* ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్‌లో అమెరికా వెళ్లనున్నట్లు సమాచారం. న్యూయార్క్ నగరంలో జరిగే ఐరాస సాధారణ అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరయ్యే అవకాశం ఉన్నట్లు అమెరికాలోని భారత వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఆయన అక్కడి భారతీయులను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉందన్నారు. అందుకోసం చికాగో లేదా హౌస్టన్ నగరాలు వేదిక కానున్నాయన్నారు. భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం మోదీ ఐరాస సమావేశానికి వెళతారన్నారు. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినా.. సెప్టెంబర్ 22న మోదీ ప్రసంగం కోసం ఏర్పాట్లు చేయాలని వారికి సమాచారం అందినట్లు తెలిపారు.2014లో ప్రధాని బాధ్యతలు చేపట్టిన తరువాత అమెరికాలోని భారతీయులను ఉద్దేశించి ప్రసంగించడం ఇది మూడోసారి కానుంది. గతంలో 2014లో న్యూయార్క్ మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో, 2016లో సిలికాన్ వ్యాలీలో భారీ సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. ఇంధన రాజధానిగా పేరున్న హౌస్టన్‌లో ఈసారి సభ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంధన భద్రతకు మోదీ అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఈ నగరాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. భారతీయులు ఎక్కువగా ఉన్న నగరాల్లో హౌస్టన్ ఒకటి కావడం మరో కారణం.
* చేతగాక చేతులు కత్తిరిస్తామంటున్నారు: యనమల
నవరత్నాలు కాదు.. నవ కోతలు-నవ రద్దులు అని టీడీపీ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. బడ్జెట్‌లో రద్దు చేసిన పథకాలు ఎన్నో చెప్పాలన్నారు. పేర్లు మార్చి పేదల మనసుల్లోంచి టీడీపీని తొలగించలేరని స్పష్టం చేశారు. తొలి బడ్జెట్‌లోనే వైసీపీ నేతలు వెల్లకిలా పడ్డారని విమర్శించారు. చేతగాక చేతులు కత్తిరిస్తామంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పాత పథకాలకే నవరత్నాల ముసుగు వేస్తున్నారని మండిపడ్డారు. కరవు నివారణ చర్యల గురించి బడ్జెట్‌లో ప్రస్తావన లేదన్నారు. రీటెండరింగ్ పేరుతో పోలవరం, రాజధాని పనులకు గండికొట్టారని చెప్పారు. రాజధాని నిర్మాణానికి రూ.500 కోట్లు పెట్టడమే వైసీపీ నేతల చేతకాని తనానికి నిదర్శనమన్నారు.
*సుప్రీంకోర్టుకు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు
కర్ణాటకలో తలెత్తిన రాజకీయ సంక్షోభం వరుస మలుపులు తిరుగుతోంది. మరో ఐదుగురు కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలు శనివారంనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్వచ్ఛందంగానే తాము పదవులకు రాజీనామా చేసినందున వాటిని అసెంబ్లీ స్పీకర్ తప్పనిసరిగా ఆమోదించాలని ఆ పిటిషన్‌లో కోరారు.కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, కె.సుధాకర్, ఎన్.నాగరాజు, మునిరత్న, రోషన్ బేగ్ ఈ పిటిషన్ వేశారు. స్వచ్ఛందంగానే తాము రాజీనామా చేసినందున తమపై క్రమశిక్షణావేటు వేయకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. తాము రాజీనామా చేసినప్పుడు ఎలాంటి అనర్హతా ప్రొసీడింగ్స్ లేవిని వారు తమ పిటిషన్‌లో కోర్టుకు విన్నవించారు. ‘ఎమ్మెల్యేలను బెదరించేందుకు అనర్హత వేటు ప్రొసీడింగ్స్‌ను ఉపయోగిస్తున్నారు. తమ రాజీనామాలపై ఒకవైపు స్పీకర్ చర్యలు తీసుకోకపోగా, మరోవైపు ఈనెల 12న ప్రారంభమైన శాసనసభా కార్యాక్రమాల్లో పాల్గొనకుంటే అనర్హత వేటు వేస్తామంటూ విప్ జారీ చేశారు’ అని ఆ పిటిషన్ పేర్కొంది. ఈనెల 10న రాజీనామా సమర్పించేందుకు వెళ్లిన కొంత మంది ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో చేయిచేసుకోవడం, నిర్బంధించడం వంటివి జరిగాయని కూడా వారు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.
