చేపల పెంపకంలో చేప కుంటల ఆకారం, నిర్మాణం చాలా ముఖ్యమైనవి. కుంట నిర్మించే ముందు దాన్ని నిర్మించే చోటు, నేల స్వాభావిక గుణాలు, నీటి పారుదల, పెంచే చేపల రకాలు అనే అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఈ విధంగా చేపల చెరువుల నిర్మాణాన్ని చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. చేపల చెరువును సక్రమంగా ఏర్పాటు చేసుకు ని దానిలో సరైన యాజమాన్య పద్ధతులను అవలంబించాలని తెలిపారు. తద్వా రా మంచి లాభాలను పొందవచ్చు పేర్కొంటున్నారు. చేపల చెరువు నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలను గురించి గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త బూర్గు లవకుమార్ తెలిపారు. పలను వాటి జీవిత కాలమంతా ఒకే కుంటలో ఉంచరు. మొదట్లో చేప పిల్లలను చిన్న కుంటలలో పెంచి అవి పెరిగిన తర్వాత పెద్ద కుంటలలోకి మార్చాలి. దీనివల్ల ఎదిగే చేపలకు కావల్సినంత ఆహారం ఎదగడానికి తగినంత చోటు దొరుకుతుం ది. చేపల రకాన్ని బట్టి మూడు లేక నాలుగు రకాల కుంటలు అవసరమవుతాయి. ఈ కుంటలను నర్సరీ, రేరింగ్, స్టాకింగ్ కుంటలు అంటారు.
**నర్సరీ పాండ్
చేప నారుమడులు చిన్నవిగా, లోతు తక్కువగా ఉండాలి. సుమారు రెండు నుంచి ఆరు గుంటల విస్తీర్ణం కలిగి 1-1.5 మీటర్ల లోతు కలిగి ఉండాలి. వీటిలో 4-5 మిల్లీ మీటర్ల సైజు గల (చిరుచేపలు)దశ నుంచి 25-30 మి.మీ సైజు గలిగిన ఫ్రై దశ వరకు సుమారు మూడువారాల వరకు పెంచుతారు.
**రేరింగ్ పాండ్:
ఇవి నర్సరీ కన్నా కొద్దిగా పెద్దవిగా ఉండి వీటిలో 25 మి.మీ సైజు గల ఫ్రై దశను 75-100 ఎం.ఎం సైజు కలిగిన ఫింగర్ లింగ్ దశ నుంచి చేపల మార్కెట్ సైజు వచ్చే వరకు వీటిలో పెంచుతారు. ఈ కుంటల విస్తీర్ణం అర ఎకరం నుంచి 5 ఎకరాలు. నీటి లోతు 2-2.5 మీటర్ల వరకు ఉండాలి. కుంట పొడవు వెడల్పు కంటే ఎక్కువగా ఉండాలి. ఈ విధంగా ఉండటం వల్ల చేపలు ఎక్కువ దూరం ఈదగలిగి ఆరోగ్యకరం గా ఉంటాయి. ఈ మడుల వెడల్పు 40 మీటర్లలోపు ఉంటే చిన్న వలలను ఉపయోగించి కొద్దిమంది సహాయంతో మడుగులోని చేపలను పట్టడానికి వీలవుతుంది. అంటే చేపల కుంట లు దీర్ఘ చతురస్రాకారంగా ఉండాలి. (పొడవు, వెడల్పుల నిష్పత్తి 3:1 ఉండాలి)
**స్థల ఎంపిక:
ఇది చాలా ముఖ్యం. ఎంపిక చేసుకున్న స్థలంలోని మట్టికి గల నీటి నిలుపుదల చేసే గుణం స్వతహాగా ఉన్న పోషక విలువలు ప్రధానపాత్ర వహిస్తాయి.
**నేల స్వభావం:
చేపల పెంపకంలో నేల స్వభావం కీలకమైన అంశం. కుంటలోని నేల నీటి నిల్వ చేసేదిగా ఉండాలి. అధిక భాగం ఒండ్రు మట్టి, నల్లరేగడి నేలలు ఎంతో అనువైనవి. బంకమట్టితో కొద్దిపాటి ఇసుక కలిగిన నేలలు, ఎర్రనేలలు కూడా అనుకూలమైనవి.
