పులి పేరు వింటేనే గుండెల్లో గుబులు మొదలయితది.ఇంక పులి పక్కన ఉంటే అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే హీరోయిన్ మాళవికా శర్మ మాత్రం పులితో మంచిగా ఆడుకుంటూ దానితో ఫోటోలు దిగుతూ ఫుల్ ఎంజాయ్ చేసింది. మాళవిక పులితో ఉన్న సమయంలో ఆమె మొహంలో నవ్వు తప్ప కొంచెం బెరుకు కూడా కనిపించలేదు. థాయ్‌లాండ్‌లోని పార్క్ పటాయలో షేర్‌తో దిగిన ఫోటోలని తన ట్విట్టర్‌లో ఫోటోలని షేర్ చేసిన మాళవిక.. ఇక్కడి పులులకి మనుషులతో స్నేహం చేయడాన్ని చిన్నప్పటి నుండే నేర్పుతారు. మీరు థాయ్‌లాండ్ కనుక వెళితే టైగర్ పార్క్ పటయని సందర్శించండి. అక్కడి పులులతో ఆడుకోండి. అవి చాలా క్యూట్‌గా ఉంటాయి. మనుషులని ఏమి చేయవు అని కామెంట్ పెట్టింది. మాళవిక ఇటీవల నేల టిక్కెట్టు అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఆమెకి నిరాశే మిగిలింది. నేల టిక్కెట్టు చిత్రంలో రవితేజ ప్రధాన పాత్ర పోషించిన విషయం విదితమే.
పులితో శివంగి
Related tags :