ScienceAndTech

చంద్రయాన్-2 ఆగిపోయింది

Chandrayan-2 Launch Cancelled

ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చంద్రుడిపైకి పంపాల్సిన చంద్రయాన్-2 ప్రయోగం నిలిచిపోయింది.

సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రస్తుతానికి ఆగిపోయింది. కొత్త తేదీని త్వరలోనే ఇస్రో ప్రకటించనుంది.

అంతా సవ్యంగా సాగుతుందనుకునే సమయంలో టి-56 నిమిషంలో వాహక నౌకలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగంను నిలిపివేసినట్లు ఇస్రో అధికారులు తెలిపారు.

దీంతో సోమవారం జరగాల్సిన చంద్రయాన్-2 ప్రయోగం వాయిదా పడింది. త్వరలోనే చంద్రయాన్ -2 చంద్రుడిపైకి పంపే తేదీని ఇస్రో ప్రకటిస్తుందని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు.