తమ ఇంటనున్న ఎద్దును కర్ణాటకలోని ఓ కుటుంబం తమలో ఒకటిగా భావిస్తోంది. క్రమం తప్పకుండా ఏటా పుట్టిన రోజును వైభవంగా జరిపిస్తోంది. కర్ణాటకలోని హుబ్బళ్లిలో అదరగుంచి గ్రామంలో గమనగట్టి అనే రైతు కుటుంబంలో 1994 జులై 12న మగ లేగదూడ జన్మించింది. దానికి ముద్దుగా ‘రాము’ అని పేరు పెట్టారు. కుటుంబసభ్యుడిలా చూసుకుంటున్నారు. 16 ఏళ్లుగా గమనగట్టి కుటుంబం ‘రాము’ సహాయంతో పొలం పనులు చేస్తోంది. కుటుంబ యజమాని అశోక గమనగట్టితో రాముకు ప్రత్యేక అనుబంధం ఉంది. శుక్రవారం (జులై 12న) రాము పుట్టినరోజును కుటుంబసభ్యులు ఘనంగా నిర్వహించారు. దానికి స్నానం చేయించి అందంగా అలంకరించారు. అనంతరం పుట్టినరోజు కేక్ కోశారు.
ఈ రాముడికి ప్రతి ఏటా పుట్టినరోజు వేడుక
Related tags :