Videos

[Video] బ్రెగ్జిట్ ఆనంద తాండవమేమో?

Theresa May Dancing Video Is Shaking The Internet

బ్రిటన్ ప్రధానమంత్రి థెరెసా మే డాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరికొద్ది రోజుల్లో ప్రధానమంత్రిగా పదవీకాలం పూర్తి చేసుకోనున్న థెరెసా మే.. లండన్‌లో నిర్వహించిన హెన్లీ ఫెస్టివల్‌లో భర్తతో కలిసి నృత్యం చేస్తూ అలరించింది. అబ్బా హిట్స్ ‘డాన్సింగ్ క్వీన్’ ‘మమ్మ మిమా’ లిరిక్స్‌కు చేతులు పైకి లేపి రెండు వైపులా ఊగుతూ నృత్యం చేశారు. బ్రెగ్జిట్ సంక్షోభం నేపథ్యంలో బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు థెరెసా మే. అనంతరం బ్రెగ్జిట్ ఒప్పందంపై పార్లమెంట్‌లో పలుమార్లు ఎంపీల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. కాగా ఇలా పబ్లిక్ ప్రదేశాల్లో అప్పుడప్పుడు డాన్స్ చేస్తూ కాస్త రిలాక్స్ అవుతుంటారని నెటినెజ్లు కామెంట్ చేస్తున్నారు. గతేడాది దక్షిణ ఆఫ్రికాలో ఓ స్కూల్లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై అక్కడి విద్యార్థులతో కలిసి డాన్స్ చేశారు.