* బిజెపి సునీల్ థియోధర్ కామెంట్స్ ,,,,,,,,,
షెడ్యూల్ కులాల వారికి మోదీ ప్రభుత్వం మాక్సిమం మేలు చేకూర్చింది.దేశం లోను , రాష్ట్రంలో ను సామాజిక న్యాయం చేశామన్నారు..గ్రామ గ్రామానికి బిజెపి ను తీసుకెళ్తాం..షెడ్యూల్ కులాల వారు కాంగ్రెస్ ను బాగా విశ్వసించారు.. అయినా పలు పార్టీలు వారిని విస్మరించాయి..బిజెపి ఎస్ సి ల కు రాజాకీయంగా ప్రాధాన్యత కల్పిస్తుంది..
రానున్న 5 ఏళ్ల లో బిజెపి బలపడుతుంది..కుల పార్టీ లకు చరమగీతం పాడతారు..కుల మతాలకు అతీతంగా షబ్ కా సాత్ షబ్ కా వికాస్ పేరుతో ఆదరిస్తుంది అన్నారు..పీఎం భీమా యోజన ద్వారా కోట్లాదిమంది కి మేలు జరిగింది..
* 23 మంది ఎమ్మెల్యేలకే రక్షణ లేకపోతే..: జగన్‌పై నారాయణ ధ్వజం
ఏపీ సీఎం జగన్ నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ.. తాము 151 మంది శాసనసభ్యులం ఉన్నామని, తామంతా లేస్తే 23 మంది శాసన సభ్యులు అసెంబ్లీలో నిలవగలరా? అని మండిపడ్డారు.దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై సీపీఐ నేత నారాయణ ట్విట్టర్ ద్వారా మండిపడ్డారు.‘‘మేము 151 మంది శాసన సభ్యులం ఉన్నాము.. మేమంతా లేస్తే మీ 23 మంది శాసనసభ్యులు అసెంబ్లీలో నిలవగలరా?’ అత్యున్నత శాసనసభలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గారు టీడీపీని ఉద్దేశించి మాట్లాడారు. శాసనసభలో 23 మంది ఎమ్మెల్యేలకే రక్షణ లేకపోతే.. ఇక చట్టసభలలో తక్కువ మంది ఉన్న ప్రతిపక్షాలపై అప్రకటిత నిషేధమేనా?
*ఏపీలో టీడీపీ ఖాళీ అయిపోవడం ఖాయం: కన్నా
మాజీ ఎమ్మెల్యే లు, మంత్రులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఆదివారం రాజేష్‌సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో బీజేపీలోకి భారీగా చేరికలుంటాయని తెలిపారు. ఎవరెవరు చేరుతున్నారో మీరే చూస్తారని, ఏపీలో టీడీపీ ఖాళీ అయిపోవడం ఖాయమని ఎద్దేవాచేశారు. ఏపీ బడ్జెట్ పేపర్ మీద బాగున్నా..అమల్లో కనిపించదని విమర్శించారు. టీడీపీ నేత చంద్రబాబు తరహాలోనే జగన్ పాలన కొనసాగుతోందని ఆరోపించారు. వైఎస్ ప్రజల మనిషి, ఆయనతో ఎవరినీ పోల్చలేమన్నారు. సీఎం జగన్ చెబుతున్న మాటలు.. హామీలు, చేతల్లో చూపించాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.
*ఎస్సీ వర్గీకరణపై తన వైఖరేంటో జగన్ చెప్పాలి: హర్షకుమార్
ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన వైఖరేంటో ప్రకటించాలని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. శనివారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ… ఎస్సీ వర్గీకరణకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. ఎస్సీ వర్గీకరణపై అందరి అభిప్రాయాలు తీసుకోవాలని, వర్గీకరణను ఎంపీలు వ్యతిరేకిస్తున్నా కేంద్రం ముందుకే వెళ్తోందని హర్షకుమార్ అన్నారు.
