DailyDose

వీసా రుసుం పెంచుతున్న నేపాల్-తాజావార్తలు–07/13

Nepal Hikes Visa Price - Daily Breaking News - July 13 2019

* నేపాల్ సందర్శించే విదేశీ పర్యాటకుల వీసా రుసుం ఈ నెల 17 నుంచి పెరిగే అవకాశం ఉంది. విదేశీ పర్యాటకుల వీసా ఛార్జీలను పెంచాలన్న నిర్ణయాన్ని మే నెలలోనే ప్రభుత్వం తీసుకుంది. రుసుము పెంపు నామమాత్రంగానే ఉంటుందని ఇమిగ్రేషన్ విభాగం అధికారులు శుక్రవారం తెలిపారు.
* ఈనెల 18, 19వ తేదీల్లో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు గవర్నర్‌‌‌‌ నరసింహన్‌‌‌‌ శుక్రవారం నోటిఫికేషన్‌‌‌‌ జారీ చేశారు. కొత్త మున్సిపల్‌‌‌‌ చట్టం ఆమోదం కోసం రెండు రోజులు అసెంబ్లీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 18న ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశమవుతుంది. 19న మధ్యాహ్నం 2 గంటలకు శాసన మండలి సమావేశమవుతుంది. 18న కొత్త మున్సిపల్‌‌‌‌ చట్టాన్ని సభలో సీఎం కేసీఆర్‌‌‌‌ ప్రవేశపెడుతారు. తర్వాత సభ మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. 19న ఉద యం 11 గంటల నుంచి ఒంటిగంట వరకు దీనిపై చర్చిస్తారు. చట్టానికి శాసనసభ ఆమోదం తెలుపగానే నిరవధికంగా వాయిదా వేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు మండలిలో జరిగే చర్చలో సీఎం పాల్గొంటారు. ఆ రోజు సాయంత్రమే బిల్లుకు మండలి ఆమోదం తెలుపుతుంది. వెంటనే నిరవధికంగా వాయిదా వేస్తారు.
* ‘థర్టీ ఇయర్స్ ఇండ్రస్టీ’గా గుర్తింపు తెచ్చుకున్న హాస్య నటుడు పృథ్వీరాజ్‌కు ఎట్టకేలకు వైసీపీ ప్రభుత్వంలో పదవి లభించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారుడిగా ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించిన పృథ్వీకి సీఎం జగన్ కీలక పదవి ఇచ్చారు. తిరుమల శ్రీవారి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటుతున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్‌కు (ఎస్‌వీబీసీ) చైర్మన్‌గా నియమించారు. పృథ్వీకి కీలక పదవి కట్టబెట్టడంతో మిగిలిన వైసీపీ మద్దతుదారులైన సినీ పరిశ్రమకు చెందిన కొందరు తమకు కూడా ఏదైనా పదవి దక్కుతుందేమోననే ఆశతో ఉన్నట్లు తెలుస్తోంది.టీడీపీ హయాంలో శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్ చైర్మన్‌గా దర్శకుడు రాఘవేంద్రరావు ఉన్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన గౌరవ ప్రదంగా ఆ పదవికి రాజీనామా చేశారు. 2018లో చానల్ చైర్మన్‌గా రాఘవేంద్రరావు నియమితులయ్యారు. దేవస్థాన ధర్మకర్తల మండలిలో సభ్యులుగా ఉంటూనే చానెల్ బాధ్యతలు కూడా నిర్వహించారు. రాఘవేంద్రరావు రాజీనామా చేసిన తర్వాత చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. ఇదే రంగానికి చెందిన పృథ్వీకి చైర్మన్ పదవి ఇవ్వడం గమనార్హం.ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జగన్ రాష్ట్రమంతా పాదయాత్ర చేశారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పృథ్వీ తన సొంత జిల్లాలో జగన్ పాదయాత్ర సందర్భంగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పట్లో ఆయన వైసీపీ తరుపున ఎన్నికల బరిలో దిగుతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే అప్పట్లో టికెట్ లభించలేదు. పృథ్వీ ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న విషయం విదితమే.
