DailyDose

మాయావతికి ఐటీ షాక్-రాజకీయ–07/18

Income Tax Shocks Mayawati-Daily Political News In Telugu-July182019

* ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతికి ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. ఆమె సోదరుడు ఆనంద్ కుమార్‌కు చెందిన 400 కోట్ల రూపాయల విలువచేసే ఏడు ఎకరాల భూమిని జప్తు చేసింది. ఐటీ డిపార్ట్ మెంట్‌కు చెందిన బినామీ నిరోధక శాఖ ఈ మేరకు జులై 16న ఉత్తర్వులు జారీ చేయగా.. ఇవాళ అమలు చేశారు. ఆనంద్ కుమార్‌తో పాటు ఆయన భార్య విచితర్ లతకు చెందిన న్యూఢిల్లీ, నోయిడా పరిధిలోని ఆస్తులను జప్తు చేశారు.ఆనంద్ కుమార్ గత జూన్‌లో బీఎస్పీ ఉపాధ్యక్షుడిగా నియమితులైన విషయం తెలిసిందే. ఆనంద్ కుమార్ తొలినాళ్లలో నోయిడా ఆథారిటీలో క్లర్కుగా పనిచేసేవారు. తదనంతర కాలంలో నకిలీ కంపెనీల పేరుతో కోట్ల రూపాయలు రుణాలు పొందినట్టు ఆరోపణలు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. 2007లో మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన 49 కంపెనీలు ప్రారంభించారు. ఆయన ఆస్తుల విలువ రూ.1316 కోట్లకు చేరింది.
* ఎన్ఐఏ బిల్లుకు రాజ్యసభ ఓకే
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(సవరణ) బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. సభలోని మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఓటేశారు. టెర్రరిజాన్ని అంతం చేయడమే లక్ష్యంగా ఈ బిల్లును తీసుకొచ్చినట్లు హోంమంత్రి లోక్సభలో వెల్లడించారు. ఈ సంస్థను రాజకీయంగా వాడుకునే ఉద్దేశమేమీ మోడీ సర్కారుకు లేదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం లోక్సభలో ఈ బిల్లు పాస్అయిన విషయం తెలిసిందే. అంతకుముందు బిల్లుపై జరిగిన చర్చలో పలువురు సభ్యులు సందేహాలు వ్యక్తం చేశారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. ఎన్ఐఏ పరిధిని విదేశాలకూ విస్తరించడం అర్థంలేని చర్యని విమర్శించారు. విదేశాలలో దాక్కున్న నిందితులను అరెస్టు చేయాలంటే అంతర్జాతీయ చట్టాలను విధిగా పాటించాల్సిందేనని గుర్తుచేస్తూ.. ఎన్ఐఏ పరిధిని విస్తరించినంత మాత్రాన ఈ నిబంధనల్లో మార్పురాదని అన్నారు. ఎన్ఐఏ కు అపరిమిత పవర్స్ కట్టబెట్టడంపై కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ ఆందోళన వ్యక్తం చేశారు. సభ్యుల సందేహాలను అమిత్షా కొట్టిపారేశారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తే ప్రజల్లోకి తప్పుడు సందేశం వెలుతుందన్నారు.
*వైఎస్ నాకు మంచి మిత్రుడు: చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తనకు మధ్య రాజకీయ విభేదాలు మాత్రమే కాని వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని, ఆయన తనకు మంచి మిత్రుడని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అన్నారు. ఈ రోజు ఏపీ శాసనసభలో అక్రమ కట్టడాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా రోడ్లపై అక్రమంగా కొన్నివేల వైఎస్‌ విగ్రహాలను ఏర్పాటు చేశారని చంద్రబాబు అన్నారు. దీంతో ఆందోళన చేపట్టిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. రాష్ట్రంలో వైఎస్ విగ్రహాలు చూసి చంద్రబాబు కడుపు మండుతోందని ఎద్దేవా చేశారు.దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ.. విగ్రహాలను తొలగించాలని తాననడం లేదని చెప్పారు. వైఎస్‌ తనకు మంచి మిత్రుడని, రాజకీయపరంగా మాత్రమే విభేదాలుండేవని అన్నారు. మంత్రులుగా ఉన్నప్పుడు ఇద్దరమూ ఒకే గదిలో ఉండేవాళ్లమని చంద్రబాబు చెప్పారు.