* రైతు రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలి : కాంగ్రెస్
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడి 7 మాసాలు గడుస్తున్నా రైతులకు ఇప్పటి వరకు ఎలాంటి సహాయం చేయలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో రైతులకు లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పిన టీఆర్‌ఎస్.. ఈ అంశంపై ఇప్పటి వరకు స్పందించలేదని మండిపడ్డారు. అసలు రుణమాఫీ ఒకేసారి చేస్తారా, విడతల వారీగా చేస్తారా అనే స్పష్టత ఇవ్వాలన్నారు. రైతు బంధు పథకం పై గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇప్పవరకు కేవలం 50 శాతం రైతులకు మాత్రమే రైతు బంధు చెక్కులు అందాయన్నారు.
* సుప్రీంను ఆశ్రయించిన ఐదుగురు ఎమ్మెల్యేలు
కర్ణాటక స్పీకర్‌కి వ్యతిరేకంగా మరో ఐదుగురు రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆనంద్ సింగ్, రోషన్ బేగ్ సహా ఐదుగురు ఎమ్మెల్యేలు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. తమ రాజీనామాలు ఆమోదంలో స్పీకర్ జాప్యం చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే 10 మంది రెబల్ కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం మంగళవారం వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. అప్పటివరకూ రాజీనామాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఆదేశించింది.
* కుమారస్వామి ప్రభుత్వానికి 17న బలపరీక్ష?
కర్నాటకలో వారం రోజులుగా అనేక మలుపులు తిరుగుతున్న పొలిటికల్ డ్రామా ప్రీక్లైమాక్స్కు చేరింది. తాను బలపరీక్షకు నిలబడతానని ముఖ్యమంత్రి కుమారస్వామి గౌడ శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించడం సంచలనంగా మారింది. ఆయన భావిస్తున్నట్లు ఈ నెల 17నే(బుధవారం) బలపరీక్ష జరిగితే క్రైసిస్కు ఎండ్కార్డ్ పడ్డట్టే! కాగా, ఇప్పటి వరకు కాంగ్రెస్‌తో కలిసి ప్రయాణించిన జేడీఎస్.. తాజాగా బీజేపీతో జట్టుకట్టబోతున్నదనే అనూహ్య చర్చ రాజకీయ వర్గాల్లోనడుస్తోంది. జేడీఎస్‌కు బీజేపీ డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేసిందన్న ప్రచారం కన్నడనాట జోరుగా సాగుతోంది. వీటిని ఏ పార్టీకూడా నిర్ధారించలేదు. బీజేపీతో సహా అన్ని పార్టీలూ ముందుజాగ్రత్త చర్యగా తమ ఎమ్మెల్యేల్ని రిసార్ట్స్కు తరలించాయి. 17వ తేదీనే బలపరీక్ష నిర్వహించాలని బీఏసీ మీటింగ్లో స్పీకర్ను సీఎం కోరారు. అయితే, ప్రతిపక్ష బీజేపీ సమావేశానికి రానందున, సోమవారం జరిగే బీఏసీలో బలపరీక్ష డేట్, టైమ్ ఫిక్స్ చేద్దామని స్పీకర్ సూచించారు. మరోవైపు రెబల్ ఎమ్మెల్యేల కేసులో కర్నాటక స్పీకర్పై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. ఈ నెల 18 వరకు ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని సీజేఐ బెంచ్ ఆదేశించింది. వీళ్లు కాకుండా మరో ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేల్ని తన ముందు హాజరు కావాలంటూ స్పీకర్ తాజాగా నోటీసులు జారీచేశారు.
* అందువల్లే ఎన్నికల్లో ఓడాం – కోదండరాం
తెలంగాణ జనసమితి తొలి ప్లీనరీ ఇవాళ హైదరాబాద్‌లో జరగనుంది. ఈ ప్లీనరీని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. పార్టీ పునర్నిర్మాణం, భవిష్యత్ కార్యచరణపై ఇందులో చర్చిస్తామన్నారు ఆ పార్టీ చీఫ్ కోదండరాం. ఎన్నో పోరాటాలు, ప్రాణత్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో…… నీళ్లు, నిధులు, నియామకాలా ఊసే లేదంటూ ఫైర్ అయ్యారు.హైదరాబాద్‌లో ఇవాళ తెలంగాణ జసమితి మొదటి ప్లీనరీ సమావేశం జరగనుంది. దీనికి ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఎన్నికల కారణంగా ప్లీనరీని రెండు నెలలు వాయిదా వేశారు. ఇవాళ జరిగే ఈ ప్లీనరిలో విద్య, వైద్యం, ఆరోగ్యం, సంక్షేమం లాంటి ఆరు అంశాలపై తీర్మానం చేయనున్నారు. దీంతో పాటు పార్టీ పునర్నిర్మాణం, రాజకీయ భవిష్యత్ కార్యచారణ వంటి అంశాలపై చర్చిస్తారు. అధ్యక్ష ఎన్నిక, ప్రతినిధుల సభ, ముగింపు సమావేశం జరుగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. సభకు సంబంధించి అన్ని అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు టీజేఎస్ చీఫ్ కోదండరామ్.
* ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ పిసి ,,,,,,,,,,,
ప్రత్యేక హోదా విభజన హామీల సాధనకై ముఖ్యమంత్రి కి కొంత సమయం ఇవ్వాలని అనుకున్నాం
హోదా రాదు అని కేంద్ర మంత్రులు చాలా సార్లు చెప్పారు ,వారే విభజన సాధ్యం కాదు అని కూడా చెప్పారు. హోదా సాధనకై అందరూ కలిసి రావాలి ,ముఖ్యమంత్రి విభజన హామీల సాధనకై కృషి చేయాలికొన్ని రాష్ట్రాలకు పరిశ్రమల రాయితీలు కొనసాగిస్తున్నారువెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు,కొత్త ప్రభుత్వానికి ఎందుకు సహకరించడంలేదుగుజరాత్ కు అనేక రాయితీలు ఇచ్చి ఏపీ కి ఎందుకు ఇవ్వడంలేదుకృష్ణా గోదావరి జలాలపై మేధావుల సలహా తీసుకోవాలికేసీఆర్ ఔదార్యం చూపిస్తున్నారా? తెలంగాణ కోసం ఏమైనా చేస్తారు దాన్ని మెచ్చుకుంటున్నాంపోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయకుంటే ఎగువ రాష్ట్రాలు నిర్మించే ప్రాజెక్టుల వలన మొదటి పంటకు కూడా నీరు రాని పరిస్థితి ఏర్పడుతుంది42 కిలోమీటర్ల సొరంగం ఇప్పటిదాకా పూర్తి కాలేదు వందల కిలోమీటర్ల సొరంగం ద్వారా నీరు ఎలా తీసుకెళ్తారు?ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి అన్యాయం చేస్తారనుకోవడం లేదు కానీ నీటి పారుదల విషయంలో సలహా ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు1956 లో ఆంధ్ర తెలంగాణ మాదిరిగానే పంజాబ్,హర్యానా కూడా కలిసాయి,నీటి పారుదలపై అగ్రిమెంట్ లు జరిగాయివిడిపోయాక కాలువలకు నీరు వదలాలి అని కోర్టు తీర్పు ఇచ్చినా పంజాబ్ ప్రభుత్వం వినలేదు..
* ఆయన డేరింగ్ నిర్ణయం వెనుక లెక్కేంటి?
పక్కలో బల్లెంలా మారిన బీజేపీకి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు సీఎం కుమారస్వామి. అవిశ్వాస పరీక్షను తెరమీదకు తీసుకొచ్చారు. ఉంటుందో.. ఊడుతుందో తెలీని గందరగోళ స్థితిలో కుమారస్వామి డేరింగ్ నిర్ణయం వెనుక లెక్కేంటి?కాంగ్రెస్ మద్దతుతో సీఎం కుర్చి ఎక్కిన కుమారస్వామికి దిన దిన గండంలానే గడిచింది. తొలిరోజుల్లో కాంగ్రెస్ పోటును భరించలేక కన్నీరు పెట్టుకునే పరిస్థితి దిగజారారు కుమారస్వామి. ఓకానొక సమయంలో ఇక నా వల్ల కాదు అంటూ కాడెత్తేసే స్థితికి చేరుకున్నారు. అది కాంగ్రెస్ వ్యూహమా? కుమారస్వామికి కలిసిరాని కాలమా అనేది ఎలా ఉన్నా..ఆ రెండు పార్టీల మధ్య సఖ్యత లేదు. అయితే..సంక్షోభ సమయంలో మాత్రం విభేదాలను పక్కనబెట్టి ఒకరికొకరం అంటూ కలరింగ్ ఇస్తూ వస్తున్నాయి.కూటమి కుంపట్లతో వేగుతూ వస్తున్న కుమారస్వామికి బీజేపీ గండాలు సృష్టిస్తూ వస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకొని ఇప్పుడు రాజకీయాన్ని రసవత్తరంగా మార్చింది బీజేపీ. ఏకంగా 14 మంది కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుంది. దీంతో కూటమి ప్రభుత్వానికి గండికొట్టే స్కెచ్ తో పొలిటికల్ షో చూపిస్తోంది. అయితే..అపత్కాల సమయంలో అనూహ్య నిర్ణయంతో బీజేపీకి షాక్ ఇచ్చారు కుమారస్వామి. తాను అవిశ్వాసానికి వెళ్తున్నట్లు ఆయన ప్రకటించారు. డేటు టైం ఫిక్స్ చేయాలని కోరారు. అటు స్పీకర్ హెచ్ ఆర్ రమేష్ కూడా అవిశ్వాస పరీక్షలో బలాబలాలు తేల్చేందుకు తాను కూడా సిద్ధం అంటూ ప్రకటించారు.
