ప్రస్తుత దలైలామా తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం టిబెట్ యువతను తప్పుదోవ పట్టించారని చైనా మంత్రి వాంగ్ ఆరోపించారు. దలైలామా వారసుడు కచ్చితంగా చైనాలో నుంచే ఎన్నుకోవాలన్నారు. దీనికి భిన్నంగా భారత్ జోక్యం చేసుకొంటే ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరించారు. తొలిసారి చైనా నుంచి దలైలామా ఎంపికపై కచ్చితమైన ప్రకటన వెలువడటం విశేషం. దాదాపు దలైలామా ఎంపికకు 200 ఏళ్ల చారిత్రక నేపథ్యం ఉంది. ‘దలైలామా పునర్జన్మ చారిత్రక, రాజకీయ అంశం. దీనికోసం చారిత్రక సంస్థలను, విధానాలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. దలైలామ పునర్జన్మ అనేది ప్రస్తుత లామా వ్యక్తిగత ఇష్టం కాదు. అలాగని విదేశాల్లో ఉండే కొంది మంది అభిష్టం కానేకాదు. ఆయన వారసుడు కూడా ఎంపిక ప్రక్రియను దాటుకొని రావాలి.’’ అని వాంగ్ పేర్కొన్నారు. ఆయన లాసాలోని భారతీయ జర్నలిస్టులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. టిబెట్ అటానమస్ రీజియన్‌కు వాంగ్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. 1959లో ప్రస్తుత దలైలామా భారత్‌కు వలస వచ్చి ఆశ్రయం పొందారు. ఆయనతోపాటు కొందరు స్థానికులు కూడా భారత్‌కు వచ్చేశారు. భారత్ వారికి రాజకీయ ఆశ్రయం కల్పించింది. అప్పటి నుంచి వీరు హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఉంటున్నారు. ప్రస్తుతం ఆయనకు 84 సంవత్సరాలు నిండాయి. దీంతో ఆయన వారసుడి ఎంపికపై చైనా ఆత్రంగా ఎదురు చూస్తోంది.
తదుపరి దలైలామా చైనా నుండే రావాలి
Related tags :