Food

జపాన్ టీ ఒత్తిడిని తరిమేస్తుంది

This Japanese Tea Will Help Reduce Stress

రొటీన్‌ జీవితంలో ఒత్తిడికి గురికాని వారు అరుదు. నిత్యజీవితంలో ఒత్తిడిని బ్రేక్‌ చేసి ఉత్సాహంగా పనిచేసేందుకు జపనీయులు ఇప్పుడు మచా టీని ఆశ్రయిస్తున్నారు. ఈ టీలో ఒత్తిడిని తగ్గించే పదార్ధాలతో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయని జర్నల్‌ ఆఫ్‌ ఫంక్షనల్‌ ఫుడ్స్‌లో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మచా పౌడర్‌ను ఎలుకలపై ప్రయోగించిన మీదట వాటిలో ఒత్తిడి, కంగారు తగ్గినట్టు గుర్తించారు.ఒత్తిడికి కారణమయ్యే డోపమైన్‌, సెరటోనిన్‌లను ఈ టీ ఉత్తేజితం చేయడం ద్వారా ప్రశాంతత చేకూరుస్తుందని పరిశోధకులు గుర్తించారు. మచాలో మానవ శరీరానికి మేలు చేకూర్చే పదార్ధాలు ఉన్నాయని తమ అథ్యయనం గుర్తించిందని అథ్యయన రచయిత, కుమమటో వర్సిటీకి చెందిన యుకి కురిచి చెప్పారు.