*వైకాపా దుశ్చర్యలను ప్రజలు గమనిస్తున్నారు-చంద్రబాబు
ముడుపుల కోసమే వైకాపా నేతలు రివ్యూల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. వారి దుశ్చర్యలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. భవిష్యత్‌పై ఆవేదనతోనే రైతు ఆత్మహత్యలు మళ్లీ పెరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాను రైతుల్లో పెంచాలని కోరారు. పార్టీ వ్యూహ కమిటీతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని గతంలో తెదేపా ప్రభుత్వమే చెప్పిందని అందుకే సౌర, పవన విద్యుదుత్పత్తి పెంచామాని చంద్రబాబు గుర్తు చేశారు.
*కొత్త పంచాయతీలకూ సభ ఆమోదం తప్పనిసరి-తెలంగాణ సీఎం కేసీఆర్‌
తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా బోధనా వైద్యుల వయోపరిమితి పెంపు బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్నారు. మున్సిపాలిటీల సంఖ్యను 142కు పెంచడం లాంటి అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. అభివృద్ధి క్రమపద్ధతితో జరగాలనే ఉద్దేశంతోనే కొత్త మున్సిపాలిటీ చట్టం తీసుకువస్తున్నామన్నారు. కొత్త గ్రామపంచాయతీ ఏర్పాటు చేయాలన్నా.. శాసనసభ ఆమోదించాల్సిందేనన్నారు. త్వరలోనే బడ్జెట్‌ సమావేశాలను కూడా నిర్వహిస్తామన్నారు.
*ఈ తీర్పుతో జాదవ్‌ కుటుంబంలో కొత్త ఆశలు
కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పట్ల భారత్‌ హర్షం వ్యక్తం చేసింది. ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు సోషల్‌మీడియా వేదికగా తీర్పును స్వాగతించారు. తాజాగా రాహుల్‌ గాంధీ కూడా ఐసీజే తీర్పుపై స్పందించారు. ఈ తీర్పు జాదవ్‌ కుటుంబంలో కొత్త ఆశలను, నమ్మకాన్ని తీసుకొచ్చిందని అన్నారు. ‘ఐసీజే తీర్పును ఆహ్వానిస్తున్నా. ఇప్పుడు నా ఆలోచనలన్నీ పాకిస్థాన్‌ జైల్లో ఒంటరిగా ఉన్న కుల్‌భూషణ్‌ జాదవ్‌, భారత్‌లో అతడి కోసం ఎదురుచూస్తున్న ఆయన కుటుంబంతోనే ఉన్నాయి. ఈ తీర్పు వారికి అరుదైన క్షణం. వారిలో కొత్త ఉత్సాహాన్ని, ఆశల్ని నింపింది. ఏదో ఒక రోజు జాదవ్‌ విడుదలై ఇంటికి తిరిగొస్తాడనే నమ్మకాన్ని కలిగించింది’ అని రాహుల్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.
*కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్ష తీర్మానం
కర్ణాటక రాజకీయ సంక్షోభం తుది అంకానికి చేరుకుంది. సీఎం కుమారస్వామి శాసనసభలో విశ్వాసపరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బలపరీక్ష నేపథ్యంలో రిసార్టుల్లో ఉన్న కాంగ్రెస్‌, జేడీఎస్‌, భాజపా ఎమ్మెల్యేలు అక్కడి నుంచే నేరుగా అసెంబ్లీకి చేరుకున్నారు. భాజపా సీనియర్‌ నేత యడ్యూరప్ప సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా రెండు బస్సుల్లో శాసనసభకు వచ్చారు. విశ్వాసపరీక్ష నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. విధానసౌధ వద్ద 144 సెక్షన్ విధించారు.
*పురపాలక చట్టం బిల్లును ప్రవేశపెట్టిన కేసీఆర్‌
రాష్ట్ర పురపాలక చట్టం-2019 బిల్లును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇవాళ సాయంత్రం వరకు బిల్లుపై సవరణలు స్వీకరించనున్నారు. నూతన పురపాలక చట్టం బిల్లుపై శుక్రవారం సభలో చర్చజరగనుంది. 4 ఆర్డినెన్స్‌ల స్థానంలో ప్రభుత్వం బిల్లును సభ ముందుకు తెచ్చింది. భోధనాస్పత్రుల్లో వైద్యుల పదవీ విరమణ వయోపరిమితి పెంపు బిల్లును కూడా సీఎం కేసీఆర్‌ సభలో ప్రవేశపెట్టారు. వీటిపై సభలో చర్చ కొనసాగుతోంది.
