DailyDose

నేపాల్‌లో వర్షాలు. 50మంది మృతి-తాజావార్తలు-07/15

heavy rains kill 50 in Nepal-Daily Breaking News-July 15 2019

*భారీ వర్షాలు నేపాల్ ను అతలాకుతలం చేస్తున్నాయి. గురువారం నుంచి ఎడతెరపి లేకుండా పడుతున్న వర్షాల వల్ల వరదల్లో చిక్కుకుని, పలు చోట్ల కొండచరియలు విరిగిపడి.. ఇప్పటివరకు 50 మంది చనిపోయారని, 25మంది తీవ్రంగా గాయపడ్డారని నేపాల్ పోలీసులు ప్రకటించారు. 1104 మందిని రెస్క్యూ చేశామని, 35 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్స్ కోసం దేశవ్యాప్తంగా 27,380 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని మరో రెండు, మూడు రోజులు వానల ప్రభావం ఉంటుందని నేపాల్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. భారీ వర్షాలు 25 జిల్లాల్లో 10,385 ఇళ్లను ప్రభావితం చేశాయి. ముఖ్యంగా నేపాల్ సెంట్రల్, ఈస్ట్ ప్రాంతాల్లో వరదల ప్రభావం ఎక్కువగా ఉంది.
* ఈ నెల 17వ తేదీన సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. ఈ భేటీలో నూతన పురపాలక చట్ట బిల్లును కేబినెట్ ఆమోదించనుంది. ఈ నెల 18, 19 తేదీల్లో శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి.
* కృష్ణా కరకట్ట ఆక్రమణల తొలగింపు వ్యవహారంలో హై కోర్టుని ఆశ్రయించిన ప్రభుత్వంచందన కేదారనాథ్ కి మంజూరు చేసిన స్టే తొలగించాలని పిటిషన్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వరాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులపై మూడు వారాల స్టే విధించిన రాష్ట్ర హై కోర్టురేపు లంచ్ మోషన్ లో రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ పై విచారణ.
*తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ ఉద్యోగుల విభజన అంశం మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది. విద్యుత్ ఉద్యోగుల కేటాయింపులపై జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఇచ్చిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ తెలంగాణ జెన్ కో, ట్రాన్స్ కో, డిస్కంలు, ఉద్యోగ సంఘాల సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం.. జస్టిస్ ధర్మాధికారి కమిటీ మార్గదర్శకాలపై సవాలు చేయలేరని.. కావాలంటే ఉద్యోగుల తుది కేటాయింపులను సవాలు చేసుకోవచ్చని పిటిషనర్లకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. విద్యుత్ ఉద్యోగుల విభజన సమస్యపై ఏర్పాటైన జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఉద్యోగులందరికీ ఆప్షన్ల అవకాశం ఇచ్చింది. విభజన సమస్య కేవలం 1157 మంది ఉద్యోగుల విషయంలో ఉంటే మొత్తం 10,400 మంది ఉద్యోగులకు ఆప్షన్లను ఇవ్వడాన్ని తెలంగాణ విద్యుత్ కార్పొరేషన్లు, డిస్కంలు, ఉద్యోగులు అంగీకరించడం లేదు. కమిటీ మార్గదర్శకాలతో విద్యుత్ ఉద్యోగుల విభజన మరింత సంక్లిష్టమైందని కోర్టులో పిటిషన్ వేశారు. తుది కేటాయింపులపై సవాలు చేసుకునే స్వతంత్రతను సుప్రీంకోర్టు పిటిషనర్లకే ఇచ్చింది.
* ఎమ్మెల్యే జగ్గారెడ్డి‌ని పోలీసులు అరెస్టు చేశారు. నేడు జలదీక్షకు వెళుతున్న ఆయనను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన సంగారెడ్డికి గోదావరి జలాలను తరలించాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గోదావరి జలాలను తమ జిల్లాలకు తరలించే వరకూ నిరాహార దీక్షకు పూనుకుంటానని వెల్లడించారు. అయితే నేడు ఆయన జలదీక్షకు వెళుతుండగా పోలీసులు అరెస్ట్ చేసి కొండాపూర్‌ పీఎస్‌కు తరలించారు.
* కేంద్ర ప్రభుత్వం రేపు కొత్త నాణాలను విడుదలచేయనున్నది. 1, 2, 5, 10, 20 రూపాయిల నాణాలను ప్రధాని నరేంద్ర మోడీ రేపు విడుదల చేస్తారు. అంధులు కూడా ఈ నాణాలను గుర్తించగలిగేలా తయారు చేసినట్లు బడ్జెట్‌ ప్రవేశపెడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.
