Movies

నేను ఎవ్వరికీ ఇవ్వను

Rakul Preet On Throwing Free Suggestions And Opinions

‘‘సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ ఎవ్వరికీ సందేశాలు, సలహాలు ఇవ్వదలచుకోలేదు. ఒకరికి పాఠాలు చెప్పడానికి నేనెవర్ని?’’ అంటోంది రకుల్ప్రీత్ సింగ్. ‘‘అందరికీ అన్నీ తెలుసు. మనం కొత్తగా చెప్పేది ఏం లేదు. ఎవరి జీవితాన్ని వాళ్లే తీర్చిదిద్దుకోగలరు. ఈతరం ఇంకా వేగంగా ఆలోచిస్తోంది. మనం ఏమైనా చెబుదామనుకున్నా ‘చెప్పావులే..’ అన్నట్టు చూస్తున్నారు. నేను నా స్నేహితులకు కూడా సలహాలు ఇవ్వను. కనీసం ఫిట్నెస్ విషయంలోనూ వాళ్లని మార్చడానికి ప్రయత్నించను. ఎవరి జీవితం వాళ్లది. ఎవరి నిర్ణయాలు వాళ్లవి. నాకూ, నా స్నేహితులకు మధ్య ఎలాంటి గొడవలూ రాకపోవడానికి ఇదే కారణం కావొచ్చు. అయితే నేను మాత్రం మరొకరి సలహాలూ, సూచనలకు విలువ ఇస్తాను. అందులో మంచి, చెడుల గురించి ఆలోచిస్తాను. కానీ నిర్ణయాలు నేనే తీసుకుంటాను’’ అని చెప్పింది రకుల్.