WorldWonders

కిలో చెత్త ఇస్తే కడుపునిండుగా భోజనం

Doante trash get food. Chattisgarh starts sensational business.

చెత్త న్యూస్ కాదండి ఇది చాలా మంచి వార్త.. కిలో చెత్త తీసుకు వస్తే కడుపు నిండా భోజనం పెడతారు. అదే అరకిలో తెచ్చారనుకోండి టిఫిన్ పెడతారు. ఆలోచన ఎంత బావుందో కదూ.. అన్ని చోట్లా ఇలానే పెడితే ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ కల సాకరమవుతుంది. పట్టణాలన్నీ పరిశుభ్రంగా వుంటాయి. ప్లాస్టిక్ వాడకం ఎంత వద్దనుకున్నా ప్రజల జీవితాలతో మమేకమైపోయింది. ప్రభుత్వమే ప్లాస్టిక్‌ని బ్యాన్ చేస్తే తప్ప జనం ప్లాస్టిక్‌ని వాడ్డం మానేయరు. మరి రోజు రోజుకు పెరిగిపోతున్న ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తూనే ఉన్నాయి. అయితే, ఈ విషయాన్ని పెద్ద రాష్ట్రాలు అంతగా పట్టించుకోకపోయినా చిన్న రాష్ట్రమైన చత్తీస్‌‌గఢ్ దీనిపై దృష్టి సారించింది. ఓ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.చత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ మున్సిపాలిటీ దేశంలో తొలిసారిగా గార్బెజ్ కెఫే పథకాన్ని ప్రవేవపెట్టింది. ఈ పథకాన్ని మేయర్ డాక్టర్ అజయ్ తిర్కి ప్రారంభించారు. ఈ పథకం కింద చెత్తను తీసుకుని ఆహారం అందిస్తున్నారు. కిలో చెత్తను సేకరించి మున్సిపల్ కార్యాలయంలో అందజేస్తే భోజనం.. అదే అరకిలో చెత్తను అందిస్తే టిఫిన్ పెడతారు. దీంతో పేదలకు కడుపు నిండా భోజనం దొరుకుతుంది. ఊరు శుభ్రపడుతుంది. ప్లాస్టిక్ తిని జంతువులు ప్రాణాలు పోగొట్టుకోకుండా ఉంటాయి. అంబికాపూర్ మున్సిపాలిటీ దేశంలోనే అతిపెద్దది కావడం విశేషం. కొత్తగా రూపొందించిన గార్బెజ్ కెఫే పథకానికి మున్సిపాలిటీ ఐదున్నర లక్షలు కేటాయించింది.