DailyDose

బిగ్ బస్ పై మరో పోలీస్ కేసు -నేర వార్తలు – 07/15

New Case Filed On Bigg Boss - Today Crime News - July 15 2019

*బిగ్ బాస్ సీజన్ 3 కొద్దిరోజుల్లోనే మొదలుకానుంది. ఈ షో మొదలుకాకముందే వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే యాంకర్ శ్వేతారెడ్డి బిగ్ బాస్ నిర్వాహకులు తనను లైంగికంగా వేధించారని, షోలో పాల్గొనాలంటే కమిట్మెంట్ అడుగుతున్నారని ఆరోపణలు చేసింది. తాజాగా మరో నటి బిగ్ బాస్ షోపై సంచలన కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ నిర్వాహకులు తనను వేధించారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.వివరాల్లోకి వెళితే.. ‘ఫిదా’ ఫేం నటి గాయత్రీ గుప్తా ఆదివారం నాడు బిగ్ బాస్ షోపై రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బిగ్ బాస్ నిర్వాహకులు రఘు ఓ సారి ముంబై నుండి తనకు ఫోన్ చేసి షోలో నటించాలని కోరాడని.. వంద రోజుల పాటు నటించేందుకు ఒప్పందం కూడా చేసుకున్నట్లు చెప్పింది.రఘుతో పాటు అభిషేక్ గుప్తా, రవి తన ఇంటికి వచ్చి షో ముందు నుండే మరో సినిమాలో నటించకూడదని రూల్ పెట్టినట్లు.. ఆ ప్రకారమే ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పింది. అదే సమయంలో వంద రోజుల పాటు సెక్స్ లో పాల్గొనకుండా ఉండగలవా..? అని వారు ప్రశ్నించారని గాయత్రి గుప్తా తెలిపింది. దీనికి ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వలేదని తెలిపింది.అయితే విషయం బయటకి చెప్పకుండా సెలెక్షన్ కోసం ఎదురుచూశానని.. రెండు రోజుల క్రితం బిగ్ బాస్ 3లో తన పేరు లేదనే విషయం తెలుసుకున్నట్లు చెప్పింది. ఒప్పందం కారణంగా సినిమాల్లో వచ్చిన అవకాశాలు కోల్పోవడంతో సుమారు రూ.16 లక్షలు ఆర్థికంగా నష్టపోయినట్లు తెలిపింది. బిగ్ బాస్ షో కారణంగా ఆర్థికంగా నష్టపోవడంతో పాటు లైంగిక వేధింపులకు గురైనట్లు.. దీనికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.
* షాపింగ్‌కు రానన్నందుకు భర్తను చెప్పుతో కొట్టింది!
యూఏఈలో ఓ మహిళ షాపింగ్‌కు రానని మొండికేసిన భర్తను చెప్పుతో కొట్టింది. ఇలా ఒకటీ రెండు సార్లు కాదు.. షాపింగ్‌కు రానన్న ప్రతీసారి కొట్టి మరీ తీసుకెళ్లింది. చిర్రెత్తిన భర్త పోలీసుల్ని ఆశ్రయించడంతో సదరు మహిళపై కేసు నమోదైంది. విషయానికొస్తే ఓ రోజు డ్యూటీకి వెళ్లొచ్చి నిద్రపోయిన భర్తను రియో అనే మహిళ షాపింగ్‌కు రావాలని లేపింది. అలసిపోయానని, రాలేనని చెప్పడంతో అతడి జేబులోంచి ఏటీఎం కార్డు తీసుకుని పిన్‌ నంబర్‌ అడిగింది. అతను చెప్పకపోవడంతో పట్టరాని కోపంతో ఊగిపోయిన రియో చెప్పు తీసుకుని ఇష్టమొచ్చినట్టు బాదేసింది. వెంటనే లేచి భర్త పోలీసుల వద్దకెళ్లి జరిగింది చెప్పాడు. దీంతో పోలీసులు ఆమెపై కేసు ఫైల్‌చేసి కోర్టు ముందు నిలబెట్టారు. పెళ్లై ఆరేళ్లయిందని, ఇద్దరు పిల్లలున్నారని, కుటుంబం కోసం ఏం ఖర్చు చేయకపోవడంతోనే ఇలా చేశానని కోర్టుకు రియో తెలపగా.. అదేం కాదు.. కావాలనే ఇలా కొట్టిందని, వాట్సాప్‌లో అవమానకరంగా పెట్టిన మెసేజ్‌లను కోర్టు ముందుంచాడు భర్త. వీరి విషయంలో ఎటూ తేల్చుకోలేని జడ్జి కేసును ఆగస్టు 22కు వాయిదా వేశాడు.
