తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు సందర్భంగా TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, TRS NRI ముఖ్య సలహాదారు kalvakuMTla కవిత, TRS NRI కోఆర్డనేటర్ మహేష్ బిగాల ఆదేశాల మేరకు దాదాపు నలభై దేశాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం పండుగలా సాగుతోంది. ఈ మేరకు TRS ఖత్తర్ శాఖ అధ్యక్షులు అబ్బగౌని శ్రీధర్ మరియు ఉపాధ్యక్షుడు నర్సయ్య దొనికేని ఆధ్వర్యంలో ఈ రోజు దోహా ఖతార్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ టృశ్ మరియు కేసిఆర్ జనాకర్షక పాలనకు వివిధ వర్గాల ప్రజలందరి నుండి విపరీతమైన స్పందన ఉందని, కేవలం తెలంగాణ వాసులే కాకుండా వివిధ రాష్ట్రల ప్రజలు టృశ్ పార్టీ సభ్యత్వాన్ని తీసుకోడానికి స్వతహాగా ఫోన్ లు చేసి మరి సభ్యత్వాన్ని తీసుకుంటున్నారని తెలిపారు. అలాగే ణృఈలు తమ తమ నియోజకవర్గల్లో సైతం సభ్యత్వ నమోదు లో ముందున్నారని ఇటీవలే జగిత్యాల జిల్లా మెట్పల్లి, జగ్గసాగర్ లో ఖతార్ తెరాస ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేష్ కోరం గారి ఆధ్వర్యంలో అతి పెద్ద సభ్యత్వ నమోదు శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద నీటి పారుదల ప్రాజెక్టును కట్టిన తెలంగాణలో ఉన్న తెరాస ప్రభుత్వం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని, వివిధ దేశాల ప్రజల మధ్య చర్చనీయాంశం అయిందని తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ని అభినందించారు. ఈ సందర్భంగా పలువురు ప్రవాసులు మాట్లాడుతూ దేశానికి గర్వకారణమైన ఈ ప్రాజెక్టును తము తమ తదుపరి భారత పర్యటనలో ప్రత్యక్షంగా వీక్షించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఖతార్ ఎన్నారై తెరాస సభ్యత్వ నమోదుకు విశేష స్పందన
Related tags :