ఫిట్‌గా ఆరోగ్యంగా ఉండే అబ్బాయిలు కూడా పిజ్జా, బర్గర్, చిప్స్… వంటివి తింటే వాళ్లలో సంతాన సాఫల్యత తగ్గుతుందని హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. ఫాస్ట్ఫుడ్స్తోబాటు ప్రాసెస్డ్ ఫుడ్సూ శీతలపానీయాలూ తీసుకునేవాళ్లలోనూ ఈ శుక్రకణాల శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఊబకాయం, మధుమేహం, క్యాన్సర్లు… వంటివి వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదట. ఇందుకోసం వీళ్లు 19 సంవత్సరాల్లోపు మూడు వేల మంది అబ్బాయిల్ని ఎంపిక చేసి, నాలుగు వర్గాలుగా విభజించి మొదటి వర్గానికి యాంటీ ఆక్సిడెంట్ల శాతం ఎక్కువగా ఉండే ఆహారాన్నీ; మిగిలిన విభాగాల వాళ్లకి వరసగా యాంటీ ఆక్సిడెంట్ల శాతాన్ని తగ్గిస్తూ వచ్చి, చివరి వర్గంలోని వాళ్లకి ఏమాత్రం యాంటీ ఆక్సిడెంట్లు లేని ఫాస్ట్ఫుడ్స్ ఓ రెండు నెలలపాటు ఇచ్చారట. చివరగా పరిశీలిస్తే- అన్ని విభాగాల కన్నా ఫాస్ట్ ఫుడ్స్ తిన్నవాళ్లలో శుక్రకణాల శాతం తక్కువగా ఉన్నట్లు తేలింది. వీళ్లలో శుక్రకణాల ఉత్పత్తికి తోడ్పడే సెర్టోలి కణాలు దెబ్బతినడమే కారణమనీ కాబట్టి అబ్బాయిలు ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు.
పిజ్జాలు చిప్స్ తింటే పిల్లలు పూట్టరురా…
Related tags :