బాలీవుడ్ ‘ఖిలాడీ’ అక్షయ్ కుమార్ ఫిట్నెస్ ప్రీక్ అన్న సంగతి తెలిసిందే. వయసు పైబడుతున్న కొద్ది మరింత సామర్థ్యాన్ని పెంచుకుంటున్నారు అక్షయ్. సెలవు రోజుల్లో కూడా వ్యాయామాన్ని పక్కన పెట్టరు అక్షయ్. ఇంత ఫిట్‌గా ఉంటారు కాబట్టే నేటికి కూడా తన సినిమాల్లో యాక్షన్ సీన్లను డూప్ లేకుండా తానే చేస్తుంటారు అక్షయ్. ప్రస్తుతం కుటుంబంతో కలిసి విహారయాత్రలో ఉన్నారు అక్షయ్.ఈ సందర్భంగా అక్షయ్ పాల్గొన్న ఓ చాలెంజ్ ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు ట్వింకిల్ ఖాన్న. ఈ టూర్లో అక్షయ్ తన కండ బలాన్ని పరీక్షించుకోవడమే కాక.. త్వరగా డబ్బు సంపాదించడం కోసం ఓ చాలెంజ్‌లో పాల్గొన్నారు అంటున్నారు ట్వింకిల్ ఖన్నా. ఫోటోతో పాటు.. ‘ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదించినా సంతృప్తి లేదు. త్వరగా డబ్బు సంపాదించే ఏ అవకాశాన్ని విడిచిపెట్టడు. 100 పౌండ్లు ఇస్తామనే సరికి ఇలాంటి స్టంట్లు చేస్తున్నాడు’ అంటూ కామెంట్ చేశారు ట్వింకిల్ ఖన్నా.
మా ఆయన అంతే…అదో టైపు
Related tags :