* జగనన్న జంపింగ్ జపాంగ్.. లోకేష్ సెటైరికల్ ట్వీట్
ఏపీ బడ్జెట్‌పై విరుచుకుపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్. ట్విట్టర్ వేదికగా సర్కార్ తీరును ఎండగట్టారు. రైతుల్ని, అమ్మఒడి లబ్ధిదారుల్ని సీఎం జగన్… అవమానించారంటూ ట్వీట్ చేశారు. బడ్జెట్ చూస్తుంటే.. జగన్ నామమాత్ర సీఎంలా అనిపిస్తున్నారంటూ సెటైర్ వేశారు లోకేష్.జగన్ ప్రభుత్వ బడ్జెట్‌పై… టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్….. ట్విట్టర్ వేదికగా సెటైర్లతో రెచ్చిపోయారు బడ్జెట్ లో జగన్ కేటాయింపులే నామమాత్రమా? లేక.. హామీలు కూడా నామమాత్రమా? అంటూ ఎద్దేవా చేశారు. చూస్తుంటే జగన్ నామమాత్ర ముఖ్యమంత్రిలా అనిపిస్తున్నారన్నారు. రైతుల వడ్డీలేని రుణాలకు 3 వేల 500 కోట్లు ఎందుకు కేటాయించలేదని.. ఇదేనా మీ చిత్తశుద్ధి అంటూ ప్రశ్నించారు లోకేష్. గత ప్రభుత్వం అసలేమీ ఇవ్వలేదని ఒకరోజు, ఇంతే ఇచ్చిందని మరోరోజు విమర్శించిన జగన్ ప్రభుత్వం… తీరా బడ్జెట్ లో నామమాత్రంగా వంద కోట్లు మాత్రమే కేటాయించారంటూ సెటైర్ వేశారు లోకేష్.
* కర్ణాటక సంకీర్ణంలో చిగురిస్తున్న ఆశలు.. డీకే శివకుమార్..
కర్నాటక రాజకీయాల్లో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలతో ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ జరుపుతున్న సంప్రదింపులు ఫలిస్తున్నాయి. MTB నాగరాజుతో ఉదయం డీకే సమావేశం అయ్యారు. కృష్ణ భైరవ గౌడ సహా మరికొందరితోను మంతనాలు సాగించారు. డిప్యూటీ సీఎం పరమేశ్వర్‌తో తమకు ఇబ్బంది ఉందని కొందరు రెబల్స్ చెప్పగా.. హుటాహుటిన ఆయన్నీ సమావేశానికి రప్పించారు. అసంతృప్తుల డిమాండ్లకు అంతా ఓకే అన్నారు.
*నవరత్నాలు నాణ్యత.. జగన్ విశ్వనీయత కోల్పోయారు: తులసిరెడ్డి
బడ్జెట్‌లో నవరత్నాలు నాణ్యత కోల్పోయాయని.. జగన్ మోహన్ రెడ్డి విశ్వసనీయత కోల్పోయారని పీసీసీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి పేర్కొన్నారు. నవరత్నాలలో కొన్నింటికి కేటాయింపులు లేవని.. మహిళలకు సంబంధించిన ఆసరాకి అన్యాయం జరిగిందన్నారు. అభయహస్తానికి కేటాయింపులు లేవని.. ప్రభుత్వ ఉద్యోగాలపై ప్రకటన లేదని.. నిరుద్యోగులకు నిరుత్సాహాన్ని కలిగించేలా బడ్జెట్ ఉందన్నారు.
