DailyDose

హైదరాబాద్‌లో ఇమ్మిగ్రేషన్ దాడులు-నేరవార్తలు–07/17

Immigration Raids In Hyderabad - Daily Crime News - July 17 2019

* విద్య, వ్యాపార, పర్యాటక వీసాలపై భారత్కు వచ్చి హైదరాబాద్లో ఉంటున్న విదేశీయులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. హైదరాబాద్ ప్రత్యేక పోలీసు బృందాలు, నిఘా విభాగం, విదేశీ ప్రాంతీయ నమోదు కేంద్రం అధికారులు రాజధానిలో విదేశీయులుంటున్న ప్రాంతాల్లో మంగళవారం 5 గంటల పాటు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఇళ్లు, వసతిగృహాలకు వెళ్లి వివరాలను సేకరించారు. అనంతరం వారిని మల్లేపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్కు తరలించారు. అక్కడ 252 మంది విదేశీయుల పాస్పోర్టులు పరిశీలించారు. ఇందులో 74 మంది ఆఫ్రికన్ల వీసా గడువు ముగిసిందని గుర్తించారు. వారి వద్ద పత్రాలను పరిశీలించగా.. 23 మందికి పాస్పోర్టులు, ఇతర పత్రాలు కూడా లేవని తెలుసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా ఇక్కడ నివసిస్తున్న ఆఫ్రికన్లపై చట్టబద్ధంగా చర్యలు చేపట్టనున్నామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. టోలీచౌకీ, మెహిదీపట్నం, ఆసిఫ్నగర్, సైఫాబాద్, ఓయూ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో వీరు కొన్నేళ్ల నుంచి నివాసం ఉంటున్నారన్నారు. ఇండియన్ పాస్పోర్టు చట్టం ప్రకారం 23 మందిని హైదరాబాద్లోని డిటెన్షన్ కేంద్రానికి పంపుతున్నామని, అనంతరం సొంత దేశాలకు తరలించనున్నామన్నారు. వీరిలో దక్షిణాఫ్రికా, సోమాలియా, యెమన్, కెన్యా దేశాల వారున్నారని వివరించారు.
*విడాకులు అడిగిందని భార్యను చంపిన ఎన్నారై
భార్య హత్య కేసులో భారత సంతతి వ్యక్తిని అమెరికా కోర్టు దోషిగా నిర్ధ్దారించింది. అవతార్ గ్రేవాల్(44) అనే ఎన్నారైకి 2005లో నవనీత్ కౌర్తో భారత్లో వివాహమైంది. ఆమె అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా, భర్త ఉద్యోగ రీత్యా కెనడాలో ఉంటున్నారు. భార్యపై అనుమానంతో పదేపదే ఆమెకు ఫోన్ చేసేవాడు. ఫోన్ ఎత్తకపోతే ఆమె ఆఫీసులో ఆరా తీసేవాడు. భర్త వైఖరితో విసుగెత్తిన నవనీత్ 2007లో ఫోన్లోనే విడాకులు కోరింది. దీనిపై మాట్లాడుకుందామని అమెరికా వచ్చిన భర్తను ఇంటికి తీసుకెళ్లింది. విడాకులపై ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తగా అవతార్ ఆగ్రహంతో ఆమె గొంతు నులిమి బాత్టబ్లో ముంచి హత్యచేసి భారత్కు పరార య్యాడు. అవతార్ను భారత అధికారులు 2011లో అమెరికా పోలీసులకు అప్పగించారు. 12 ఏళ్ల నాటి కేసులో యూఎస్ స్థానిక కోర్టు అవతార్ను దోషిగా తేల్చింది. ఆగస్టు 23న శిక్షను ఖరారు చేయనున్నట్లు తెలిపింది.
*పోలీసుల పేరుతో ఓ బంగారం వ్యాపారిని దోచుకున్న వారిని రేణిగుంట GRP పోలీసులు పట్టుకున్నారు. చిత్తూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ముకుందరాజన్ అనే అతను కోయంబత్తూరుకు చెందిన బంగారు వ్యాపారి. అతను ప్రతీవారం ప్రొద్దుటూరుకు వెళ్లి బంగారం వ్యాపారం చేసుకుని తిరిగి కోయంబత్తూరుకు వెళ్లేవారు. అయితే అదే ఊరిలో రాజశేఖర్ అలియాస్ శేఖర్ అనే మరో బంగారం వ్యాపారి ఉన్నాడు. శేఖర్ కు భారీగా అప్పులు ఉన్నట్లు తెలిపారు పోలీసులు. దీంతో ముకుందరాజన్ ను దోచుకోవడానికి పథకం పన్నాడు శేఖర్. ఇందుకు పుల్లారెడ్డి, ప్రసాద్ అనే మరో ఇద్దరి సహాయం తీసుకున్నాడు.
* పాక్ కు రూ.41వేల కోట్ల జరిమానా
బంగారం, రాగి గనులను లీజుకు ఇవ్వడాన్ని నిరాకరించినందుకు పాకిస్థాన్కు ప్రపంచబ్యాంకు రూ.41,100 కోట్ల భారీ జరిమానా విధించింది. బలూచిస్థాన్లోని రెకో డిక్ అనే చిన్న పట్టణం బంగారం, రాగి నిల్వలకు ప్రసిద్ధి. ఇక్కడి బంగారు గని ప్రపంచంలోనే అయిదో స్థానం పొందింది. వివిధ దేశాలతో పాకిస్థాన్ కుదుర్చుకున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలకు అనుగుణంగా దీన్ని లీజుకు పొంది తవ్వకాలు చేపట్టడానికి చిలీకి చెందిన అంటోఫగస్టా, కెనడాకు చెందిన బారిక్ గోల్డ్ కార్పొరేషన్లు సంయుక్తంగా తెత్యాన్ కాపర్ కంపెనీగా ఏర్పడి 2010లో దరఖాస్తు చేశాయి. ఈ సందర్భంగా అన్ని రకాల సర్వేలు చేసి నివేదికలు సమర్పించాయి. అయితే వివిధ కారణాలతో బలూచిస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో నష్టపరిహారం ఇప్పించాలంటూ 2011లో ఆ కంపెనీ ప్రపంచ బ్యాంకు పరిధిలోని అంతర్జాతీయ పెట్టుబడి వివాదాల పరిష్కార కేంద్రాన్ని ఆశ్రయించింది.
* పాలక్కడ్‌ జిల్లాలో ఓ తినుబండారాల దుకాణదారుడు 59 మంది బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విషయం తెలిసి పోలీసులు కేసు పెట్టడంతో ఊరు విడిచి పరారయ్యాడు.
* సిలిండర్ పైప్ తో గ్యాస్ పీల్చి బ్యాంక్ ఎంప్లాయ్ చనిపోయిన ఘటన చైతన్యపురి పీఎస్ పరిధిలో జరిగింది.
* ప్రకాశం జిల్లా మార్టూరు శివారు బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద భారీగా గంజాయిని అధికారులు పట్టుకున్నారు. రెండు ఆర్టీసీ బస్సుల్లో గంజాయి తరలిస్తున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఓ మహిళ కూడా ఉంది. నిందితుల వద్ద నుంచి 80 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రెండు బస్సులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
* ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.
* శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని బీఈడీ కళాశాల అధ్యాపకునిగా పని చేస్తున్న రూప్లానాయక్‌కు జైలు శిక్ష పడినట్లు ఇటుకలపల్లి సీఐ విజయభాస్కర్‌గౌడ్‌, ఏఎస్‌ఐ నాగన్న తెలిపారు. వివాహమైన ఆరేళ్లకే అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నాడని, మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ 2014 సెప్టెంబరులో ఆయన భార్య శ్రీదేవిబాయి ఇటుకలపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతపురం ఎక్సైజ్‌ కోర్టులో వాదనలు వినిపించారు. అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రెహనా రసూల్‌ బాధితురాలి తరపున కోర్టులో వాదించారు. దీంతో నిందితునికి ఆరునెలల జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ మంగళవారం కోర్టు తీర్పు ఇచ్చినట్లు సీఐ తెలిపారు.
* మచిలీపట్నం తెలుగు చర్చి ఆవరణలోక్రైస్తవులు ఎంతో ప్రార్థన పూర్వకంగా చూసుకునే సమాధుల మధ్య అందంగా కనపడే పచ్చటి చెట్లు ఒక్కసారిగా అగ్నికి రూపం మారిపోయాయి. సమాధుల మధ్య గుబురుగా ఉండే చెట్ల నుండి మంటలు వ్యాపించడంతో స్థానికులు ఒక్కసారిగా బెంబేలెత్తారు.
* ప్రకాశం జిల్లావినుకొండ నుండి అక్రమంగా లారీలో తరలిస్తున్న 600 ల బస్తాల రేషన్ బియ్యాని టంగుటూరు టోల్ ప్లాజా వద్ద పట్టుకొన్న టంగుటూరు Si రమణయ్య….మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
* ప్రకాశం జిల్లామార్టూరు మండలం బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో 70 కేజీల గంజాయిని తరలిస్తున్న 8 మంది వ్యక్తుల తో పాటు ఒక మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అద్దంకి ఎక్సైజ్ పోలీసులు
* నిజామాబాద్ జిల్లా జైలులో ఓ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. హత్య కేసులో వెంకటేశ్‌ అనే వ్యక్తికి ఇటీవల న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఈ రోజు వెంకటేశ్‌ కిటికీకి టవల్‌తో ఉరి వేసుకొని జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతి చెందిన ఖైదీది కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరుగొండ గ్రామం. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు జైలు అధికారులు తెలిపారు.
* వి.కోట మండలం నాయకనేరి అటవీ ప్రాంతంలోని ఆంధ్ర – తమిళనాడు సరిహద్దులో ఓ టెంపో అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తమిళనాడు వాసులు మృతి చెందారు.
*నిజామాబాద్‌ జిల్లా జైలులో ఓ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. కిటికీకి టవల్‌తో ఉరి వేసుకొని ఖైదీ వెంకటేష్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ హత్య కేసులో వెంకటేష్‌కు న్యాయస్థానం ఇటీవలే జీవిత ఖైదు విధించింది. మృతుడు కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరుగొండ వాసి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
* జ‌మాతుల్ ద‌వా చీఫ్‌, ఉగ్ర‌వాది హ‌ఫీజ్ మొహ్మ‌ద్ స‌యీద్‌ను పాకిస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. లాహోర్ నుంచి గుర్జ‌న్‌వాలా వైపు వెళ్తున్న స‌మ‌యంలో స‌యీద్‌ను కౌంట‌ర్ టెర్ర‌రిజం డిపార్ట్‌మెంట్‌(సీటీడీ) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
* విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న సబ్‌ ఇంజనీర్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన మండలంలోని జమ్మిచేడు వద్ద మంగళవారం చోటు చేసుకుంది.
* చెట్టుకు ఉరి వేసుకుని వివాహితుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అమృతలూరు మండలం పాంచాళవరం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గోనుగుంట్ల లక్ష్మీనారాయణ(35), అదే గ్రామానికి చెందిన దివ్య పదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. లక్ష్మీనారాయణ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు.
* నిజామాబాద్ జిల్లా జైలులో ఓ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. హత్య కేసులో వెంకటేశ్‌ అనే వ్యక్తికి ఇటీవల న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఈ రోజు వెంకటేశ్‌ కిటికీకి టవల్‌తో ఉరి వేసుకొని జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతి చెందిన ఖైదీది కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరుగొండ గ్రామం. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు జైలు అధికారులు తెలిపారు.
* అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని రేపింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కేసీ పెంట గ్రామంలో రైతు పెరుమాళ్ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న సెంట్ల భూమిలో రెండు సార్లు బోరు వేసినా నీటి జడలేదు. దీంతో అప్పులు బాగా పెరిగిపోయాయి. దీంతో అవి తీరే మార్గం కనిపించక పెరుమాళ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు ముగ్గురు మగ పిల్లలుఒక ఆడపిల్ల ఉన్నారు.
* ముంబై పేలుళ్ల సూత్రధారిజమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌ అరెస్ట్ అయ్యాడు. పాకిస్థాన్‌లోని గుజ్రన్‌వాలా నుంచి లాహోర్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న హఫీజ్‌ను ఉగ్రవాద నిర్మూలన విభాగం అరెస్ట్ చేసినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది.
*పాముకాటుతో బాధపడుతున్న ఓ 25 ఏళ్ల మహిళకు వైద్యులు చికిత్స అందిస్తున్న క్రమంలో బాధితురాలికి ఆమె కుటుంబ సభ్యులు తాంత్రికుడితో మంత్రాలు చేయించారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌ జిల్లాలో ఆదివారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
*భూగర్భ జలాలు అడుగంటి బిందెడు తాగు నీటి కోసం పొలాల బాట పట్టిన ఇద్దరు విద్యుత్తు తీగలు తగిలి ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని పెద్దమర్రివీడు గ్రామానికి చెందిన జయలింగ(28), నవీన్(15)లు కలిసి సమీప పొలంలో బోరు వద్ద నీటిని తెచ్చుకునేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. రాత్రి ఈదురు గాలులకు సమీపంలోని 11కేవీ విద్యుత్తు తీగ తెగిపడింది. ఇది గమనించని ఇద్దరూ వాహనంపై వెళ్తుండగా తీగ తగిలింది.
*ఓ వివాహితను బెదిరించి లొంగదీసుకున్న నలుగురు యువకులు ఆమెపై ఏడాదిగా లైంగిక దాడులకు పాల్పడ్డారు. వారి ఆగడాలను ఏడాదిపాటు భరించిన ఆమెకు ఇటీవలి కాలంలో వేధింపులు ఎక్కువయ్యాయి. భర్తను చంపేస్తామని, ముఖంపై యాసిడ్ పోస్తామని నలుగురూ బెదిరింపులకు దిగడంతో ఆమె భర్త సాయంతో మంగళవారం పోలీసులను ఆశ్రయించింది. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఓ వీధిలో దంపతులు చేతి వృత్తి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
*చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఓ సెక్యూరిటీ గార్డును మైలార్దేవుపల్లి పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
* దారుణం! పాలక్కడ్ జిల్లాలో ఓ తినుబండారాల దుకాణదారుడు 59 మంది బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
*నిర్లక్ష్యం, అతివేగం ముగ్గురు ఇంటర్ విద్యార్థులను బలితీసుకున్నాయి.నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని తర్లపాడు గ్రామశివారులో మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురు యువకులు అసువులు బాశారు.
*తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయారు.
*ముంబయిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. డోంగ్రి ప్రాంతంలోని తండెల్ వీధిలో నాలుగు అంతస్తుల కేసరీభాయ్ భవనం కుప్పకూలింది.
*ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో టిక్టాక్ వ్యవహారంపై కమిషనర్ శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలో విధులు నిర్వర్తించకుండా టిక్టాక్ చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. 9 మంది పొరుగు సేవల సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
*ఇద్దరు పిల్లలున్న వివాహిత వ్యామోహంలో చిక్కుకుని ఆమె భర్తను హతమార్చేందుకు యత్నించిన నిందితుడు అరెస్టు అయ్యాడు. అందుకు సహకరించిన వివాహితమైనా కేసు నమోదైంది. ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణాజిల్లా గంపలగూడేనికి చెందిన భాస్కరభట్ల రాంకుమార్ (34) తూర్పు ఆనంద్బాగ్లో నివసిస్తూ పౌరోహిత్యం చేస్తాడు.
*భర్త పెట్టే వేధింపులు భరించలేక ఓ భార్య తన ఇద్దరు కుమారులకు విషమిచ్చి తానూ తాగింది. ఈ ఘటనలో తల్లి మృతిచెందగా, చిన్నకుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ హృదయవిదారకరమైన ఈ ఘటన నగరంలోని చిలకలగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
*హైదరాబాద్ నగరంలోని చందానగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బీహెచ్ఈఎల్ ఎంఐజీ కాలనీలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. రాజశేఖర్రెడ్డి(44) అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు పదునైన ఆయుధంతో తలపై కొట్టి హత్య చేశారు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
*మధ్యప్రదేశ్లో కలకలం సృష్టించిన మూడేళ్ల చిన్నారి కిడ్నాప్ ఘటన కేసును పోలీసులు చేధించారు. అయితే చిన్నారి ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు. జులై 14న గెహున్ ఖేడా ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు విపిన్ మీనా అనే వ్యక్తి మూడేళ్ల కొడుకును కిడ్నాప్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు కోలార్లో ఉన్న ఇంట్లో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు.
*దాదాపు 40 దొంగతనాల కేసుల్లో నిందితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న మౌసిన్ అలీ, సయ్యద్ మాజీద్ అనే ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లుగా తెలిపారు. అపహరించిన సొమ్మును అమ్మడానికి ప్రయత్నిస్తుండగా టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు.
*‘గేల్ కు కోటిన్నర ఇవ్వండి’
ఆస్ట్రేలియాకు చెందిన ఫెయిర్‌ ఫాక్స్‌ పత్రికపై వేసిన పరువు నష్టం కేసులో వెస్డిండీస్‌ స్టార్‌ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌‌ విజయం సాధించాడు. గేల్ పరువుకు నష్టం కలిగించినందుకు దాదాపు కోటిన్నర రూపాయలు చెల్లించాలని న్యూసౌత్‌ వేల్స్‌ న్యాయస్థానం తీర్చు ఇచ్చింది. 2015 వరల్డ్‌ కప్‌ సందర్భంగా సిడ్నీ స్టేడియంలోని డ్రెస్సింగ్‌‌ రూమ్‌ లోకి మసాజ్‌ చేయడానికి వచ్చిన మహిళ పట్ల గేల్‌‌ అసభ్యం గా ప్రవర్తించాడని ఫెయిర్‌ఫాక్స్‌ పత్రిక కథనం ప్రచురించింది. దీనిపై 2016లో గేల్‌‌ న్యాయ స్థానాన్ని ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు గతేడాది అక్టోబర్‌ లోనే గేల్‌‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది. అయితే పరిహారం సరిపోలేదంటూ గేల్‌‌, విచారణ సరిగ్గా జరగలేదని ఫెయిర్‌ఫాక్స్‌ తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.దీని పై విచారణ చేసిన కోర్టు వీళ్ల అప్పీల్‌‌ను తిరస్కరించింది.