫౌండేషన్ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.యువతలో ఎక్కువ మంది పని ఒత్తిడిని తట్టుకోలేక స్మోక్ చేస్తున్నారని అందులో తేలింది. 1,400 మంది స్మోకర్లపై స్టడీ చేయగా 56 శాతం మంది ఒత్తిడి తట్టుకోలేక పొగ తాగుతున్నామని, అనారోగ్యానికి గురవుతామని విషయం తమకు తెలుసని చెబుతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్వో) లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టొబాకో స్మోకర్స్ లో దేశంలో 12 శాతం ఉన్నారు.
ఢిల్లీ భారత రాజధాని కాదు పొగరాయుళ్ల ఖిల్లా
Related tags :