జలయజ్ఞానికి గతంలో కంటే తక్కువ నిధులు కేటాయించారన్నారు. గృహ నిర్మాణ పేదల ఇళ్లపై స్పష్టత లేదన్నారు. ఆరోగ్యశ్రీకి నిధులు చాలవన్నారు. అమ్మ ఒడిపై క్లారిటీ లేదని.. నిషేధం అంటూనే మద్యంపై ఆదాయం ఎక్కువ చూపారని తులసీరెడ్డి విమర్శించారు. రైతు దినోత్సవంలో 3,500 కోట్లు అంటూ బడ్జెట్‌లో మాత్రం రూ.100 కోట్లు పెట్టారు.. పిట్టల దొర కోతల రాయుడు అంటూ తులసిరెడ్డి ఎద్దేవా చేశారు.
*మేధావుల సలహా తీసుకోవాలి: చలసాని
ప్రత్యేక హోదా సాధనకు అందరూ కలిసిరావాలని ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విభజన హామీల సాధనకు సీఎం కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కేంద్రం ఏపీకి అన్యాయం చేస్తూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్‌కు అనేక రాయితీలు ఇచ్చి ఏపీకి ఎందుకు ఇవ్వడంలేదని ఆయన ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి జలాలపై మేధావుల సలహా తీసుకోవాలన్నారు. పోలవరం పూర్తి చేయకుంటే ఎగువ రాష్ట్రాలు నిర్మించే ప్రాజెక్టుల కారణంగా మొదటి పంటకు కూడా నీరు రాని పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
* నమ్మకం ఉంది కాబట్టే సాహసం చేస్తున్నాం-కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
కన్నడ నాట రాజకీయ సంక్షోభం ఏర్పడటంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విశ్వాస పరీక్షకు సిద్ధమైన విషయం తెలిసిందే. నిన్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా మాట్లాడారు. బల నిరూపణకు ఆహ్వానించి సాహసం చేస్తున్నట్లున్నారని మీడియా అడగ్గా దానికి ఆయన సమాధానం చెప్పారు.
* రెబల్స్ ను బుజ్జగించే పనిలో సంకీర్ణం
అసమ్మతి సెగతో మొదలైన కర్ణాటక రాజకీయ సంక్షోభం చివరకు బలపరీక్షదాకా వెళ్లింది. సభలో తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నానని స్వయంగా సీఎం కుమారస్వామి ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. అయితే విశ్వాస పరీక్షలో నెగ్గాలంటే అసంతృప్త ఎమ్మెల్యేలు కూడా సంకీర్ణానికి ఓటేయాల్సిన పరిస్థితి. దీంతో వారిని బుజ్జగించే పనిలో పడ్డారు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు. శనివారం తెల్లవారుజామున కాంగ్రెస్ మంత్రి డీకే శివకుమార్.. అసంతృప్త ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజ్ ఇంటికి వెళ్లారు. ఆయన వెంట ఉపముఖ్యమంత్రి పరమేశ్వర కూడా ఉన్నారు. రాజీనామాకు వెనక్కి తీసుకోవాలని వీరు నాగరాజ్‌ను కోరారు.
*రైల్వే లైన్లపై సమాధానమిస్తా: పీయూష్ గోయల్
తెలంగాణలో పెండింగ్ రైల్వే లైన్ ప్రాజెక్టులకు సంబంధించి లిఖితపూర్వకంగా సమాధానమిస్తానని రైల్వేమంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. శుక్రవారం బడ్జెట్ పద్దులపై చర్చకు పీయూష్ గోయల్ సమాధానమిచ్చారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణలోని రైల్వే పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని తెరాస లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు కోరారు. దీనిపై కేంద్రమంత్రి స్పందిస్తూ.. ఆయా అంశాలకు సంబంధించి లిఖితపూర్వకంగా సమాధానమిస్తానన్నారు.
*కుంభకోణాలపైనే మీ దృష్టంతా..
