WorldWonders

ఈ ద్రాక్ష ధర వింటే అదిరిపోతారు

The crazy price of this crazy grapes is crazy

అందని ద్రాక్ష పుల్లన అంటారు. కానీ ఈ తియ్యని ద్రాక్ష రేటు మాత్రం అందరికీ అందనంత ఎత్తులో ఉంది. రుబీ రోమన్ గ్రేప్స్‌ గా పిలిచే ఈ ద్రాక్ష పండ్లను చాలా అరుదుగా పండిస్తారట జపాన్ వాసులు. అందుకే 11వేల డాలర్లు (భారత కరెన్సీలో రూ.7.5 లక్షలు) పెట్టి కొనడానికి సైతం పోటీ పడ్డారు. జపాన్‌లోని ఇషికావా దీవిలో వీటిని పరిమిత సంఖ్యలో పండిస్తారు. 2008 నుంచి పండిస్తున్న ఈ పండ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. పంట కోతకు వచ్చాక మొదటి విక్రయంలో ఒక ద్రాక్ష గుత్తిని వేలానికి పెడతారు నిర్వాహకులు వీటికి ఉన్న డిమాండ్ దృష్ట్యా. ఇక ఈ ద్రాక్ష గుత్తిని కొనుగోలు చేయడానికి వందల మంది పోటీపడుతుంటారు.ఇంతకీ ఎందుకంత రేటు.. ఏంటో అంత స్పెషల్ అని అనిపిస్తోంది కదూ.. ఇవి తింటే ఆయుష్షు పెరుగుతుందా.. లేక ఎప్పటికీ నవ యవ్వనంతోనే ఉంటారా అనే అనుమానం కూడా వస్తోంది కదూ.. అవేవి కాదండి.. ధరకు తగ్గట్లే ఈ ద్రాక్ష పండ్లు చాలా ప్రత్యేకంగా ఉంటాయని రైతులు చెబుతున్నారు. చాలా తీయగా, పుల్లగా లేకుండా, ఎక్కువ రసం కలిగి ఉంటాయని అంటున్నారు. సాధారణ రోజుల్లో కూడా ఈ ద్రాక్ష గుత్తి ధర 460 డాలర్లు (రూ.31,537) వరకు ఉంటుందట. ఈ ద్రాక్ష పండ్లను ఎక్కువగా బహుమతిగా ఇతరులకు ఇచ్చేందుకు కొంటారట. కొన్ని హోటల్స్‌లో అయితే విఐపీ కస్టమర్లు వస్తే వారికి స్పెషల్‌గా అందిస్తారట. సంపన్నులు దీన్నీ లగ్జరీ ఫ్రూట్‌గా కొనుగోలు చేస్తారు. ఈ ఏడాది 26 వేల ద్రాక్ష గుత్తులను అమ్మకానికి పెట్టినట్లు తెలిపారు. 11 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్న ఈ వేలంలో ఎప్పుడూ ఇంత ధర పలకలేదని, ఈసారి ఎంతరైటే కొనడానికి జపనీయులు ఎగబడుతున్నారని నిర్వాహకులు చెబుతున్నారు.