* ఉత్తరప్రదేశ్‌లోని బాలియా నియోజకవర్గానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు పదుల సంఖ్యలో భార్యలు ఉంటారని.. వేల సంఖ్యలో పిల్లలను కంటారని ఆయన వ్యాఖ్యానించారు. ముస్లింలు ఇలా చేయడం సాంప్రదాయం కాదు.. జంతు ధోరణిని ముస్లింలు అవలంభిస్తున్నారని పేర్కొన్నారు. సుమారు 50 మంది భార్యలను కలిగి ఉండి.. 1050 మంది పిల్లలకు జన్మనిస్తారని సురేంద్ర సింగ్ తెలిపారు. సమాజంలో కేవలం ఇద్దరి నుంచి నలుగురిని మాత్రమే కనాలని ఆయన సూచించారు.
* కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముకేశ్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయన కొన్ని నెలలుగా కేన్సర్ తో బాధపడుతూ హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు. 2018 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అపోలో హాస్పిటల్ నుంచి అంబులెన్స్ లో వచ్చి తన ఓటుహక్కు వినియోగించుకున్నారు.ప్రస్తుతం హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లోనే ఉన్న ముకేశ్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని డాక్టర్లు చెప్పారు. ట్రీట్ మెంట్ కు ముకేశ్ గౌడ్ శరీరం సహకరించపోవడంతో చికిత్స ఆపివేసినట్టు అపోలో డాక్టర్లు చెప్పారు.
* జోగులాంబ గద్వాల జిల్లాలోని పూడూరులో పురాతన బంగారు, వెండి నాణేలు లభ్యమయ్యాయి. మరుగుదొడ్డి కోసం గుంతలు తవ్వుతుండగా బంగారు, వెండి నాణేలు లభ్యమయ్యాయి. చాకలి వెంకన్న తన ఇంట్లో మరుగుదొడ్డి కట్టడం కోసం గుంతలు తవ్వుతుండగా.. 11 బంగారు, 19 వెండి నాణేలు బయటపడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు వెంకన్న ఇంట్లో నాణేలు స్వాధీనం చేసుకున్నారు.
* సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి‌ని పోలీసులు అరెస్టు చేశారు. నేడు జలదీక్షకు వెళుతున్న ఆయనను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన సంగారెడ్డికి గోదావరి జలాలను తరలించాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గోదావరి జలాలను తమ జిల్లాలకు తరలించే వరకూ నిరాహార దీక్షకు పూనుకుంటానని వెల్లడించారు. అయితే నేడు ఆయన జలదీక్షకు వెళుతుండగా పోలీసులు అరెస్ట్ చేసి కొండాపూర్‌ పీఎస్‌కు తరలించారు.
* ఆస్ట్రేలియాను వరుస భూప్రకంపనలు వణికిస్తున్నాయి. ఆదివారం 6.6 తీవ్రతతో భూకంపం రాగా.. సోమవారం ఉదయం సైతం భూమి కంపిచింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 5.5 గా నమోదైంది. ఈ భూకంపం అనంతరం 28సార్లు ప్రకంపనలు నమోదైనట్లు అమెరికా జియాలాజికల్ సర్వే ప్రకటించింది.హిందూ మహాసముద్రానికి దగ్గరలో పది కిలోమీటర్లు లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఈ భూకంపం వల్ల సునామీ ప్రమాదం లేదని సైంటిస్టులు చెప్పారు. ఆదివారం ఆస్ట్రేలియాలో 6.6 తీవ్రతతో భూకంపం వచ్చింది.
* ట్విట్టర్‌లో టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వద్దంటే చెప్పండి.. పార్టీకి, ఎంపీ పదవికి సైతం రాజీనామా చేస్తానంటూ ట్విట్టర్ వేదికగా నాని స్పష్టం చేశారు. ‘‘చంద్రబాబు గారు..నాలాంటి వాళ్లు పార్టీలో వద్దనుకుంటే వెంటనే చెప్పండి. ఎంపీ పదవికి, పార్టీకి వెంటనే రాజీనామా చేస్తా. నా లాంటి వాళ్లు కావాలనుకుంటే మీ పెంపుడు కుక్కలను కంట్రోల్‌ చేయండి’’ అని ట్వీట్ చేశారు. బెజవాడ టీడీపీలో ట్వీట్ల యుద్ధం నడుస్తోంది.నిన్నటి వరకు అంతర్గతంగా సాగిన పోరు నేడు బహిరంగ పోరాటంగా మారింది. ఈ నేపథ్యంలో నాని ఏకంగా చంద్రబాబును ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. నిన్న కూడా కేశినేని నాని ట్విట్టర్ వేదకిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజకీయ జన్మలు, రాజకీయ పునర్జన్మలు, రాజకీయ భవిష్యత్తులు, గుళ్లో కొబ్బరి చిప్ప దొంగలకి, సైకిల్ బెల్లుల దొంగలకి, కాల్ మనీ గాళ్లకి, సెక్స్ రాకెట్ గాళ్లకి, బ్రోకర్లకి, పైరవిదారులకి అవసరం. నాకు అవసరం లేదు’’ అంటూ నాని ట్వీట్ చేశారు.