దేశ ఆర్థిక వ్యవస్థ అయిదేళ్లకోసారి రెట్టింపవుతుందని, అందుకోసం ప్రభుత్వాలే ఉండాల్సిన అవసరంలేదని ఆర్థికశాఖ మాజీ మంత్రి పి.చిదంబరం చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ గట్టిగా తిప్పికొట్టారు. ‘మీరు చెప్పినదే నిజమైతే స్వాతంత్య్రానంతరం 60ఏళ్లు పాలించిన కాంగ్రెస్ హయాంలో ఆర్థిక వ్యవస్థ ఎందుకు రెట్టింపుకాలేదు? మీది ‘హిందూ వృద్ధి రేటు’ (ఆర్థిక సంస్కరణలకు ముందు అంతంత మాత్రంగా ఉన్న వృద్ధి రేటు) అన్న ఆరోపణలు మన మీద ఎందుకు వచ్చాయి? యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి పై ఎందుకు దృష్టి పెట్టలేదు? ఎందుకు కుంభకోణాలు వరసగా జరిగాయి?’ అని ప్రశ్నించారు. శుక్రవారం రాజ్యసభలో బడ్జెట్పై చర్చకు మంత్రి సమాధానమిస్తూ చిదంబరం చేసిన ఆరోపణలకు ఒకొక్కటిగా బదులిచ్చారు. 5 ట్రిలియన్డాలర్లు అనేది కేవలం గణాంకమని, వడ్డీవ్యాపారి కూడా ఆ పనిచేయగలరని చిదంబరం వ్యాఖ్యానించడంపై మండిపడ్డారు. ఆర్థిక వ్యవస్థ తనంతటతానుగా రెట్టింపవుతుందనే యూపీఏ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థపై దృష్టిపెట్టకుండా కుంభకోణాలపై దృష్టిసారించినట్లుందని ఎద్దేవా చేశారు.
*రుణాలపై మరోసారి రగడ
వ్యవసాయ రుణాలమీద సున్నా వడ్డీ అంశంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలతో శుక్రవారం కూడా ఏపీ శాసనసభ దద్దరిల్లింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. రూ.లక్ష అప్పులో రూ.ఐదు వేలు చెల్లించి రుణం మొత్తం చెల్లించామన్నట్లుగా బాబు వైఖరి ఉందని తప్పుపట్టారు. ‘వడ్డీ సొమ్ము చెల్లించకుండా రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తారా? మోసాలన్నీ ప్రజలంతా గమనించినందునే మీ (తెదేపా) సీట్లు 23కి పడిపోయాయి. ఇదే ధోరణి కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో సీట్లు 13కి పడిపోతాయి’ అని వ్యాఖ్యానించారు. సభ్యులు ఒకరినొకరు దూషించుకుంటూ పెద్దఎత్తున నినాదాలు చేయడం గందరగోళానికి దారితీసింది.
*విశ్వాస పరీక్షకు కుమార సన్నద్ధం
శాసనసభలో బలనిరూపణకు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సిద్ధమయ్యారు. సభలో ఈ మేరకు ఆయన విస్పష్ట ప్రకటన చేశారు. మరోవైపు రాజకీయ సంక్లిష్టతల దృష్ట్యా మంగళవారం వరకు రాష్ట్రంలో యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు శుక్రవారం తేల్చిచెప్పింది. ఈ పరిణామాలు రాజకీయాలను ఊహించని మలుపు తిప్పాయి. శుక్రవారం రాష్ట్ర శాసనసభ ప్రారంభమయ్యాక నిమిషాల వ్యవధిలోనే ముఖ్యమంత్రి రాజకీయ పరిణామాలను ప్రస్తావించారు. ‘మిత్రపక్షాల ఎమ్మెల్యేల రాజీనామాలతో రాష్ట్రంలో అనిశ్చితి నెలకొంది. నేను మా బలాన్ని నిరూపించుకోగలనన్న విశ్వాసంఉంది. అందుకు తగిన గడువు విధించండి’ అంటూ స్పీకర్కు ఆయన విన్నవించారు.
*కిషన్రెడ్డి ఓఎస్డీగా ఆమ్రపాలి!
