ScienceAndTech

లిథియం బ్యాటరీల వైపు వెళ్లనున్న టాటాలు

TATAs To Invest In Lithium Ion Batteries

ప్రభుత్వం ఎలక్ట్రానిక్‌ వాహన రంగంపై తన దృష్టిపెట్టడంతో వ్యాపార దిగ్గజాలు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల కాలంలో విద్యుత్తు వాహనాల కొనుగోలు కోసం చేసిన అప్పులపై చెల్లించే వడ్డీకి ప్రభుత్వం పన్ను మినహాయింపు ప్రకటించడం ఈ రంగంలో ఉత్సాహాన్ని నింపింది. తాజాగా టాటా కెమికల్స్‌ కొత్తగా లిథియం అయాన్‌ బ్యాటరీల ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీని కోసం గుజరాత్‌లోని ధలోర స్పెషల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌లో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనిలో రూ.4,000 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. ధలోర ఇండస్ట్రియన్‌ సిటీ డెవలప్‌ మెంట్‌ ఎండీ జయప్రకాశ్‌ శివహరే మాట్లాడుతూ టాటా కెమికల్స్‌ ఇప్పటికే రూ.1,000 కోట్ల పెట్టుబడితో 126 ఎకరాలను కొనుగోలు చేసిందన్నారు. దీనిపై టాటా మోటార్స్‌ స్పందించేందుకు నిరాకరించింది.‘‘మేము ఎంతో ఆసక్తి చూపుతున్న రంగం ఇది. ఊహాజనిత ప్రచారం మేము స్పందించము’’అని కంపెనీ పేర్కొంది.