Movies

స్త్రీల కష్టాల తెలపాలని

Sameera Reddy Speaks Of Women Pregnancy Pains

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అశోక్, చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందిన జై చిరంజీవ చిత్రాలలో కథానాయికగా నటించిన బాలీవుడ్ భామ సమీరా రెడ్డి. 2014లో అక్షయ్ వార్డే అనే వ్యాపారవేత్తని వివాహం చేసుకున్న సమీరా సినిమాలకి దూరమైంది. ప్రస్తుతం వీరికి హన్స్ అనే నాలుగేళ్ళ కుమారుడు ఉండగా, రీసెంట్గా పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. మా లిటిల్ ఏంజెల్ ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. మీ ప్రేమకి, ఆశీర్వాదాలకి ధన్యవాదాలు అని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. సమీరాకి అభిమానులు, సెలబ్రిటీలు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సమీరా ఆ మధ్య మొదటి ప్రగ్నెన్సీ సమయంలో వచ్చిన ఇబ్బందుల గురించి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అభిమానులకి తెలియజేసింది . 102 కేజీల బరువు పెరిగిన తాను రెండేళ్ల పాటు కఠినమైన ఎక్సర్సైజ్లు, యోగా చేస్తూ బరువు తగ్గాను అని తెలిపింది సమీరా. స్త్రీలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారో తెలియజేయాలనే ఉద్ధేశంతో ఈ పోస్ట్ పెట్టాను అని పేర్కొంది. రీసెంట్గా అండర్ వాటర్ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. తొమ్మిదో నెలను ఎప్పటికీ గుర్తుంచుకోవాలని.. దాని కోసమే ఇలా ఫోటోలను దిగిందని పేర్కొంది సమీరా రెడ్డి. ‘నరసింహుడు’ సినిమాతో సమీరా టాలీవుడ్కు పరిచయం అయిన విషయం విదితమే.