Movies

ప్రతిభ చాలు-పతి అక్కర్లేదు

Amala Paul Speaks Of Her Fears After Divorce

తన మాజీ భర్త, ప్రముఖ తమిళ దర్శకుడు ఏఎల్‌ విజయ్ రెండో పెళ్లిపై స్పందించారు నటి అమలా పాల్‌. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘ఆమె’ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా విజయ్‌ పెళ్లిపై మాట్లాడారు. ‘విజయ్‌ చాలా మంచి వ్యక్తి. ఆయన వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. విజయ్‌తో విడాకులు తీసుకున్నాక తన సినీ కెరీర్‌ ఏమైపోతుందోనని చాలా భయపడ్డానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘నాకు చెల్లెలు, హీరోయిన్‌కు స్నేహితురాలి పాత్రల్లో నటించే అవకాశాలు మాత్రమే వస్తాయేమోనని అనుకున్నాను. మున్ముందు సినిమాల్లేక ధారావాహికల్లో నటించాల్సి వస్తుందని చాలా టెన్షన్‌ పడ్డాను. కానీ ప్రతిభ ఉంటే ఎవరూ మనల్ని ఆపలేరన్న విషయం నాకు అర్థమైంది’ అని వెల్లడించారు అమల.