DailyDose

మోడీ అమెరికా పర్యటన ఖరారు-తాజావార్తలు–07/17

Modi USA Tour 2019 Confirmed - Daily Breaking News - July 17 2019

* ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబరు చివరి వారంలో అమెరికాలో పర్యటించే అవకాశం ఉంది. పర్యటనకు సంబంధించిన తేదీలు ఇంకా ఖరారు కాలేదు. న్యూయార్క్లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా న్యూయార్క్తోపాటు, హ్యూస్టన్లోని ప్రవాస భారతీయులతో భేటీ అవుతారు. హ్యూస్టన్కు సెప్టెంబరు 22న వచ్చే అవకాశం ఉందని, ఇందుకుతగ్గ సన్నాహాలను ప్రారంభించామని భాజపా విదేశీ మిత్రులు (ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ-ఓఎఫ్బీజేపీ) అనే సంస్థ ప్రతినిధులు తెలిపారు.
* కృష్ణా జిల్లాతిరువూరు పట్టణంలోని మధిర రోడ్లో మేరీ మాత విగ్రహం సమీపంలో టేకు చెట్టుపై శిల్పి చెక్కినట్లుగా టేకు చెట్టు పై ఆంజనేయస్వామి ఆకారంలో బొమ్మ దర్శన మిస్తుంది. దీనీని చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో వెళుతున్నారు. చెట్టు కొమ్మ వచ్చే క్రమంలో ముందు బుడుపులాగ వస్తుంది. అబుడుపు ఆంజనేయస్వామి వలే ఉంది.
* పెద్దపల్లిజిల్లాలోని మంథని మండలంలో 23 మంది గ్రామ కార్యదర్శులకు ఉన్నతాధికారులు నోటీసులు జారీచేశారు.
ప్రభుత్వ పథకాల అమలు, సమయపాలనలో నిర్లక్ష్యం వహించడం, స్థానికంగా నివాసం ఉండకపోవడం, విధుల పట్ల నిర్లక్ష్యం వంటి కారణాలతో వీరికి నోటీసులు అందజేసినట్లు సమాచారం.
* సీఎం జగన్‌పై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. అసెంబ్లీలో జగన్ వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడలేదని బైబిల్‌పై ప్రమాణం చేస్తారా? అని అడిగారు. తాను ప్రమాణం చేసేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. మాట తప్పం.. మడమ తిప్పం అంటే ఇదేనా?, వైఎస్ ఆశయాలను తుంగలో తొక్కుతారా?, వైసీపీ పోరాటాలకు.. పార్టీ గెలుపునకు మాదిగలు ఉపయోగపడింది నిజం కాదా? అని ప్రశ్నించారు.
* కేరళ రాష్ట్రంలోపి ఇడుక్కి, మణప్పురం జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ నెల 17, 18,19 తేదీల్లో మూడు రోజుల పాటు కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి, మణప్పురం, కన్నూర్, వయనాడ్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. దీంతోపాటు త్రిస్సూర్, ఎర్నాకులం జిల్లాల్లోనూ భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు.భారీవర్షాలు కురుస్తున్నందు వల్ల మత్స్యకారులు చేపల వేటకు అరేబియా సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ కేంద్ర అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
* జమ్మూకశ్మీర్‌లోని సోపోర్‌ పట్టణంలో భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టారు. సోపోర్‌కు సమీపంలోని గుండ్‌బ్రాత్‌ ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు బలగాలకు సమాచారం అందడంతో ఇవాళ ఉదయం అక్కడ కూంబింగ్‌ నిర్వహించారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అతని వద్ద ఉన్న ఆయుధాన్ని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
* ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలను 25 జిల్లాలు చేస్తామని ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. తాజాగా ఈ విషయమై ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు.
* దేశవ్యాప్తంగా బీజేపీని విస్తరించాలనే క్రమంలో ఆ పార్టీ తనైదన పంథా అనుసరిస్తోంది. వివిధ రాష్ట్రాల గవర్నర్లుగా రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) నేపథ్యం ఉన్న వారినే నియమిస్తూ వస్తోంది. ప్రస్తుతం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్లలో అత్యధికులు ఆరెస్సెస్‌, బీజేపీ నేపథ్యం ఉన్నవారే!
* డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌(డీఎడ్‌) కోర్సులలో ప్రవేశాలకు తొలిదశ కౌన్సెలింగ్‌ బుధవారం నుంచి ప్రారంభమవుతుందని బోయపాలెం డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఏ కిరణ్‌కుమార్‌ తెలిపారు.