* కరెన్సీ నోటును చూడగానే దాని విలువ చెప్పేసే సరికొత్త మొబైల్‌ యాప్‌ను రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) అంబాటులోకి తీసుకురానుంది. దేశంలో దృష్టిలోపాలతో బాధపడుతున్న దాదాపు 80 లక్షల మందికి ఇది చేదోడుగా ఉండనుంది. ఈ అప్లికేషన్‌లోకి లాగిన్‌ అయి, కెమెరా ఎదుట కరెన్సీ నోటును ఉంచగానే.. దాని విలువ ఎంత అనే దానిపై ఆడియో సందేశం వినిపిస్తుంది. ఒకవేళ నోటు ఫొటో స్పష్టంగా రాకుంటే ‘మరోసారి ప్రయత్నించండి’ అని సూచన జారీ అవుతుంది. ఈమేరకు సాంకేతిక పరిజ్ఞానంతో యాప్‌ను అభివృద్ధిపరిచేందుకు ఐటీ కంపెనీల నుంచి ఆర్‌బీఐ బిడ్లు ఆహ్వానించింది.
* శాసనసభ్యుల రాజీనామాతో రాజకీయ సంక్షోభం నెలకొన్న కర్ణాటకలో నాటకీయ పరిణామాలు కొనసాగుతూనేఉన్నాయి. ఈ తరుణంలో ఎమ్మెల్యేల రాజీనామాతో మెజార్టీ కోల్పోయినందున సీఎం కుమారస్వామి వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత యడ్యూరప్ప డిమాండ్ చేశారు. రెండు రోజుల విరామం తర్వాత నేడు పునఃప్రారంభం కానున్న విధానసభలో బలపరీక్ష కోసం భాజపా పట్టుపట్టే అవకాశం ఉంది.
* ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీ ముగిసిన విషయం విదితమే. ఇవాళ జరిగిన ఈ టోర్నీ ఫైనల్ పోరులో ఉత్కంఠ భరిత క్షణాల్లో ఇంగ్లండ్ గెలుపొంది వరల్డ్ కప్ ట్రోఫీని సొంతం చేసుకుంది. అయితే వచ్చే వన్డే ప్రపంచ కప్‌ను మాత్రం భారత్‌లో నిర్వహించనున్నారు. 2023లో జరగనున్న ఆ ప్రపంచకప్ పూర్తిగా భారత్‌లోనే జరగనుంది. అంతకు ముందు 1987, 1996, 2011లో భారత్ వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చినా.. పొరుగు దేశాలైన పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు కూడా ఆతిథ్యం పంచుకున్నాయి. ఈ క్రమంలో 2023లో జరగనున్న ప్రపంచకప్ మ్యాచ్‌లన్నింటినీ పూర్తిగా భారత్‌లోనే నిర్వహించనున్నారు. ఇక ఆ మ్యాచ్‌లో లీగ్ దశ ఇప్పుడు జరిగినట్లుగానే రౌండ్ రాబిన్ పద్ధతిలో ఉంటుంది. ఆ తరువాత సెమీఫైనల్స్, ఫైనల్ ఉంటాయి. 2023 ఫిబ్రవరి 9 నుంచి మార్చి 26వ తేదీ వరకు వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్‌ను ఇప్పటికే ఫిక్స్ చేశారు. కాగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-8 లో ఉండే జట్లు ఆటోమేటిగ్గా వరల్డ్‌కప్ ఆడుతాయి. ఇక మిగిలిన 2 స్థానాల కోసం 5 జట్లు 2022లో నిర్వహించనున్న క్రికెట్ వరల్డ్ కప్ క్వాలిఫైర్ మ్యాచ్‌లు ఆడుతాయి. ఈ క్రమంలో 2023 వరల్డ్ కప్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి.
*వైద్య విద్యార్థులకు భారీ ఉపశమనాన్ని కలిగించే అంశమిది. ఎండీ, ఎంఎస్ వంటి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రస్తుతమున్న నీట్-పీజీ పరీక్షలకు బదులుగా ఎంబీబీఎస్ చివరి ఏడాదిలో నిర్వహించే ప్రత్యేక పరీక్ష సరిపోతుందని కేంద్ర ఆరోగ్యశాఖ యోచిస్తోంది.