*సూళ్లూరుపేట పోలీసులు జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ నిర్వహించి 180 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
*శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పొగిరిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఎస్సీ కాలనీలో 5 గ్యాస్‌ సిలిండర్లు పేలి సుమారు ఇరవై పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఆ ఇళ్ల వారంతా ఉపాధి హామీ పనుల నిమిత్తం బయటకు వెళ్లటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పూరిళ్లతో సహా మొత్తం బూడిద అవటంతో వారు బోరున విలపించారు.
* శ్రీకాకుళం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాజాం మండలం పొగిరిలో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఆరు గ్యాస్ సిలిండర్లు పేలాయి. దీంతో అక్కడే ఉన్న పూరిళ్లకు మంటలు అంటుకుని మొత్తం 15 పూరిళ్లు దగ్ధమయ్యాయి.
*గుంటూరుసత్తెనపల్లి మండలం భృగుబండ గ్రామంలో 50బస్తాలు రేషన్ బియ్యం పట్టుకొన్న రూరల్ పోలీసులు. తురక శ్రీనివాసరావు ఇంట్లో ఉన్న50 బస్తాలు రేషన్ బియ్యం స్వాధీనం చేసుకొని స్టేషన్ కి తరలించిన ఎస్సై మోనిషా.
*జగిత్యాలజిల్లాలోని కొడిమ్యాల మండలంలో పూడూరులో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ప్రియుడు తనను వంచించాడని మనస్తాపానికి గురైన ఓ యువతి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
*సోంపేటచిన్నపల్లి వీధిలో దారుణం జరిగింది. నల్లా దగ్గర మహిళల మధ్య జరిగిన ఘర్షణలో ఓ మహిళ మృతి చెందింది.
*చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం యం.కొత్తూరు పంచాయతీ సన్నిపల్లి గ్రామంలో కర్ణాటక రాష్ట్రం ముల్బాగల్ తాలూకా శెట్టిగళ్ళు గ్రామానికి చెందిన నారాయణస్వామి పొలంలో బోరు పైపులు దింపే ట్రాక్టర్ సహాయంతో బోరులోకి పైపులు దింపుతుండగా పక్కనే ఉన్న 11 కెవి విద్యుత్ తీగలు, పైపులకు తగలడంతో నారాయణ స్వామి(35) రమేష్ (34)ద్దరు ఘటనా స్థలంలోనే మరణించారు .మరో ఇద్దరు నాగరాజు(40) గిరి (25) పరిస్థితి విషమంగా ఉండడంతో కుప్పం ప్రభుత్వాసుపత్రికి తరలించారు
*అనంతపురం జిల్లాలోని తనకల్ మండలం కోర్తికోటలో దారుణం జరిగింది. గుప్త నిధుల కోసం ఇద్దరు మహిళలు సహా మరో వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా నరికి నరబలి ఇచ్చారు. కోర్తికోట శివాలయం దగ్గర ఈ ఘోరం జరిగింది.
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. సోంపేట మండల కేంద్రంలోని చిన్నపల్లి వీధిలో తాగునీటి నల్లా దగ్గర జరిగిన గొడవ ఓ మహిళ ప్రాణం తీసింది. గ్రామంలో తాగునీటి కోసం కుళాయి దగ్గరకు వెళ్లిన పద్మ అనే మహిళ క్యూలో నిల్చుంది. అయితే వరుస తప్పడంతో…ముందున్న మహిళలు పద్మతో గొడవకు దిగారు. మాటామాటా పెరగడంతో..తోపులాట జరిగి ఒకరినొకరు బిందెలతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో పద్మ… తల భాగంలో తీవ్రగాయాలు కావడంతో…ఆమె అక్కడికక్కడే చనిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని… విచారణ చేస్తున్నారు.
*చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం కౌండిన్య అభయారణ్యం పరిసరప్రాంతంలోని చెత్తపెంట గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆడ ఏనుగు మృతి.అనారోగ్యా0తో ఏనుగు మృతి చెందినట్లు గుర్తించిన అటవీ శాఖ అధికారులు
*గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కచ్‌లోని మాంకువాలో ట్రక్కు – ఆటో ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 10 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలిచారు. ఆటోను స్పీడుగా వెళుతున్న ట్రక్కు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
* గ్యాస్‌ లీకయ్యి అగ్ని ప్రమాదం సంభవించి 10 పూరిళ్లు దగ్ధమైన ఘటన సోమవారం రాజాం మండలం పొగిరిలో చోటు చేసుకుంది. పొగిరిలోని ఓ ఇంట్లో గ్యాస్‌ లీకవ్వడంతో అగ్ని రాజుకొని 4 సిలిండర్లు పేలి, 10 పురిళ్లు దగ్ధమయ్యాయి. ఆ సమయంలో ఇళ్లలో ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. వెంటనే రాజాం, పొందూరు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. సుమారు రూ.30 లక్షలు ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు అంచనా వేశారు.
* విజయనగరం జిల్లా కలక్టరేట్ వద్ద వివాహిత ఆత్మహత్యా యత్నం చేసిన ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది. కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌ స్పందన కార్యక్రమంలో ఆమె తన వెంట తెచ్చుకున్న చీమల మందు తిని.. అధికారుల ముందే ఆత్మహత్యాయత్నానికి యత్నించారు.
* చాక్లెట్‌ తిని ఒక బాలుడు మృతి చెందగా, మరో ఇద్దరకు బాలురు చికిత్స పొందుతున్న ఘటన సోమవారం రాయిగూడెంలో చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి బుట్టాయిగూడెం మండలం రాయిగూడెంలో చాక్లెట్‌ తిని.. ముగ్గురు బాలురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
* సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ని కొద్ది సేపటి క్రితం పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డి కి గోదావరి జలాలను తరలించాలన్న డిమాండ్‌ తో జల దీక్ష చేస్తానని జగ్గారెడ్డి ఇది వరకే ప్రకటించారు. ఈ క్రమంలో.. సోమవారం జల దీక్షకు వెళుతున్న జగ్గారెడ్డి ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి జగ్గారెడ్డిని కొండాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ కు తరలించారు.
* భారీ వర్షాలు నేపాల్ ను అతలాకుతలం చేస్తున్నాయి. గురువారం నుంచి ఎడతెరపి లేకుండా పడుతున్న వర్షాల వల్ల వరదల్లో చిక్కుకుని, పలు చోట్ల కొండచరియలు విరిగిపడి.. ఇప్పటివరకు 50 మంది చనిపోయారని, 25మంది తీవ్రంగా గాయపడ్డారని నేపాల్ పోలీసులు ప్రకటించారు.
* పదమూడేళ్ల కిందట పెళ్లి చేసుకున్నరు.. వారికి ఇద్దరు పిల్లలు.. చిన్నమ్మాయి బర్త్ డే ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవాలనే విషయంలో మాటామాటా అనుకున్నరు. గొడవ పెద్దదైంది. మనస్తాపం చెందిన భార్య.. పాపతోపాటు బిల్డింగ్పై నుంచి దూకేసింది. ఆమె తల పగిలి చనిపోగా, మూడేళ్ల చిన్నారి చిన్నగాయాలతో బయటపడింది. హైదరాబాద్లోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన.
* హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లాలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు బహుళ అంతస్తుల రెస్టారెంట్ భవనం కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకుపోయి ఇద్దరు చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి.