* అసోం, బిహార్ రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గతకొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రెండు రాష్ట్రాల్లో కలిసి ఇప్పటి వరకు 55 మంది మృతి చెందారు. లక్షలాది మంది ఆవాసాలు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఉత్తరప్రదేశ్లోనూ వరదల కారణంగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
* కేరళరాష్ట్రంలోని 6 జిల్లాలకు భారీ నుండి అతి భారీ వర్షం.ముందస్తు సూచనలు జారీ చేసిన వాతావరణ శాఖ.రెడ్ అలెర్ట్ ప్రకటించిన కేరళ ప్రభుత్వం.
* గత పక్షం రోజులుగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న కన్నడ రాజకీయం సుప్రీంకోర్టులో తుది అంకానికి చేరింది. కుమారస్వామి ప్రభుత్వ మనుగడకు సంబంధించిన కీలక తీర్పును నేడు సుప్రీంకోర్టు వెలువరించనుంది.
* అసోంలో వరద ధాటికి మరో గ్రామం చెల్లాచెదురైంది. ఆయీ నదీ నీటి ప్రవాహంలో సీరంగ్ జిల్లా దబాబిల్ గ్రామంలో ఇళ్లు, పొలాలు నీటమునిగాయి. ప్రాణాలు చేత పట్టుకుని వలస వెళ్తున్నారు గ్రామస్థులు. ప్రభుత్వ సహకారమూ అందక సహాయం కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు.
* పార్టీ కీలక నేతలతో తెదేపా అధినేత చంద్రబాబు భేటీ ముగిసింది. అసెంబ్లీలో వ్యవహారించాల్సిన తీరుతోపాటు ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేలా నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నీటి ప్రాజెక్టులపై కీలక చర్చ జరిగింది.రాష్ట్రంలో సాగునీటి ప్రాక్టుల నిర్మాణాన్ని నిలిపివేసిన ముఖ్యమంత్రి జగన్‌… తెలంగాణ ప్రభుత్వంతో గోదావరి నీటి తరలింపు పథకాల్లో భాగస్వామ్యం కావాలని నిర్ణయించారని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు.తెలంగాణాలో కాలువల ద్వారా నాగార్జున సాగర్ వద్ద గోదావరి నీటిని ఎత్తిపోయడానికి సుమారు 50 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అమరావతిలో పార్టీ నేతలతో సమావేశంలో చెప్పారు.
* సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్‌ పరీక్షలు సెప్టెంబరు 20 నుంచి 29 వరకు జరగనున్నాయి. ఈ మేరకు యూపీఎస్సీ మంగళవారం టైంటేబుల్‌ విడుదల చేసింది. కాగా, ప్రిలిమినరీ పరీక్ష ఉత్తీర్ణుల జాబితాను పేర్లు, రోల్‌నంబర్ల వారీగా యూపీఎస్సీ విడుదల చేసింది.
* తెలంగాణలోని నాగార్జున సాగర్‌కు, కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు (కేటీపీపీ)కు‘ఉగ్ర ’ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) హెచ్చరించింది. నాగార్జునసాగర్‌ను ‘బీ’కేటగిరిలో, కేటీపీపీని ‘డీ’ కేటగిరీలో చేర్చారు. ఐబీ నుంచి అందిన సమాచారంతో తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూ కేంద్ర విద్యుత్తు శాఖ లేఖ రాసింది. కేంద్రం హెచ్చరించిన జాబితాలో ఢిల్లీతో పాటు 20 రాష్ట్రాలు ఉన్నాయి.
* ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు కాంగ్రెస్‌ జిల్లా నాయకుడు మల్లాది వాసు ఆధ్వర్యంలో బుధవారం మధిర మున్సిపాలిటీలోని ఎస్సీ కాలనీలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీలోని ప్రతి ఇంటికి వెళ్లి ఆ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు.
* కలెక్టర్‌ దూకుడు సూర్యాపేట జిల్లాలో అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.. ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులే టార్గెట్‌గా చర్యలకు సిద్ధమవుతుండటంతో మిగిలిన వారి వెన్నులో వణుకు పుడుతోంది.. రైతు సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలపై మేళ్లచెర్వు, చింతలపాలెం ఎమ్మార్వోలపై వేటు వేశారు జిల్లా కలెక్టర్‌.
* కర్నాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. ఎగువ ప్రాజెక్టులు నిండుతుండటంతో వారంలోగా జూరాలకు కృష్ణా జలాలు వచ్చే అవకాశముంది. ఆల్మట్టి నిండుకుండను తలపిస్తుండగా నారాయణ్పూర్‌కు భారీ వరద వస్తోంది. మరోవైపు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడంతో ఇన్‌ఫ్లో లేదు. గోదావరి ఉప నది ప్రాణహితలో మాత్రమే ఒక టీఎంసీకి మించి వరద కొనసాగుతోంది. మేడిగడ్డ బ్యారేజీ గేట్లు మూసేయడంతో ప్రాణహిత నీళ్లతో కాళేశ్వరం ప్రాంతం గోదావరి నీటితో కళకళలాడుతోంది.
