నటిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు శ్రియ. కథానాయికగా వైవిధ్యమైన పాత్రలతో పాటుగా కమర్షియల్ గెటప్లు వేశారు. ఆండ్రీ కొచ్చివ్తో గత ఏడాది శ్రియ వివాహం జరిగింది. చిన్న బ్రేక్ తర్వాత ఓ ఫుల్ లెంగ్త్ రోల్ చేయడానికి శ్రియ మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. ఆర్. మాదేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సండక్కారి: ది బాస్’ సినిమాలో శ్రియ నటిస్తున్నారని కోలీవుడ్ టాక్. 2012లో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన మలయాళ మూవీ ‘మై బాస్’ చిత్రానికి ఇది తమిళ రీమేక్ . యాక్షన్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. లండన్, న్యూయార్క్తో పాటుగా కొచ్చి, గోవాలో షూట్ ప్లాన్ చేశారట. శ్రియ నటించిన తమిళ చిత్రం ‘నరగాసురన్’, హిందీ చిత్రం ‘తడ్కా’ విడుదల కావాల్సి ఉంది.
రీమేక్‌తో రిటర్న్
Related tags :