* ఖమ్మం ఎస్ సి హాస్టల్ లో కరెంట్ షాక్ తో ఓ విద్యార్థిని చనిపోయింది. మరో నలుగురు హాస్పత్రి పాలయ్యారు. ఎన్ ఎస్ పీ కాలనీలోని ఎస్సీ బాలికల హాస్టల్ లో రాత్రి 11 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఒక్కసారిగా పొగ కమ్ముకొని, మంటలు చెలరేగాయి.
* శ్రీకాకుళం జిల్లా రాజాం సమీపంలోని పొగిరిలో అగ్నిప్రమాదం జరిగింది. 5 గ్యాస్‌ సిలిండర్లు పేలి 20 పూరిళ్లు దగ్ధమయ్యాయి.
* విజయనగరం జిల్లా కలక్టరేట్ వద్ద వివాహిత ఆత్మహత్యా యత్నం చేసిన ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది. కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌ స్పందన కార్యక్రమంలో ఆమె తన వెంట తెచ్చుకున్న చీమల మందు తిని.. అధికారుల ముందే ఆత్మహత్యాయత్నానికి యత్నించారు.
* కృష్ణాజిల్లా కంచికచర్ల (మం) పరిటాల జాతీయ రహదారిపై కారు బైక్ ను ఢీకొన్న సంఘటనలో ఒక వ్యక్తి కి గాయాలు,
హైవే అంబులెన్స్ ద్వారా నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు.ఆస్ట్రేలియాను వణికించిన భూకంపం.. 28సార్లు ప్రకంపనలు నమోదు.
* శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని స్థానిక పల్లివీధిలో మంచినీటి కుళాయివద్ద జరిగిన ఘర్షణలో ఓ మహిళ మృతి చెందారు. ఈ ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది.
* ప.గో. బుట్టాయిగుడెం మండలంరాయిగూడెంలో విషాదం.చాక్లెట్ తిని ముగ్గురు చిన్నారులకు అస్వస్థత. ఒకరు అభిచరణ్ తేజ (5) మృతి. కట్టం సంతోష్(7), మండలం రాహుల్(6) అనే ఇద్దరిని చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
* అనంతపురం జిల్లా కదిరి నల్లచెరువు మండలం సమీపంలో (సోమవారం12:00Am) గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
* అనంతపురం జిల్లా తనకల్లు మండలం కొర్థికోట లో క్షుద్రపూజల కలకలం.మూడు మృతదేహాలు లభ్యం.క్షుద్రపూజలు చేసి హతమర్చినట్లు స్థానికుల అనుమానం.మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు.మృతులు హనుమమ్మ,సత్యలక్ష్మి, శివరమిరెడ్డిగా గుర్తింపు.
* హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది… రాజధాని సిమ్లా నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోలన్‌లో బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల కింద 35 మంది చిక్కుకుపోయారు. వీరిలో ఇండియన్ ఆర్మీ సైనికులు, వారి కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు 15 మంది ఆర్మీ జవాన్లను బయటకి తీయగలిగారు సైనికులు.. సరైన పరికరాలు లేకపోవడంతో సహాయక చర్యల్లో జాప్యం జరుగుతోంది. మరోవైపు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనా స్థలానికి చేరుకోనున్నాయని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా రెస్టారెంట్ ఉన్న భవనం కూలిపోయినట్టు తెలిపారు. ఉత్తరాఖండ్ వెళ్తున్న ఆర్మీ జవాన్లు, వారి కుటుంబసభ్యులు రెస్టారెంట్‌లో భోజనం చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
* మేడ్చల్ జిల్లా కీసర వద్ద ఔటర్ రింగ్రోడ్డుపై ప్రమాదం జరిగింది. అయిల్ ట్యాంకర్ను కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితులు శ్యాంసుందర్(55), జ్యోతి, మేఘన, గాయిత్రిగా గుర్తించారు. నల్లగొండ నుంచి బాసరకు కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
*గుజరాత్లోని అడ్వెంచర్ పార్క్లో ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. జాయ్రైడ్ (కొలంబస్ లాంటిది) అకస్మాత్తుగా కూలిపోవడంతో ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం మధ్యాహ్నం అహ్మదాబాద్ మణినగర్లోని అడ్వెంచర్ పార్కులో ఈ ఘటన చోటు చేసుకుంది.