*ఒప్పందం ప్రకారం సకాలంలో ఫ్లాట్ నిర్మాణం పూర్తి చేయనందుకు వినియోగదారుడికి పరిహారం చెల్లించాలని హైదరాబాద్ వినియోగదారుల ఫోరం-1.. ప్రతివాద నిర్మాణ సంస్థను ఆదేశించింది.
*ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే తెలంగాణ శాసనసభ, మండలి ప్రత్యేక సమావేశాల్లో కొత్త పురపాలక చట్టంపై బిల్లును ప్రవేశపెట్టడంతో పాటు వాటిపై వివరణను ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా ఇచ్చేందుకు సన్నద్దమవుతున్నారు.
*కృత్రిమ మేధ రానున్న రోజుల్లో మానవ గతిని మార్చనుంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి అత్యుత్తమ వేతనాలూ దక్కే అవకాశం ఉంది.
*ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల్లో 37.76 శాతం ఉత్తీర్ణత నమోదైంది. జనరల్, ఒకేషనల్ కోర్సులకు కలిపి మొత్తం 1,60,487 మంది పరీక్షకు హాజరైతే… 60,600 మంది ఉత్తీర్ణత సాధించారు.
* అటల్ బిహారీ వాజ్పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు 1998 మే 11న పోఖ్రాన్లో అణు పరీక్షలు నిర్వహించడం భారత రక్షణ చరిత్రలో కీలక ఘట్టం. ఎంతో రహస్యంగా చేసిన ఈ ప్రయోగాల గురించి విని ప్రపంచ దేశాలు నివ్వెరపోయాయి.
*పంటల బీమాకు ఉద్దేశించిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనపై ఫిర్యాదులు వస్తుండడంతో ఈ ఖరీఫ్ నుంచి తగిన మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. బీమా కంపెనీలు ఇష్టారాజ్యంగా నిర్ణయిస్తున్న ప్రీమియంపై గరిష్ఠ పరిమితి విధించాలని నిర్ణయించింది.
*‘‘రాష్ట్రాలకు అడవులే బలమైన ప్రకృతి వనరులు. వాటిని సంరక్షించుకోలేకపోవడంతో అటవీ సంపద తరిగిపోతోంది. ఫలితంగా వన్యప్రాణులు, మనుషుల మధ్య సంఘర్షణ పెరుగుతోంది. కలప స్మగ్లింగ్, వన్యప్రాణుల వేటను నివారించడానికి రాష్ట్రాల మధ్య సమన్వయం, సహకారం ఉండాలి. ఇందుకు జాతీయస్థాయిలో ఉమ్మడి విధానం రావాలి’’ అని వివిధ రాష్ట్రాల అటవీ సంరక్షణ ప్రధాన అధికారులు (పీసీసీఎఫ్) అభిప్రాయపడ్డారు.
* పురపాలక ఎన్నికలకు సంబంధించి ఓటర్ల తుది జాబితా ప్రచురణకు గడువు మరో రెండు రోజులు పెంచుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు జరగనున్న 129 పురపాలక సంఘాలు, 3 నగరపాలక సంస్థల్లో ఓటర్ల తుది జాబితాను ఆదివారం ప్రచురించాల్సి ఉంది. ఈ గడువును మంగళవారం వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితా ప్రచురణకు గడువు పొడిగించాలని కొందరు కలెక్టర్లు కోరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
*కొత్త సచివాలయాన్ని అత్యున్నత ప్రమాణాలతో నిర్మించేందుకు అనువైన ప్రణాళికలను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.
*అటల్ బిహారీ వాజ్పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు 1998 మే 11న పోఖ్రాన్లో అణు పరీక్షలు నిర్వహించడం భారత రక్షణ చరిత్రలో కీలక ఘట్టం. ఎంతో రహస్యంగా చేసిన ఈ ప్రయోగాల గురించి విని ప్రపంచ దేశాలు నివ్వెరపోయాయి. ఈ విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. వాటిని చేపట్టడానికి ముందు వాజ్పేయీ ఏం చేశారో ఆయన వద్ద ఆర్థిక మంత్రిగా పనిచేసిన యశ్వంత్ సిన్హా తన ఆత్మకథ ‘రిలెంట్లెస్’లో వెల్లడించారు.
* ఏపీ శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో జరుగుతున్న వైసీపీ రాజకీయ దాడులపై శాసన మండలిలో టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. అలాగే ఏపీపీస్సీ పరీక్షల నిర్వహణపై పీడీఎఫ్‌ వాయిదా తీర్మానం ఇచ్చింది. అభ్యర్థులకు అన్యాయం జరిగిందని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. వాయిదా తీర్మానాలను మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ తిరస్కరించారు. తర్వాత జరిగే చర్చలో ఈ అంశాలపై మాట్లాడాలని సూచించారు