ఆఫీస్ టైం అయిపోతుంది. బండి తుడుచుకునే టైమ్ లేదు అని మనోళ్లు అలాగే దుమ్ముతో ఉన్న వాహనాలతో వెళ్లడం కామన్. అయితే ఇలాంటి దుమ్ముపట్టిన బండి కనిపిస్తే చాలు ఫైన్ కట్టాల్సిందే. కాకపోతే ఇది మనదగ్గర కాదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడి అధికారులు కూడా ఆ చట్టాలు పక్కాగా అమలయ్యేలా చూస్తారు. ఇప్పుడు UAEలోని దుబాయిలో వాహనదారులకు కొత్త రూల్ తీసుకొచ్చారు. ఇకపై ఆ నగరవాసులు తమ కార్లను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఒకవేళ మురిగ్గా ఉన్న కార్లను రోడ్లపై పార్క్ చేశారంటే భారీ జరిమానా తప్పదట. ఈ మేరకు దుబాయి అధికారులు నిబంధనలు జారీ చేశారు. కొత్త నిబంధనల ప్రకారం.. రోడ్లపై మురికిగా ఉండే కార్లను నిలిపితే 500 దిర్హామ్ ల ఫైన్ కట్టాల్సిందే. అంటే భారత కరెన్సీలో రూ. 9000 పైనే. ఎక్కడపడితే అక్కడ మురికి కార్లు ఉంటే సిటీ దుమ్ముతో దెబ్బతింటుందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఇంట్లో ఉండే కార్లు కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. లేదంటే కఠిన చర్యలు తప్పవన్నారు. దుబాయి నగరానికి పర్యాటక తాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది పర్యాటకులు ఇక్కడి వస్తుంటారు. తమ నగరం ఎల్లప్పుడూ పర్యాటకులను ఆకర్షించేలా అందంగా, పరిశుభ్రంగా ఉండాలని తాము భావిస్తున్నట్లు తెలిపారు అధికారులు. ఇలాంటి రూల్ మన దగ్గరకూడా పెడితే బండితో పాటు సిటీ క్లీన్ గా ఉంటుందంటున్నారు.
మీ బండి మీద దుమ్ము ఉంటే 500 దిర్హామ్‌లు జరిమానా
Related tags :