* బిహార్ లో వరదలు పల్లెవాసుల పొట్టగొట్టాయి. కతిహార్ జిల్లా డంగిటొలా గ్రామం ఇటీవల వర్షాలు, వరదలకు నీట మునిగింది. ఈ ప్రాంతంలోని ఇళ్లను కూడా వరదలు ధ్వంసం చేశాయి. ఆహారం, గొడ్డూ, జంతువులు అన్నీ వరదలో కొట్టుకుపోయాయి. తమకు తినేందుకు ఆహారం కూడా దొరకడం లేదని అంటున్నారు స్థానికులు.
* ముంబయి బాంబు పేలుళ్ల సూత్రధారి, జమాత్‌ ఉద్‌ దవా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ అరెస్టయ్యాడు. ఓ కేసు విచారణలో భాగంగా లాహోర్‌ నుంచి గుజ్రాన్‌వాలా వెళ్తున్న సయీద్‌ను కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్‌ పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి ఆయన్ని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లు అధికారిక వర్గాల సమాచారం. మరోవైపు హఫీజ్‌ను జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించినట్లు పాక్‌ మీడియా వర్గాలు చెబుతున్నాయి.
* ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలను 25 జిల్లాలు చేస్తామని ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. తాజాగా ఈ విషయమై ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు.
* పదర మండలం. MRO భూమి పట్టాలు చేస్తానని ఇప్పల పల్లి రైతులనుండి లంచం డబ్బులు తీసుకుంటు, కెమెరాకు చిక్కిన, పదర మండల తహశీల్ధార్ మల్లిఖార్జున రావును సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీధర్. అమ్రాబాద్ తహశీల్ధార్ సురేష్ కుమార్ కు ఇన్ చార్జీ భాధ్యతలను అప్పగించిన కలెక్టర్
* ముంబయి నుంచి దిల్లీకి వెళ్లాల్సిన ‘విస్తారా ఎయిర్‌లైన్స్‌’కు చెందిన విమానానికి సోమవారం పెను ప్రమాదం తప్పింది. 153 మంది ప్రయాణికులతో సోమవారం మధ్యాహ్నం 3.30గంటలకు ముంబయి నుంచి బయలుదేరి సాయంత్రం 5గంటలకు దిల్లీకి చేరింది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో దిల్లీ విమానాశ్రయంలో దిగేందుకు అనుమతి లభించలేదు. దీంతో సమీపాన ఉన్న లఖ్‌నవూకు వెళ్లాలని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిబ్బంది సూచించారు.
* దేశవ్యాప్తంగా బీజేపీని విస్తరించాలనే క్రమంలో ఆ పార్టీ తనైదన పంథా అనుసరిస్తోంది. వివిధ రాష్ట్రాల గవర్నర్లుగా రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) నేపథ్యం ఉన్న వారినే నియమిస్తూ వస్తోంది. ప్రస్తుతం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్లలో అత్యధికులు ఆరెస్సెస్‌, బీజేపీ నేపథ్యం ఉన్నవారే! సంఘ్‌లోనో, పార్టీలోనో చేరకున్నా బీజేపీ సర్కారుపై అనుకూలత ప్రదర్శిస్తున్నవారే! మొత్తం 35 మందికి గాను 30 మంది వారే ఉన్నారు.
* డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌(డీఎడ్‌) కోర్సులలో ప్రవేశాలకు తొలిదశ కౌన్సెలింగ్‌ బుధవారం నుంచి ప్రారంభమవుతుందని బోయపాలెం డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఏ కిరణ్‌కుమార్‌ తెలిపారు.
* కర్ణాటక కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి రోహిణి సింధూరిని డిప్యుటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది2009 బ్యాచ్‌కు చెందిన రోహిణి ఖమ్మం జిల్లా రుద్రాక్షపల్లికి చెందినవారు. విద్యాభ్యాసమంతా హైదరాబాద్‌లోనే సాగింది.
నెల్లూరు జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త సుధీర్‌రెడ్డిని వివాహం చేసుకున్న రోహిణి.. ప్రస్తుతం కర్ణాటకలోని హసన్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. ముక్కుసూటిగా వెళ్తారనే పేరున్న ఆమె.. తన సర్వీసులో అనేక సార్లు బదిలీ అయ్యారు. ఒకసారి ఎన్నికల కమిషన్‌, మరోసారి హైకోర్టు ఆదేశాల మేరకు ఆమె బదిలీలకు బ్రేక్‌ పడింది.