*అహ్మదాబాద్ నగరంలోని ప్రముఖ కనకరియా సరస్సు వద్ద జెయింట్వీల్ తరహా జాయ్రైడ్ ఒక్కసారిగా కుప్పకూలిన దుర్ఘటనలో ఆదివారం ఇద్దరు మరణించారు.
*ఓ కారు దొంగతనం కేసులో నిందితుల కోసం గాలిస్తున్న పోలీసు బృందం అనుకోకుండా.. అపహరణకు గురై బందీలుగా చిక్కి అల్లాడుతున్న ముగ్గురు వ్యక్తులను రక్షించింది. కిడ్నాపర్ల చెర నుంచి విముక్తి పొందిన వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన మలంగ్ షా(34) అనే వ్యక్తి కూడా ఉన్నారు.
*తమిళనాడులోని చెన్నై, నాగపట్నం తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ఆదివారం ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు.
*టోల్ప్లాజాలో టోల్ రుసుము వసూలు క్యాబిన్ను జేసీబీలను తరలించే వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.
*మారణాయుధాలతో దాడి చేసి, వెంటాడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని హతమార్చారు. ఒడిశా రాష్ట్రం పూరీ జిల్లా సాక్షిగోపాల్ పరిధిలోని పట్నాయకియా కూడలి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
*దొంగతనం కేసులో ఒక వ్యక్తిని పట్టుకెళ్లిన పోలీసులు ఆ తర్వాత అతడి వదినను కూడా తీసుకెళ్లి ఆమెను నానా చిత్రహింసలకు గురిచేశారు. గోళ్లు ఊడబీకారు. రెప్ప తెరవలేనంతగా, కళ్లు తీవ్రంగా దెబ్బతినేలా కొట్టారు. చివరకు నిస్సహాయురాలైన ఆమెపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. అత్యంత దారుణమైన ఈ సంఘటన రాజస్థాన్లోని చురు జిల్లాలో ఈ నెల 6న జరిగింది.
*హిమాచల్ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలడంతో ఒక సైనికుడు సహా ఇద్దరు మరణించారు.
*ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లా గుమియాపాల్ అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.
*వైద్యుల పర్యవేక్షణ లేకుండా నర్సులే కాన్పు చేయడం.. శిశువు మృతి చెందడంతో బాలింత కుటుంబ సభ్యులు ఖమ్మం జిల్లా సత్తుపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
*దివ్యాంగులైన కన్నబిడ్డల్ని సాధారణ పిల్లల్లా మార్చాలని ఆ తల్లి ఎంతో తపించింది. చివరికి సాధ్యం కాదని తెలిసి పిల్లలకు విషమిచ్చి, తానూ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన విశాఖ నగర పరిధి 72వ వార్డు గొల్లనారాయణపురంలో ఆదివారం చోటు చేసుకుంది.
*విశాఖ జిల్లా చోడవరంలో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై ఓ యువకుడిని దుండగుడు అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.
*విజయవాడ నగరంలో దోపిడీ దొంగలు మరోసారి రెచ్చిపోయారు. ప్రగతి రవాణా సంస్థ గోదాం సిబ్బందిపై దాడి చేసి రూ.4 లక్షలు దోచుకెళ్లారు.
*మేడ్చల్ జిల్లా కీసర పరిధిలోని ఔటర్ రింగురోడ్డుపై ఓ ఆయిల్ ట్యాంకర్ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
*గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో ఓ అమ్యూజ్మెంట్ పార్కులో ప్రమాదం చోటుచేసుకుంది.
* కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి తన అన్నను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం నీలా గ్రామంలో కలకలం రేపింది. గ్రామానికి చెందిన కలీమ్ అన్న వ్యక్తి తన అన్న ఖలీల్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు. అయితే ఈ హత్యకు కుటుంబ కలహాలే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.