*తెలంగాణ శాసనసభ వాయిదా
తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఇవాళ జరిగిన సమావేశాల్లో పంచాయతీరాజ్‌ సవరణ బిల్లును ఆమోదించారు. బోధనా వైద్యుల వయోపరిమితి పెంపునకు సంబంధించిన బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టగా.. దీనికి సభ మద్దతు ప్రకటించింది. రుణ విమోచన కమిషన్‌ ఛైర్మన్‌ నియామక బిల్లుకు కూడా శాసనసభ ఆమోదం తెలిపింది. పురపాలికల్లో వార్డుల సంఖ్యను ఖరారు చేస్తూ గతంలో జారీచేసిన ఆర్డినెన్స్‌ స్థానంలో తీసుకు వచ్చిన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
*ఏపీ మంత్రివర్గం ప్రత్యేక భేటీ
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం ప్రత్యేకంగా సమావేశమైంది. శాసనసభలో ప్రవేశపెట్టే బిల్లులు, వివిధ చట్టాలకు చేయాల్సిన సవరణలపై చర్చించారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన, ప్రాజెక్ట్‌ రీటెండరింగ్‌ తదితర విషయాలను కూలంకషంగా చర్చించినట్లు సమాచారం. మొత్తం 12 బిల్లులకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అంగన్వాడీల వేతనం రూ.1000 పెంపు, ఎస్సీ, ఎస్టీలకు రూ.200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ తదితర బిల్లులకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోద ముద్రవేసింది. కౌలు రైతులు సాగు ఒప్పందం కుదుర్చుకునేందుకు వీలు కల్పించేలా, భూ యజమానులకు నష్టం రాకుండా రూపొందించిన బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. భూ యజమానులకు శాశ్వత ప్రాతిపదికన హక్కులు కల్పించే ముసాయిదా బిల్లుకు, భూ తగాదాలను తగ్గించేందుకు ల్యాండ్‌ టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టంలో మార్పులకు ఉద్దేసించిన ముసాయిదాకు ఆమోద ముద్రవేసింది. మద్య నిషేధం దిశగా ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ఇకపై ప్రభుత్వం చేతికే మద్యం దుకాణాల నిర్వహణకు సంబంధించిన ముసాయిదా బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
*వైకాపా దుశ్చర్యలను ప్రజలు గమనిస్తున్నారు-చంద్రబాబు
ముడుపుల కోసమే వైకాపా నేతలు రివ్యూల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. వారి దుశ్చర్యలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. భవిష్యత్‌పై ఆవేదనతోనే రైతు ఆత్మహత్యలు మళ్లీ పెరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాను రైతుల్లో పెంచాలని కోరారు. పార్టీ వ్యూహ కమిటీతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని గతంలో తెదేపా ప్రభుత్వమే చెప్పిందని అందుకే సౌర, పవన విద్యుదుత్పత్తి పెంచామాని చంద్రబాబు గుర్తు చేశారు.
*స్పీకరు నిర్ణయంలో జోక్యం చేసుకోం
అసమ్మతి నేతల రాజీనామాలపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ కర్ణాటక స్పీకరుకు ఉందని, అందులో తమ జోక్యం ఉండబోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్పీకరుకు ఎలాంటి కాలపరిమితిని విధించటం లేదని పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలో దీపక్ గుప్త, అనిరుధ్బోస్లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉదయం ఈ మేరకు తీర్పు వెలువరించింది. సభకు హాజరు కావలసిందిగా రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలపై ఒత్తిడి చేయడమూ తగదని తన తీర్పులో సూచించింది. ‘‘రాజ్యాంగబద్ధ్దమైన అంశాల్లో సమతౌల్యం పాటించాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే స్పీకర్పై నిబంధనలు జారీ చేయలేం’’ అని ధర్మాసనం సభ్యులు వెల్లడించారు.