**నీటి వసతి:
చేపల పెంపకంలో నీటి వసతి కూడా ఇంకో ముఖ్యమైన అంశం. నీటి మట్టం ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండాలి. సాధారణంగా చేపల చెరువులకు తగినంత నీరు జలాశయాల నుంచి, పంటల కాల్వల ద్వారా లభ్యమవుతుంది. అవసరమైనచోట నీటికి తోడు తగిన అనుమతితో భూగర్భ జలాలను కూడా వినియోగించుకోవచ్చు. కుంటలోకి ప్రవహించే నీరు కలుషితాలు లేకుండా పరిశుభ్రంగా ఉండాలి. సంవత్సరంలో కనీసం పది నెలల నీరు లభించే వసతికి దగ్గరలో నిర్మించడం మంచిది.
**చెరువుల తవ్వకం:
చేపల చెరువులను రెండు విధాలుగా నిర్మించుకోవచ్చు. అవి 1.సాసర్ పద్ధతి 2. ట్రెంచ్ పద్ధతి
**సాసర్ పద్ధతి:
సాధారణంగా ఐదు ఎకరాల విస్తీర్ణంలోపు చెరువులను ఈ పద్ధతిలో నిర్మించుకోవాలి. ఇందులో చెరువులోని మట్టిని తీసుకుని కట్టలను నిర్మిస్తారు. దీన్ని పూర్తి తవ్వక పద్ధతి అని అంటారు.
**ట్రెంచ్ పద్ధతి:
ఐదు ఎకరాల పైబడిన పెద్ద సైజు చెరువులను ఈ పద్ధతిలో నిర్మించుకోవాలి. ఇందులో కట్ట నిర్మాణానికి సమీపంలోని మట్టిని తీసుకుని కట్టలను నిర్మిస్తారు. ఇది చెరువు లోపల కట్టలకు దగ్గరలో ఒక కాల్వ ట్రెంచ్ లాగా అగుపిస్తుంది. దీన్ని పాక్షిక తవ్వక పద్ధతి అంటారు. ఎండాకాలం చేపల చెరువుల నిర్మాణానికి ఎంతో అనుకూలం.
**తూముల నిర్మాణం:
నీరు చెరువులోకి తోడుకోవడానికి ఇన్‌లెట్ బయటకు పంపడానికి ఔట్‌లెట్ తూములను తప్పనిసరిగా నిర్మించుకోవాలి. ఇన్‌లెట్ తూములు తగిన వ్యాసం కలిగిన సిమెంట్ పైపులతో ఏర్పాటుచేసి నీటిని వడగట్టుకోవడానికి నైలాన్ మెష్ బ్యాగును ఏర్పాటు చేయాలి. తద్వారా నాసిరకం చేపలు, వాటి గుడ్లు చెరువులోనికి ప్రవేశించకుండా అరికట్టవ చ్చు. ఔట్‌లెట్ తూములు వాలు ఎక్కువగా ఉన్నచోట నిర్మించుకోవాలి. దీనికి కూడా నైలాన్ మెష్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా చెరువులోని చేపలు బైటికి పోకుండా కాపాడుకోవచ్చు.
**లీకేజ్ నివారణ:
మట్టిలో తగు పరిమాణం క్లే ఉంటే లీకేజీ ఉన్న సమస్య ఉండదు. ఒకవేళ ఇసుక పాలు ఎక్కువగా ఉండి లీకేజీ ఉన్నచో చెరువు గర్భంపై ఒక పొర ఒండ్రుమట్టిని పరిస్తే ఈ సమస్యను అరికట్టవచ్చు.
***చెరువుగట్టు నిర్మాణం
నీటి ఒత్తిడిని తట్టుకునేటట్లు చెరువు గట్లను బలంగా నిర్మించాలి. చెరువు సైజును బట్టి అడుగు 2-3 మీటర్ల వెడల్పుతో గట్టు వాలు 1: 1.5 (నిలువు, అడ్డం) నిష్పత్తిలో ఉండాలి. మట్టి రకం, గుణాన్ని బట్టి చెరువు కట్ట వాలును నిర్మించుకోవాలి. గట్లపైన వెడల్పు 1 మీటర్‌పైన ఉండాలి.
చేపల చెరువు నిర్మాణ అనుసరణీయ పద్ధతులు
Related tags :