* కృష్ణాజిల్లాలో తెదేపా కార్యకర్తపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. వీరులపాడు మండలం జుజ్జూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో తెదేపా కార్యకర్తపై వైకాపా వర్గీయులు దాడి చేశారు. ఈ ఘటనలో తెదేపా కార్యకర్తకు స్వల్ప గాయాలు కాగా.. అతడిని నందిగామ ఆస్పత్రికి తరలించారు.
* నెల్లూరు జిల్లాలో వరుస భూప్రకంపనలు ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. తాజాగా మర్రిపాడు మండలంలో మరోసారి ప్రకంపనలు రావడంతో ఆందోళన చెందుతున్నారు జనం. రెండు సెకన్లపాటు వచ్చిన భూ ప్రకపంనలకు ప్రజలు ఇళ్లలోంచి బయటికి పరుగు తీశారు. వరుసగా నిన్న సాయంత్రం, ఈ రోజు ఉదయం వచ్చిన ప్రకంపనలకు టెన్షన్‌ పడుతున్నారు గ్రామస్థులు. గత ఏడాది జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో భూమి కంపించింది.
* రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్‌ లావణ్య ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సొంత భూముల్ని పోగొట్టుకున్నవారు మీడియా ముందు ఏకరవు పెడుతున్నారు. వంశపారంపర్యంగా వచ్చిన భూముల్ని తన అధికార బలంతో డబ్బుకు ఆశపడి ఇతరుల పేరిటి చేసిన ఘటనలు వెలుగుచూస్తున్నాయి.
* ఏపీ సెట్ నోటిఫికేషన్‌ను ఏయూ వీసీ నాగేశ్వరరావు విడుదల చేశారు. ఆగస్ట్‌ 5 నుంచి సెప్టెంబర్ 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. అపరాధ రుసుముతో అక్టోబర్ 3 వరకు దరఖాస్తుకు అవకాశం ఉందన్నారు. అక్టోబర్‌ 20న పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ఆరు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.
* నాగార్జున సాగర్ నుండి నీరు విడుదల చేయాలంటే నానా రకాల అనుమతులు తీసుకోవాల్సి వస్తుంది,అన్ని గేట్లు, పవర్ ప్రాజెక్ట్ సహా తెలంగాణ ఆధీనంలో ఉందిప్రాజెక్ట్ లు ట్రిబ్యునల్ ఆధీనంలో ఉండాలి,అన్నిటికన్నా ముందు పోలవరం పూర్తి చేయాలి,కర్ణాటక తో ఎందుకు ఒప్పందం జరగడంలేదు,తుంగభద్రకు తెలంగాణతో సంబంధం లేకుండా నీరు వచ్చే వెసులుబాటు ఉందిఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరుతున్నాము.
* గుంటూరు -నర్సరావుపేటలో తనపై పెట్టిన కేసును రద్దు చేయాలని కోరుతూ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మి హైకోర్టులో పిటిషన్మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అంశంపై తీర్పును రిజర్వులో ఉంచింది న్యాయస్థానం.నర్సరావుపేటకు చెందిన బుజ్జి వెంకాయమ్మ అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తనపై చీటింగ్, ఎస్సీ,ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారని పిటిషనర్ పేర్కొన్నారు
* ఏపీ సెట్ నోటిఫికేషన్‌ను ఏయూ వీసీ నాగేశ్వరరావు విడుదల చేశారు. ఆగస్ట్‌ 5 నుంచి సెప్టెంబర్ 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. అపరాధ రుసుముతో అక్టోబర్ 3 వరకు దరఖాస్తుకు అవకాశం ఉందన్నారు. అక్టోబర్‌ 20న పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ఆరు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.