*పురపాలనలో కొత్త పుంతలు
కొత్త పురపాలక చట్టంతో పాలన కొత్త పుంతలు తొక్కుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సమస్యలు ఉత్పన్నమయితే దానికి ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులే బాధ్యత వహించడం, ప్రజలకు పూర్తి జవాబుదారీగా వ్యవహరించడం వంటి విశేషాంశాలతో కొత్త చట్టం ఉంటుందని చెప్పారు. మంత్రిమండలి సమావేశంలో కొత్త చట్టం ముసాయిదాను ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మంత్రులకు దీని పూర్వాపరాలను వివరించారు. ‘‘పల్లెలన్నీ పట్టణాలుగా మారుతున్నాయి. అవి ప్రగతి నిలయాలుగా ఉండాలి. దురదృష్టవశాత్తూ పల్లెల కంటే పట్టణాలు అధ్వానంగా మారుతున్నాయి.
* భూపతిరెడ్డిపై అనర్హత వేటు సబబే
తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికై కాంగ్రెస్లో చేరిన భూపతిరెడ్డిపై అనర్హత వేటు సబబేనని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇందులో ఎలాంటి చట్టవిరుద్ధమైన అంశాలు కనిపించలేదని పేర్కొంది. రాజ్యాంగంలో షెడ్యూలు 10లోని 8వ పేరా సమర్థనీయమేనని తెలిపింది. శాసన మండలి అనర్హత నిబంధనల్లోని 7(4) రాజ్యాంగబద్ధమేనని పేర్కొంటూ, భూపతిరెడ్డి పిటిషన్ను కొట్టివేసింది. తనపై అనర్హత వేటు వేయడానికి అవకాశం కల్పించే నిబంధనలతోపాటు, తనపై అనర్హత వేటు వేస్తూ మండలి ఛైర్మన్ జనవరి 16న వెలువరించిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మాజీ ఎమ్మెల్సీ ఆర్.భూపతిరెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే.
* భాజపాలో చేరికపై నిర్ణయం తీసుకోలేదు-మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు
భాజపాలో చేరటంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని మాజీ ఎంపీ, తెదేపా సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు స్పష్టం చేశారు. పార్టీలో చేరాలని భాజపా నేతలు ఆహ్వానిస్తున్న మాట వాస్తవమేనన్నారు. బుధవారం ‘ఈనాడు’తో రాయపాటి మాట్లాడుతూ… ‘భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ మా ఇంటికి వస్తామంటే రమ్మని ఆహ్వానించాను. పార్టీలోకి రావాలని ఆయన ఆహ్వానించారు. ఇదే విషయాన్ని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాను. వచ్చే వారం దిల్లీ వెళ్లి భాజపా పెద్దలతో మాట్లాడాక చేరాలో… లేదో నిర్ణయం తీసుకుంటాను’ అని తెలిపారు. రాయపాటి కుమారుడు తెదేపా రాష్ట్ర కార్యదర్శి రాయపాటి రంగారావు మాట్లాడుతూ.. తాను మాత్రం తెదేపాలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
* పోలీసు రాజ్యంలోకి మమ్మల్ని నెడతారా?-ఎన్ఐఏ బిల్లుపై చర్చలో తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బిల్లును చూస్తుంటే అది మమ్మల్ని పోలీసు రాజ్యంలోకి నెడుతున్నట్లు ఉందని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు అన్నారు. ఎన్ఐఏ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో బుధవారం ఆయన మాట్లాడారు. ‘‘ఎన్ఐఏ బిల్లు సున్నితమైంది. విచారణ, పరిశోధన అనే అంశాలను ప్రజలు విభిన్న ధోరణిలో చూస్తారు. ఉగ్రవాదాన్ని సహించబోమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి చెప్పారు. పౌర స్వేచ్ఛ క్రిమినల్ కేసుల్లోకి రావాలి.
* భాజపాను చూస్తేనే సీఎంకు వణుకు-ముగ్గురు ఎంపీల విమర్శ
భారతీయ జనతాను చూస్తేనే తెలంగాణ సీఎం వణికిపోతున్నారని ఆ పార్టీ ఎంపీలు ధర్మపురి అర్వింద్, బండి సంజయ్, సోయం బాపురావు అన్నారు. వారు దిల్లీలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. అడ్డగోలుగా ఓటర్ల జాబితా, ఇష్టారీతిన వార్డుల విభజనతో పురపాలిక ఎన్నికలను ఏకపక్షంగా నిర్వహించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని అర్వింద్ ఆరోపించారు. ధైర్యముంటే వాటిని ప్రత్యక్ష పద్ధతిలో చేపట్టాలని డిమాండ్ చేశారు. తెరాసలో గ్రామస్థాయి నుంచి సీఎం వరకు అందరికీ అబద్ధాలు చెప్పడం అలవాటైందని సంజయ్ దుయ్యబట్టారు. రెండు పడక గదుల ఇళ్ల విషయంలో పార్లమెంటును ఆ పార్టీ ఎంపీలు పక్కదారి పట్టిస్తున్నారన్నారు. ఆదివాసీలను అడవుల నుంచి బలవంతంగా వెళ్లగొడుతున్నారని బాపురావు మండిపడ్డారు.