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి పేషీలో ముగ్గురు తెలంగాణ అధికారులు పని చేయనున్నారు. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్లుగా ఉన్న ఆమ్రపాలిని ఓఎస్డీగా, శశికిరణాచారిని హైదరాబాద్లో అదనపు ప్రైవేటు కార్యదర్శిగా, ఐపీఎస్ అధికారి ఉత్తర మండల డీసీపీ ఏకేఝాను ప్రైవేటు కార్యదర్శిగా డిప్యుటేషన్పై పంపాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చాయి. తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు చెందిన ఆరుగురు ఐఏఎస్, ఐపీఎస్ల పేర్లను పరిశీలించిన హోం మంత్రిత్వశాఖ ఈముగ్గురు పేర్లను ఖరారు చేసినట్లు తెలిసింది.
*కర్ణాటకలో ప్రజా ప్రభుత్వాన్ని రక్షిస్తా: స్పీకర్
‘వందనం చేసే నెపంతో మహాత్మాగాంధీని చంపిన వ్యక్తులున్న సమాజం మనది. అలాంటి సమాజానికి నాపై నిందలు వేయటం ఓ లెక్కా?’ అని కర్ణాటక స్పీకర్ రమేశ్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను కార్యాలయంలో లేనప్పుడు కొందరు ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించారు. వారు ఇష్ట ప్రకారమే చేస్తున్నారా? లేదా? తెలుసుకోవద్దా? ఉద్దేశపూర్వకంగా అంగీకరించటం లేదన్న విమర్శలెందుకు?’ అని వాపోయారు.
*బ్యాంకుపై ఆరోపణల కేసులో రాహుల్ గాంధీకి బెయిల్
కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీకి ‘అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు’ కేసులో శుక్రవారం బెయిల్ లభించింది. 2016లో పెద్దనోట్ల రద్దును ప్రకటించిన 5 రోజుల వ్యవధిలోనే ఈ బ్యాంకు రూ.750 కోట్ల విలువైన రద్దయిన నోట్లను కొత్త వాటితో మార్పిడి చేసిందన్న రాహుల్ ఆరోపణలపై బ్యాంకు పరువునష్టం దావా వేసింది. ప్రస్తుత కేంద్రమంత్రి అమిత్ షా అప్పట్లో ఈ బ్యాంకు డైరెక్టర్లలో ఒకరుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి తానేమీ తప్పు చేయలేదని రాహుల్గాంధీ వాదించారు. బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. కేసు తదుపరి విచారణను సెప్టెంబరు ఏడోతేదీకి వాయిదా వేసింది.
*తెరాసలో పరిశోధన, విశ్లేషణ విభాగం
తెలంగాణ రాష్ట్ర సమితి 30 మందితో పరిశోధన, విశ్లేషణ విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రసార మాధ్యమాలలో చర్చలు, రచనల కోసం వీరిని ఉపయోగించుకోనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదించిన వెంటనే దీనిని ప్రకటించనుంది. తెరాస తరఫున ప్రసార మాధ్యమాలలో చర్చలకు ప్రస్తుతం తెరాస నేతలు దూరంగా ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత నెలలో పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
*తాడేపల్లిలో వైకాపా కేంద్ర కార్యాలయం
వైకాపా కేంద్ర కార్యాలయాన్ని గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఏర్పాటు చేయనున్నారు. నాలుగు అంతస్తులున్న ప్రైవేట్ భవనంలో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పనులు దాదాపు పూర్తయ్యాయని, ఈ నెలాఖరులోగా కార్యాలయాన్ని ప్రారంభించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ లోటస్పాండ్లో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఇప్పటికే పలు విభాగాలను అమరావతికి మార్చారు. మరోవైపు రాష్ట్ర కార్యాలయాన్ని విజయవాడ ఎంజీ రోడ్డులో నిర్వహిస్తున్నారు. వీటన్నింటినీ తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయానికి తరలించనున్నారు.
*అప్పులు పాపం వారిదే..
రాష్ట్రంపై గత ప్రభుత్వం అప్పుల భారాన్ని మోపిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసనమండలిలో ధ్వజమెత్తారు. మండలి ఛైర్మన్ ఎండీ అహ్మద్ షరీఫ్ అధ్యక్షతన శుక్రవారం సభ ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. ‘2014 జూన్లో రాష్ట్ర విభజన సమయంలో రూ.1,30,654.34 కోట్ల అప్పులను కేటాయించారు. ఇందులో విభజించని ప్రజా పద్దు రూ.33,477.52 కోట్లు ఉంది.
మళ్లీ అమెరికాలో ప్రసంగించనున్న మోడీ-రాజకీయం-07/13
Related tags :