Movies

కాఫీ పొడితో కలరింగ్

Rashi Khanna Speaks Of He Beauty Secrets

‘‘నేను ఏ రోజూ పార్లర్కు వెళ్లను. చర్మ సౌందర్యం కోసం నేను అనుసరించే చిట్కాలు చాలా సింపుల్గా ఉంటాయి. నా సౌందర్య సాధనాలన్నీ వంటింట్లో దొరికేవో, రోజూ తినే పండ్ల రకాలో, పెరట్లో దొరికే ఆకులతో చేసుకునేవో అయి ఉంటాయి’’ అని అన్నారు రాశీ ఖన్నా. ఎండకు చర్మం కమిలిపోవడం తరచూ పలువురు ఎదుర్కొనే సమస్య. దీనికి తన దగ్గర అద్భుతమైన చిట్కా ఉందని చెప్పారామె. దాని గురించి వివరిస్తూ… ‘‘మనలో చాలా మందికి ఫిల్టర్ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఫిల్టర్ అయ్యాక మిగిలిన కాఫీ పొడిని పారేయకుండా కాస్త ఎండబెట్టుకుని దాచుకోవాలి. ఆ పొడిని తడుపుకొని చర్మం మీద నలుగుపెట్టుకుంటే ఎంతటి టాన్ అయినా ఇట్టే పోతుంది. ఫిల్టర్ కాఫీ అలవాటు లేని వాళ్లు బయట కాఫీ షాపుల్లో అయినా ఈ పొడిని తీసుకోవచ్చు. నేను ప్రారంభంలో బయటి నుంచే ఈ పొడిని తెప్పించుకునేదాన్ని’’ అని అన్నారు.