* నేడు సీఎల్పీ సమావేశం-అసెంబ్లీలో అనుసరించే వ్యూహంపై చర్చ
కొత్త పురపాలక చట్టానికి ఆమోదం కోసం గురు, శుక్రవారాల్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో..అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు/సభలో కొత్త చట్టం ప్రవేశపెట్టిన తర్వాత/సభ వాయిదా పడిన అనంతరం.. ఏదో ఒక దశలో కాంగ్రెస్ పక్ష నేత మల్లు భట్టివిక్రమార్క ఆధ్వర్యంలో సీఎల్పీ సమావేశం జరగనుంది.నూతన చట్టంలోని అంశాలను పరిశీలించి, ఏమైనా అభ్యంతరాలుంటే వాటిని సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారు.
* రాజకీయ అవసరాలకు ప్రజల సొమ్మా?-కేసీఆర్పై ఎస్.ఎ.సంపత్కుమార్ ఆరోపణ
ప్రజల సొమ్మును ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్.ఎ.సంపత్కుమార్ ఆరోపించారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రైతుబంధు డబ్బులను సకాలంలో చెల్లించిన ప్రభుత్వం.. తీరా ఎన్నికలయ్యాక తీవ్ర జాప్యం చేస్తోందని విమర్శించారు. ఆయన బుధవారం గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. కేసీఆర్కు ఎన్నికలు, రాజకీయాలు తప్ప వేరే ఏవీ పట్టడంలేదని విమర్శించారు.
* అధ్యక్ష బాధ్యతలు మీరే చేపట్టాలి-సోనియాకు పార్టీ విధేయుల ఫోరం లేఖ
పార్టీ అధ్యక్షులుగా గాంధీ, నెహ్రూ కుటుంబానికి చెందినవారే ఉండాలని ‘కాంగ్రెస్ విధేయుల ఫోరం’ కోరింది. ఏఐసీసీ అధ్యక్ష పదవిని రాహుల్ స్వీకరించకపోతే, ఆ స్థానంలో బాధ్యతలను సోనియాగాంధీ చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆమెకు 2 పేజీల లేఖ పంపారు. ఫోరం ప్రతినిధులు వి.హనుమంతరావు, మర్రి శశిధర్రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్, శ్యాంమోహన్, జి.నిరంజన్, బి.కమలాకర్రావు బుధవారమిక్కడ సమావేశమయ్యారు. సోనియా నాయకత్వం అంటేనే ప్రజలు విశ్వసిస్తారని లేఖలో పేర్కొన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపై టీపీసీసీ తీరును వారు వివరించారు.
* సమస్యలపై చర్చకు భయపడుతున్నారు’
కేవలం మున్సిపల్ చట్టాన్ని ఆమోదించేందుకే రెండురోజుల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ సరికాదని శాసనమండలిలో భాజపా పక్షనేత ఎన్.రామచంద్రరావు వ్యాఖ్యానించారు. బడ్జెట్ చర్చల తర్వాత ఇప్పటివరకు అసెంబ్లీ సమావేశాలేవీ జరగలేదన్న ఆయన.. ప్రజాసమస్యలపై చర్చించేందుకు తెరాస ప్రభుత్వం భయపడుతోందా అని బుధవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. వివిధ అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉన్నందున అసెంబ్లీ సమావేశాలను మరో వారంపాటు పొడిగించాలన్నారు.
* కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలి-తెరాస ఎంపీ బి.ప్రకాష్ డిమాండ్
కేంద్రప్రభుత్వం ఇకనైనా కాజీపేటలో రైల్వే డివిజన్ను ఏర్పాటుచేయాలని తెరాస ఎంపీ బండ ప్రకాశ్ డిమాండ్ చేశారు. ఆయన బుధవారం రాజ్యసభ జీరోఅవర్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, దక్షిణాదిలో కాజీపేట జంక్షన్కు ఎంతో ప్రాముఖ్యం ఉందన్నారు. ఉత్తరాది నుంచి వచ్చే ప్రతి రైలూ ఇదే జంక్షన్ నుంచి వెళ్తుందని, దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్ డివిజన్ ఆదాయం 60 శాతం కాగా అందులో అత్యధిక శాతం ఉత్తర తెలంగాణ నుంచే వస్తుందని తెలిపారు. అలాంటి ఉత్తర తెలంగాణలోని కాజీపేటలో డివిజన్ ఏర్పాటు అత్యవసరమన్నారు. విభజన చట్టం ప్రకారం కాజీపేటలోనే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకావాలని కేంద్రానికి ఆయన గుర్తుచేశారు.
* అవినీతి, అరాచకాల్లో వైకాపా తక్కువేం కాదు: కన్నా
అవినీతి, అరాచకాలు, భూకబ్జాలతోపాటు రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంగా మార్చడంలో ప్రస్తుత వైకాపా ప్రభుత్వం మునుపటి తెదేపా సర్కారుకు ఏమాత్రం తీసిపోలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం వేదాయపాళెం కూడలి వద్ద బుధవారం రాత్రి భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అవినీతి రహిత, అభివృద్ధికారక పాలన భాజపా ప్రభుత్వంతోనే సాధ్యమని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
* జగన్తో ద్రోణంరాజు శ్రీనివాస్ భేటీ
విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్గా నియమితులైన ద్రోణంరాజు శ్రీనివాస్ బుధవారం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కలిశారు. తనను ఆ పదవిలో నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ద్రోణంరాజుతో పాటు మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా ఉన్నారు.సమయం వృథా అవుతోంది
* మేం పార్టీలు మారే వాళ్లం కాదు
తెదేపా శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ పార్టీ మారతారని తాననుకోవడంలేదని ప్రభుత్వ చీఫ్విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు. శాసనసభ లాబీల్లో బుధవారం వారిద్దరి మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. మొదట శ్రీకాంత్రెడ్డి విలేఖరులతో మాట్లాడుతుండగా… కేశవ్ అక్కడికి వచ్చారు. ఇద్దరూ పలకరించుకున్నారు. ఈ సందర్భంగా అమెరికా పర్యటనలో భాజపా నేత రాంమాధవ్తో కేశవ్ చర్చల సారాంశమేంటో చెప్పడం లేదని, మీరైనా అడగండని శ్రీకాంత్రెడ్డిని ఉద్దేశించి కొందరు విలేఖరులు కోరారు. దానికాయన నవ్వుతూ… ‘‘కేశవ్ గురించి నాకు బాగా తెలుసు. ఆయన పార్టీ మారరు. మేం బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చినవారం… పార్టీలు మారం. అది మా రక్తంలో లేదు’’ అని వ్యాఖ్యానించారు.
* అవినీతి, అరాచకాల్లో వైకాపా తక్కువేం కాదు: కన్నా
అవినీతి, అరాచకాలు, భూకబ్జాలతోపాటు రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంగా మార్చడంలో ప్రస్తుత వైకాపా ప్రభుత్వం మునుపటి తెదేపా సర్కారుకు ఏమాత్రం తీసిపోలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం వేదాయపాళెం కూడలి వద్ద బుధవారం రాత్రి భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అవినీతి రహిత, అభివృద్ధికారక పాలన భాజపా ప్రభుత్వంతోనే సాధ్యమని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
* పోలవరంపై నిపుణుల కమిటీ ఏమీ నిగ్గు తేల్చలేదు
సాగునీటి రంగంపై తెదేపా హయాంలో ఖర్చు చేసిందే రూ.58,893 కోట్లయితే…వైకాపా నాయకులు ఆరోపిస్తున్నట్లుగా రూ.60వేల కోట్ల అవినీతి ఎలా సాధ్యమవుతుందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని చెబుతున్న నిపుణుల కమిటీ చివరికి ఏమీ నిగ్గు తేల్చలేదన్నారు. మిగిలిపోయిన మట్టిపనులు చేసుకోవడానికే వారు కమిటీల పేరిట హడావుడి చేస్తున్నారని విమర్శించారు. వైకాపా అవినీతి కార్యక్రమాలను ఇకపై ప్రతి రోజూ తాము బయటపెడతామన్నారు.