* అసోం, బిహార్ రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గతకొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రెండు రాష్ట్రాల్లో కలిసి ఇప్పటి వరకు 55 మంది మృతి చెందారు. లక్షలాది మంది ఆవాసాలు కోల్పోయి నిరాశ్రయులయ్యారు.
ఉత్తరప్రదేశ్లోనూ వరదల కారణంగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
* వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి అంశాలపై మంగళవారం అర్థరాత్రి వరకూ లోక్సభలో చర్చ జరిగింది. సాంకేతిక సమస్య కారణంగా స్పీకర్ ఓం బిర్లా సభను 11.59 గంటలకు వాయిదా వేశారు. సమస్య తలెత్తకుండా ఉన్నట్లయితే తెల్లవారుజామున మూడు గంటలవరకూ సభ నడిచేదని స్పీకర్ స్పష్టం చేశారు.
* అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని బీఈడీ కళాశాల అధ్యాపకునిగా పని చేస్తున్న రూప్లానాయక్‌కు జైలు శిక్ష పడినట్లు ఇటుకలపల్లి సీఐ విజయభాస్కర్‌గౌడ్‌, ఏఎస్‌ఐ నాగన్న తెలిపారు. వివాహమైన ఆరేళ్లకే అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నాడని, మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ 2014 సెప్టెంబరులో ఆయన భార్య శ్రీదేవిబాయి ఇటుకలపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతపురం ఎక్సైజ్‌ కోర్టులో వాదనలు వినిపించారు. అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రెహనా రసూల్‌ బాధితురాలి తరపున కోర్టులో వాదించారు. దీంతో నిందితునికి ఆరునెలల జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ మంగళవారం కోర్టు తీర్పు ఇచ్చినట్లు సీఐ తెలిపారు.
* కేరళరాష్ట్రంలోని 6 జిల్లాలకు భారీ నుండి అతి భారీ వర్షం.ముందస్తు సూచనలు జారీ చేసిన వాతావరణ శాఖ.రెడ్ అలెర్ట్ ప్రకటించిన కేరళ ప్రభుత్వం.
* గత పక్షం రోజులుగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న కన్నడ రాజకీయం సుప్రీంకోర్టులో తుది అంకానికి చేరింది. కుమారస్వామి ప్రభుత్వ మనుగడకు సంబంధించిన కీలక తీర్పును నేడు సుప్రీంకోర్టు వెలువరించనుంది.తమ రాజీనామాలను ఆమోదించేలా స్పీకర్‌ రమేశ్‌ను ఆదేశించాలంటూ కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 15 మంది రెబెల్‌ ఎమ్మెల్యేలు పెట్టుకున్న అర్జీపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం వాదనలు వింది.
* అసోంలో వరద ధాటికి మరో గ్రామం చెల్లాచెదురైంది. ఆయీ నదీ నీటి ప్రవాహంలో సీరంగ్ జిల్లా దబాబిల్ గ్రామంలో ఇళ్లు, పొలాలు నీటమునిగాయి. ప్రాణాలు చేత పట్టుకుని వలస వెళ్తున్నారు గ్రామస్థులు. ప్రభుత్వ సహకారమూ అందక సహాయం కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు.
* పార్టీ కీలక నేతలతో తెదేపా అధినేత చంద్రబాబు భేటీ ముగిసింది. అసెంబ్లీలో వ్యవహారించాల్సిన తీరుతోపాటు ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేలా నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నీటి ప్రాజెక్టులపై కీలక చర్చ జరిగింది.రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిలిపివేసిన ముఖ్యమంత్రి జగన్‌… తెలంగాణ ప్రభుత్వంతో గోదావరి నీటి తరలింపు పథకాల్లో భాగస్వామ్యం కావాలని నిర్ణయించారని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. తెలంగాణాలో కాలువల ద్వారా నాగార్జున సాగర్ వద్ద గోదావరి నీటిని ఎత్తిపోయడానికి సుమారు 50 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అమరావతిలో పార్టీ నేతలతో సమావేశంలో చెప్పారు.
* సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్‌ పరీక్షలు సెప్టెంబరు 20 నుంచి 29 వరకు జరగనున్నాయి. ఈ మేరకు యూపీఎస్సీ మంగళవారం టైంటేబుల్‌ విడుదల చేసింది. కాగా, ప్రిలిమినరీ పరీక్ష ఉత్తీర్ణుల జాబితాను పేర్లు, రోల్‌నంబర్ల వారీగా యూపీఎస్సీ విడుదల చేసింది.