* అసెంబ్లీలో రైతు సమస్యలపై జరిగిన చర్చలో సీఎం, మంత్రులు ప్రవర్తించిన తీరు సభ్య సమాజం సిగ్గు పడేలా ఉందిమనందరికీ అన్నం పెట్టే రైతును ఆదుకునే విషయంలో ప్రభుత్వ ధోరణి బాధాకరంవడ్డీ లేని రుణాల విషయంలో తెదేపా ప్రభుత్వంపై నిందలు వేశారు..మేం వాస్తవాలు చెప్పేసరికి దమ్మిడి, అణా అంటూ విషయాన్ని పక్కదోవ పట్టించారు వాస్తవాలు ఒప్పుకోకుండా చర్చను పక్కదారి పట్టించటం ప్రభుత్వానికే చెల్లిందిముఖ్యమంత్రి జగన్ సభలో మాట్లాడిన తీరు బాగాలేదుసంఖ్యా బలం చూపి బెదిరించేలా సీఎం మాట్లాడారుబడ్జెట్ ప్రసంగంలో రాష్ట్ర అభివృద్ధి ఎలా అనేది కనిపించడం లేదుఅభివృద్ధి విషయంపై ఆర్థిక మంత్రికి కనీస అవగాహన లేదుపిట్టకథలు వినేందుకు బాగుంటాయి తప్పితే ఉపయోగం లేదుతెదేపా ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదని చెప్పిన ముఖ్యమంత్రి…. ఈ బడ్జెట్లో సున్నా వడ్డీ కోసం కేవలం వంద కోట్లు మాత్రమే కేటాయించారుమాట్లాడే మాటలకు చేసే పనులకు సంబంధం లేదని రుజువైంది..రాష్ట్రంలో భాజపా కార్యకర్తలపై పోలీసుల వేధింపులకు నిరసనగా ధర్నాలు చేపడతాం
* నిన్నటి బడ్జెట్లో వ్యవసానికి 12.66 శాతం కేటాయింపులు చేశారుఉచిత విద్యుత్ కచేసిన ఖర్చుతో కలిపి వ్యవసాయ బడ్జెట్ 13.5 శాతం దాటుతుందిబడ్జెట్ లో వ్యవసాయంకు ముఖ్యమంత్రి పెద్ద పీట వేశారురైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిరైతులు గిట్టుబాటు ధర కోసం ధరలస్దిరీకరణ నిధిగా 3 వేల కోట్లు కేటాయించారుచంద్రబాబు రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పారుచంద్రబాబులాగా ముఖ్యమంత్రి జగన్ మాట తప్పే వ్యక్తి కాదుదేశంలో ఎక్కడ లేని విధంగా పంటలకు బీమా కడతామని ప్రకటించారు.
* బీజేపీ పార్లమెంటు సభ్యురాలు హేమమాలిని శనివారంనాడు ‘స్వచ్ఛ భారత్ అభియాన్’కు నడుం బిగించారు. పార్లమెంటు ఆవరణలోని రోడ్డును చీపురుకట్టతో శుభ్రం చేస్తూ సందడి చేశారు. త్వరలో మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల దృష్ట్యా ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ డ్రైవ్ నడుస్తోంది.కళ్లకు కూలింగ్ క్లాస్, చేతిలో చీపురుకట్టతో పార్లమెంటు ఆవరణను హేమమాలిని శుభ్రం చేస్తుండగా, ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఆమెతో కలిసారు. ఆ సన్నివేశాన్ని మీడియా తమ కెమెరాల్లో బంధించింది. పరిశుభ్రతా డ్రైవ్‌పై ఈ సందర్భంగా హేమమాలిని మాట్లాడుతూ, మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా పార్లమెంటు ఆవరణను శుభ్రం చేసేందుకు స్పీకర్ తీసుకున్న చొరవ ప్రశంసనీయమని అన్నారు. వచ్చే వారం మధురలో కూడా ‘స్వచ్ఛభారత్ అభియాన్’లో తాను పాల్గొంటానని చెప్పారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మధుర నియోజకవర్గం నుంచి 2 లక్షల 90 వేల ఓట్ల ఆధిక్యంతో హేమమాలిని గెలిచారు.
* నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని శనివారం ఆయన నివాసంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన అనుచరులతో కలిశారు .ఈ సందర్భంగా స్థానిక సమస్యలను ఇతర విషయాలను ప్రస్తావించారు. అనంతరం కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి , ఆదాల ప్రభాకర్ రెడ్డిని తన అనుచరులతో కలిసారు ఆయనతో తన నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించారు. ఇతర విషయాలను కాసేపు ముచ్చటించారు. ఆదాల ప్రభాకర్ రెడ్డిని మైపాడు నేత దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, గూడూరు సిఐ రామకృష్ణారెడ్డి కలిశారు. వీరితోపాటు జిల్లాకు చెందిన పలువురు వైసిపి నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆదాల ప్రభాకర్ రెడ్డిని కలిశారు. స్థానిక సమస్యలను ప్రస్తావించారు. కొందరు కార్యకర్తలు తమ అభిమాన నేతకు పుష్పగుచ్ఛాలు అందించి శాలువాలతో సత్కరించారు.
