Movies

తప్పు కాదు

Puja Hegde Says Expecting Happiness Is Not Wrong

‘‘నటిగా నేను ఏం చేయాలో? ఏం చేయకూడదో? అనే విషయాలను నాకు నేర్పింది సినిమాలే. ప్రతిరోజూ షూటింగ్ నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు కొత్తగా నేర్చుకున్న అంశాలను నెమరేసుకుంటుంటాను’’ అని అన్నారు పూజా హెగ్డే. మహేశ్ సరసన ఆమె నటించిన ‘మహర్షి’ మంచి విజయం సాధించింది. జయాపజయాలను గురించి మాట్లాడుతూ ‘‘ఒకప్పుడు హిట్టూ, ఫ్లాప్ల గురించి పట్టించుకునేదాన్ని. కానీ సినిమా ఘన విజయం సాధించినప్పటికీ, ఆ ఆనందం నాలో వారం, పది రోజులకు మించి ఉండటం లేదు. ఆ తర్వాత రొటీన్లో పడిపోతున్నా. అందుకే ఇప్పుడు రొటీన్ని ఆస్వాదిస్తున్నా. కథ విని సినిమాకు సంతకం చేస్తున్నప్పుడు ఆ చిత్రం షూటింగ్ ప్రాస్సలో నేను ఎంత ఎంజాయ్ చేయగలుగుతాననే విషయాన్ని ఆలోచిస్తున్నా. తప్పకుండా సెట్లో ఎంజాయ్మెంట్ ఉంటుందనిపిస్తే వెంటనే సంతకం చేస్తున్నా. ఎందుకంటే ప్రతి సినిమా కోసం కొన్ని నెలలను కేటాయించాల్సి ఉంటుంది. మరికొన్ని ప్రత్యేక సందర్భాల్లో సినిమాతో ఒకటీ, రెండేళ్లు కూడా ట్రావెల్ చేయాల్సి వస్తుంది. నా జీవితంలో అత్యంత విలువైన సమయాన్ని కేటాయిస్తున్నప్పుడు ఆనందాన్ని గురించి ఆలోచించడంలో తప్పేం ఉంది’’ అని చెప్పారు పూజా.