* తెలంగాణలోని నాగార్జున సాగర్‌కు, కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు (కేటీపీపీ)కు‘ఉగ్ర ’ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) హెచ్చరించింది.
* అమీర్‌పేటలో బాంబ్‌ కలకలం సృష్టించింది. మైత్రీవనం సమీపంలోని మెట్రో పిల్లర్‌ వద్ద ఓ డబ్బా అనుమానాస్పదంగా కనిపించడంతో అందులో బాంబు ఉండవచ్చునేనే భయంతో స్థానికులు ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్‌ స్క్వాడ్‌తో తనికీలు నిర్వహించారు. డబ్బాలో పెయింట్‌ ఉన్నట్లు తేలండోత అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
*ఆంధ్రప్రదేశ్కు కొత్త గవర్నర్ నియమితులయ్యారు. ఒడిశాకు చెందిన భాజపా నేత, మాజీ మంత్రి బిశ్వభూషణ్ హరిచందన్ను నవ్యాంధ్ర గవర్నర్గా నియమిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
*ప్రజలకు మంచి రహదారులు కావాలంటే వాళ్లు టోల్ రుసుము కట్టాల్సిందేనని, ప్రభుత్వం వద్ద తగినన్ని నిధులు లేనందున టోల్ వ్యవస్థ కొనసాగుతుందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.
*కర్ణాటక ఎమ్మెల్యేల రాజీనామాలపై సుప్రీంకోర్టు తీర్పు బుధవారానికి వాయిదా పడింది. తమ రాజీనామాలను ఆమోదించేలా స్పీకర్ను ఆదేశించాలంటూ కాంగ్రెస్- జేడీఎస్ అసమ్మతి ఎమ్మెల్యేలు రెండు విడతలుగా సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసిన విషయం విదితమే.
*ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం అమల్లో ఉన్న భాగస్వామ్య పింఛను విధానాన్నే (సీపీఎస్) కొనసాగిస్తామని, 2004కి ముందున్న పాత పింఛను విధానాన్ని (ఓపీఎస్) పునఃప్రవేశపెట్టే అవకాశమే లేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్సభలో లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానం ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.
*రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్యవిద్య సీట్ల భర్తీ ప్రక్రియను బుధవారం నుంచి చేపట్టనున్నారు. కన్వీనర్ కోటాలో తొలి విడత ప్రక్రియలో ఎంబీబీఎస్ 220, బీడీఎస్ 180 సీట్లు మిగలడంతో.. ఈ సీట్లను రెండో విడతలో భర్తీ చేయనున్నారు.
*ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కేంద్రీయ, గిరిజన విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు బిల్లు ప్రవేశపెట్టారని, అదే పేజీలో తెలంగాణలో ఈ వర్సిటీల ఏర్పాటు గురించి కేంద్రానికి కనిపించలేదా అని తెరాస ఎంపీ కేశవరావు ప్రశ్నించారు.
*తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ మూడేళ్లలో రూ.2,207.78 కోట్ల ఆదాయం సాధించి సరికొత్త రికార్డును సొంతం చేసుకుందని సంస్థ ఛైర్మన్, శాసనమండలి సభ్యులు శేరి సుభాష్రెడ్డి వెల్లడించారు. సంస్థ ఛైర్మన్గా ఆయన బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా మంగళవారం టీఎస్ఎండీసీ ఎండీ డాక్టర్ మల్సూర్, ఖనిజాభివృద్ధి సంస్థ ఉద్యోగులు అభినందనలు తెలిపారు.
*కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు తగ్గడంతో ఆలమట్టి డ్యాంలోకి వచ్చే నీటి ప్రవాహం మరింత తగ్గింది. మంగళవారం ఆలమట్టిలోకి వచ్చే నీటి ప్రవాహం 82,808 క్కూసెక్కులుగా ఉంది. సోమవారం కంటే సుమారు 2 వేల క్కూసెక్కులు తగ్గింది.
*సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25న హైదరాబాద్లోని ధర్నాచౌక్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ పింఛన్దారుల సంయుక్త కార్యాచరణ సమితి ఛైర్మన్ లక్ష్మయ్య ప్రకటించారు. సమస్యలు చెప్పుకోవడానికి గత ఐదేళ్లలో సీఎం కేసీఆర్ సమయం కేటాయించలేదన్నారు. దీనికి నిరసనగా 25న హైదరాబాద్, 26న జిల్లాకేంద్రాల్లో ధర్నాలు చేయాలని నిర్ణయించామని తెలిపారు.