* కర్నూలు తుంగభద్ర జలాశయనికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో నీటి మట్టం రోజు రోజుకూ పెరుగుతోంది. తుంగభద్ర జాలాశయం ఇన్ ఫ్లో 26946 క్యూసెక్కులు ఉండగా… అవుట్ ఫ్లో 247 క్యూసెక్కులు ఉంది. ప్రస్తుత నీటిమట్టం 1589.28 అడుగులు ఉండగా… నీటినిల్వ 9.314 టీఎంసీలు ఉంది.
* విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా వైసిపి సీనియర్ నేత ద్రోణం రాజు శ్రీనివాస్ ను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ.
* నందమూరి బాలకృష్ణ త్రిడీలా ఊన్నారని ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కొనియాడారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో త్రిడి మామ్మోగ్రఫీ యంత్రాన్ని బాలకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కోడెల మీడియాతో మాట్లాడుతూ.. నటన, సేవ, రాజకీయాలు.. ఈ మూడు రంగాల్లో బాలయ్య ముందున్నారన్నారు. క్యాన్సర్ వైద్యం కోసం డాక్టర్లు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలన్నారు.వైద్యం, పరికరాలకు ఎంత ఖర్చు అయినా.. పేదలకు ఉచితంగా వైద్యం అందాలన్నారు.
* తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు రేపు (ఆదివారం) విడుదల కానున్నాయి. ఐఐటి, ఎన్‌ఐటి, ట్రిపుల్‌ ఐటి సీట్లు వచ్చిన విద్యార్థులు సప్లిమెంటరీ ఫలితాలు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారని ఓ విద్యార్థి తల్లి కెటిఆర్‌ కు ట్విట్టర్‌ లో విన్నవించారు. దీనిపై స్పందించిన కెటిఆర్‌.. ఈ నెల 14 న ఫలితాలు వెల్లడికానున్నాయని రీ ట్వీట్‌ చేశారు.
* తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు శనివారం పద్మావతి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. టిటిడి జెఇఒ బసంత్‌ కుమార్‌, జిల్లా కలెక్టర్‌ భరత్‌ గుప్తా, తిరుపతి ఎస్‌పి అన్బురాజన్‌, ఆలయ అధికారులు కలిసి గవర్నర్‌ దంపతులకు ఘనంగా స్వాగతం పలికారు…
* దబ్బగూడా గ్రామాన్ని‌ గజ రాజుల సంచార భయం వెంటాడుతోంది. హిరమండలం మండలం దబ్బగూడా గ్రామ సమీపంలో గజ రాజులు సంచరిస్తూ.. తమ పంటలను నాశనం చేస్తున్నాయని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏనుగులు సంచరించి నాశనం చేసిన పంటలకు ఇప్పటివరకూ పరిహారం అందలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు.
* నెల్లూరు అర్ధరాత్రి నెల్లూరు జిల్లాలో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు లోనయ్యారు. జిల్లాలోని మర్రిపాడు, ఆత్మకూరు మండలాల్లో భూప్రకంపనలు నమోదయ్యాయి. ఆయా మండలాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో భయకంపితులైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
* ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షల్లో 66.15 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన వెల్లడించారు.
* కర్ణాటకలో తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న కాంగ్రెస్-జేడీఎస్ కూటమి… తిరుగుబాటు ఎమ్మెల్యేల బుజ్జగింపునకు చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ నేత శివకుమార్… ఇటీవలే మంత్రి పదవికి రాజీనామా చేసిన నాగరాజ్తో సమావేశమయ్యారు. చర్చలు సఫలమయ్యాయని ప్రకటించారు. మిగిలినవారినీ ఇదే తరహాలో సొంత గూటికి తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు కూట నేతలు.
* పార్లమెంట్ ప్రాంగణంలో శనివారం ఉదయం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమా మాలిని చీపుర్లు పట్టి ప్రాంగణంలో చెత్త ఊడ్చారు. అనంతరం సిబ్బందితో కలిసి చెత్తను ఏరిపారేశారు. వీరితో పాటు మరికొంత మంది బీజేపీ ఎంపీలు, సిబ్బంది కూడా స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఉభయసభల్లో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై చర్చ జరుగుతోంది.
