అవునా? అంతేనా? ఆ రెండు పదాల్లో ఎన్నో అర్థాలు నిగూడమైఉన్నాయి, ఇంకా చెప్పాలంటే జీవితాలతో ముడిపడిఉంటాయి. తాజాగా నటి సాయిపల్లవి ఇలాంటి వాటినే ఎదుర్కొంటోంది. సాయిపల్లవి పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది మలయాళం చిత్ర ప్రేమమ్నే. ఎందుకంటే అదే ఈ అమ్మడి తొలి చిత్రం కాబట్టి. అందులో మలర్ టీచర్గా సాయిపల్లవిని అంత తొందరగా మర్చిపోలేం. అది మలయాళ చిత్రం అయినా దక్షిణాదిలో ఎంతో పాపులర్ అయ్యింది. ఇక తెలుగులో అయితే ఏకంగా అదే పేరుతో రీమేక్ కూడా అయ్యింది. అంతే కాదు ఇతర భాషల్లోనూ అవకాశాలు రావడానికి కారణమైంది. అయితే తమిళంలో వచ్చిన కొన్ని అవకాశాలను సాయిపల్లవి తిరష్కరించినట్లు ప్రచారం జోరందుకుందప్పట్లో. కథ కొత్తగా ఉండాలి. పాత్ర నాకు నచ్చాలి లాంటి కండిషన్లతో సాయిపల్లవి కోలీవుడ్ ఎంట్రీ ఆలస్యం అయిందనే విమర్శలు కూడా వచ్చాయి. అలా ఏరి కోరి తమిళంలో నటించిన దయా చిత్రం సాయిపల్లవిని పూర్తిగా నిరాశ పరచింది. సరే ధనుష్తో నటిస్తున్న చిత్రం మారి–2 చిత్రం అయినా ఆమె ఖాతాలో హిట్గా నిలుస్తుందని ఆశ పడింది.అందులో రౌడీ బేబీ పాట మాత్రం విశేష ఆదరణను అందుకుంది కానీ, సినిమా సాయిపల్లవి కెరీర్కు ఏ మాత్రం హెల్ప్ అవ్వలేదు. ఇక నటుడు సూర్యతో జత కట్టిన ఎన్జీకే చిత్రంపై ఆశలు పెట్టుకుంది. అది సుదీర్ఘ కాలం నిర్మాణం జరుపుకుని చివరికి నిరాశనే మిగిల్చింది. దీంతో ఇక్కడ మరో అవకాశం లేదు. అంతే కాదు సాయిపల్లవి మంచి నటే కానీ, రాశి లేని నటి అనే ముద్ర పడిపోయింది. దీంతో ఐరన్లెగ్ ముద్ర వేసుకున్న అమ్మడికి కొత్తగా అవకాశాలు వచ్చే రావడం కష్టమే. ఎందుకంటే పరిగెత్తే గుర్రాలపైనే ఎవరైనా పందేలు కాస్తారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగని నటిగా సాయిపల్లవి కెరీర్ ఎండ్ అయినట్లు భావించరాదు. మాలీవుడ్, టాలీవుడ్లో ఈ అమ్మడికి అవకాశాలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అక్కడ ఫిదా, ఎంసీఏ వంటి హిట్ చిత్రాలు కూడా ఉన్నాయి. తాజాగా తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తోంది. అందులో రానాకు జంటగా నటిస్తున్న చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. అదే విధంగా మాతృభాషలోనూ నటిగా సాయిపల్లవికి మంచి గిరాకీనే ఉంది. ఎటు తిరిగి కోలీవుడ్లోనే ఈ అమ్మడికి టైమ్ బాగాలేదు. అయినా ఇక్కడ అవకాశాల కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదట. మరో విషయం ఏమిటంటే తనకు అవకాశాలు రాకపోతే ఉండనే ఉంది వైద్య వృత్తి అని సాయిపల్లవి ఇది వరకే చెప్పింది. అలాగే పనిలో పనిగా తాను పెళ్లి కూడా చేసుకోనని చెప్పేసింది.
నో పెళ్లి
Related tags :