కార్బన్‌డైయాక్సైడ్ పేరు చెబితేనే… విషవాయువు అన్న భావన మన మనసులో మెదలుతుంది. ఇది నిజం కూడా. అయితే ఈ విషం నుంచే శరీరానికి పుష్టినిచ్చే ప్రొటీన్లను ఉత్పత్తి చేసేందుకు సోలార్ ఫుడ్స్ అనే కంపెనీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. గాల్లోంచి సేకరించే కార్బన్‌డైయాక్సైడ్ ను సోలిన్ అనే ప్రొటీన్‌గా మార్చేందుకు ఈ కంపెనీ ఓ వినూత్నమైన టెక్నాలజీని రూపొందించింది. ఆకు కూరలు, కాయగూరల వంటి మొక్కల ఆధారిత ప్రొటీన్ల కంటే సోలిన్ ప్రొటీన్ వందరెట్లు ఎక్కువ వాతావరణ అనుకూలమని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త, సోలార్ ఫుడ్స్ సీఈవో పసి వైనిక్కా తెలిపారు. సోలార్ ఫుడ్స్ అభివృద్ధి చేసిన ప్రక్రియలో మొట్టమొదటగా నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌లుగా విడగొడతారు.ఇందులోని హైడ్రోజన్‌కు కార్బన్‌డైయాక్సైడ్, పొటాషియం, సోడియం, కొన్ని ఇతర పోషకాలను చేరుస్తారు. ఫలితంగా తయారైన పదార్థాన్ని సూక్ష్మజీవులకు ఆహారంగా ఇచ్చినప్పుడు 50 శాతం ప్రొటీన్‌తోపాటు 25 శాతం కార్బోహైడ్రేట్ల్రు, పదిశాతం వరకూ కొవ్వులు ఉంటాయి. వ్యవసాయంతో ఏమాత్రం సంబంధం లేకుండా ఈ ప్రొటీన్ ఉత్పత్తి కావడం గమనార్హం. అన్నీ సవ్యంగా సాగితే ఇంకో రెండేళ్లలో సోలిన్ ప్రొటీన్ అందరికీ అందుబాటులోకి వస్తుందని అంచనా. ప్రొటీన్‌షేక్ లేదా పెరుగులాంటి పానీయం రూపంలో దీన్ని అందుబాటులోకి తెస్తామని పసి వైనిక్కా తెలిపారు.
CO2ను ప్రోటీన్‌గా మార్చారు. ఇక తినడమే తరువాయి.
Related tags :