* నేపాల్ దేశంలో కురుస్తున్న భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తాయి. గడచిన 24 గంటల్లో అతి భారీవర్షాలు కురవడంతో వరదనీటి ధాటికి 21 మంది మరణించారు. శనివారం ఉదయం మరో పది మంది గల్లంతయ్యారు. వరదనీటిలో చిక్కుకున్న 50 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాలు నేపాల్ దేశంలోని 20 జిల్లాల్లోని పలు ప్రాంతాలను జలమయం చేసింది. పాత ఇళ్లు కూలిపోయి జనం మరణిస్తున్నందున ప్రజలు శిథిల భవనాలను ఖాళీ చేయాలని ఆదేశించింది. ఖాట్మండు నగరంలోని పలు ప్రాంతాల్లో రబ్బరు బోట్లను రంగంలోకి దించారు. కోసి నది ప్రమాదస్థాయిలో ప్రవహిస్తోంది.
* ఆయేషా కేసు కీలక మలుపు తిరుగుతోంది. 12 ఏళ్ల తర్వాత ఆయేషా మృతదేహానికి సీబీఐ రీపోస్టుమార్టం చేయనుంది. సీబీఐ తమకు కూడా డీఎన్‌ఏ టెస్ట్‌ చేసిందని ఆయేషా తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆయేషా డీఎన్‌ఏ టెస్ట్‌కు తమ మతపెద్దలు ఒప్పుకోలేదని, కోర్టు ద్వారా సీబీఐ అనుమతి తెచ్చుకుందని, టెస్టులకు తాము సహకరిస్తామన్నారు. అయేషా కేసులో దర్యాప్తు సంస్థలకు తాము సహకరిస్తూనే ఉన్నామని, తమకు పోలీసులు, కోర్టులు, రాజకీయ నాయకులపై నమ్మకం లేదని ఆరోపించారు. సీబీఐ కూడా న్యాయం చెయ్యకపోతే ఇక ఏ వ్యవస్థను ప్రజలు నమ్మరని ఆయేషా తల్లిదండ్రులు తెలిపారు.
* తెలంగాణలో ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన తుది జాబితాను పోలీసు నియామక మండలి విడుదల చేసింది. 1,272 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్లో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలు, ఐటీ, ఫింగర్‌ప్రింట్‌ విభాగంలో ఎస్సై, ఏఎస్సై ఉద్యోగాలకు నియామక మండలి గతంలో ప్రకటన విడుదల చేసింది. తుది జాబితాపై సందేహాలుంటే రుసుం చెల్లించి నివృత్తి చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పోలీసు నియామక మండలి వెల్లడించింది.
* ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షల్లో 66.15 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన వెల్లడించారు
* తెలంగాణ విముక్తి యోధురాలు చకిలం లలితమ్మ(93) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఇవాళ హైదరాబాద్‌లో మృతి చెందారు. లలితమ్మ స్వస్థలం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం నామారం. లలితమ్మ మృతితో ఆమె స్వస్థలంలో విషాదఛాయలు అలముకున్నాయి.
* ఉత్తర్‌ ప్రదేశ్‌ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. గత మూడురోజులుగా అక్కడ కురుస్తున్న వర్షాలకు 15 మంది మృతి చెందారు. భారీగా జంతు, ఆస్తి నష్టం సంభవించింది. వర్షం ప్రభావం వల్ల 133 భవనాలు నేలకూలాయి. ఉన్నావూ, అంబేడ్కర్‌ నగర్‌, గోరఖ్‌పూర్‌, ప్రయాగ్‌రాజ్‌, బారాబంకి, హర్దోయ్‌, కాన్పూర్‌ నగర్‌, పిలిభిట్‌, సోనాభద్ర, చందోలి, ఫిరోజాబాద్‌, మావూ, సుల్తాన్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. శనివారం నుంచి మరో ఐదు రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది.
*కొత్త పంచాయతీరాజ్ చట్టంపై ప్రజాప్రతినిధులు, అధికారులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది.
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు అలజడి సృష్టించారు. ఇన్ఫార్మర్ నెపంతో తెరాసకు చెందిన ఎంపీటీసీ సభ్యుడిని హత్య చేశారు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.
*నల్లమల అడవుల్లోని యురేనియం నిల్వలను వెలికితీసే పనులు మొదలవుతాయన్న సమాచారం.. ఆ ప్రాంత వాసుల జీవితాల్లో మళ్లీ ఆందోళన రేపుతోంది. ఆ నిక్షేపాల పనుల్ని కేంద్రం ఇక్కడి అడవుల్లో కొనసాగించనుండటమే దీనికి కారణం.
*పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఆకాశంలో సాగిపోతున్న విమానంలో… అకస్మాత్తుగా భారీ కుదుపు. ఈ లోహవిహంగం ఒక్కసారిగా ఊగిపోయింది. ఇక మన పని అయిపోయినట్టే అని అందరూ భయపడ్డారు.
*కాళేశ్వరాన్ని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్నగర్ జిల్లాల్లో మూడు కొత్త పర్యాటక సమూహాలను రూపొందిస్తామని.. వాటిని ఆయా జిల్లాల్లోని చారిత్రక, వారసత్వ, ఆధ్యాత్మిక కేంద్రాలతో అనుసంధానం చేసి అభివృద్ధి చేస్తామని తెలిపారు.
*ఉద్యోగాల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తాత్సారం యువకులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని భాజపా విమర్శించింది. ఓ వైపు వయసు పెరిగిపోతూ, మరోవైపు పెళ్లిళ్లు కాకుండా యువకులు ఒత్తిడికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తంచేసింది.
* ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఈ నెల 14వ తేదీన (ఆదివారం) వెల్లడి కానున్నాయి. ఈ విషయాన్ని తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శుక్రవారం రాత్రి ట్విటర్లో వెల్లడించారు.
*ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అతిథి అధ్యాపక పోస్టులకు నిర్వహిస్తున్న ప్రక్రియను నిలిపివేయాలని, ప్రస్తుతం ఉన్నవారినే కొనసాగించాలంటూ శుక్రవారం హైకోర్టు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.
*తెలుగు రాష్ట్రాల సాగునీటి పారుదల ఇంజినీర్ల సమావేశం వాయిదా పడింది. గోదావరి జలాలను కృష్ణా పరీవాహకానికి తరలించేందుకు ఉమ్మడి ఎత్తిపోతల పథకం రూపకల్పనకు ఈ నెల 9న హైదరాబాద్లో రెండు రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్ల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.
*ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 13వ షెడ్యూల్లో ఇచ్చిన హామీమేరకు రాష్ట్రంలోని కేంద్రీయ, గిరిజన విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ఉద్దేశించిన కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లును లోక్సభ శుక్రవారం ఆమోదించింది.
*శంషాబాద్ విమానాశ్రయం నుంచి రియాద్కు వెళ్లడానికి సిద్ధమవుతున్న ఓ అంతర్జాతీయ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. శుక్రవారం ఉదయం 8.55 గంటలకు ప్రయాణికులను ఎక్కించుకోవడానికి ఏరో బ్రిడ్జి వద్దకు ఫ్లయ్నాస్ ఎయిర్లైన్స్ ఎక్స్వై 326 విమానం వచ్చింది.
*రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం అనిశా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ భూ వ్యవహారంలో రైతు నుంచి రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ అదే జిల్లా కొందుర్గు వీఆర్వో అనంతయ్య అనిశా అధికారులకు పట్టుబడిన సంగతి తెలిసిందే.
* బీసీ జాబితాలో మరో 30 కులాలను చేర్చేందుకు ఈనెల 10 నుంచి బీసీ కమిషన్ సభ్యులు చేపట్టిన క్షేత్రస్థాయి పర్యటనలు శుక్రవారంతో ముగిశాయి. సభ్యులు జూలూరి గౌరీశంకర్, ఆంజనేయగౌడ్, కృష్ణమోహన్లు వివిధ జిల్లాల్లో పర్యటించారు.
*కొత్త పురపాలక చట్టం ఆమోదం కోసం ఈనెల 18, 19 తేదీల్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలపై శుక్రవారం నోటిఫికేషన్ జారీ అయింది. ఈనెల 18న ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశం ప్రారంభమవుతుంది.