సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకు సితార పాడిన పాటలు, చేసిన అల్లరి అన్ని సోషల్ మీడియా పేజ్‌లకు మాత్రమే పరిమితమయ్యాయి. తాజాగా సితార తన స్నేహితురాలు ఆద్యా (దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు)తో కలిసి ఏ అండ్ ఎస్ (A & S) పేరుతో యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించింది.ఈ చానల్‌లో తొలి వీడియోను ఈ రోజు పోస్ట్ చేశారు. 3 మార్కర్స్ చాలెంజ్ పేరుతో పోస్ట్ చేసిన ఈ వీడియోలో సితార, ఆద్యాలు బొమ్మలకు కలర్స్ ఫిల్ చేయటంలో ఒకరితో ఒకరు పోటి పడ్డారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే 30 వేలకు పైగా వ్యూస్ సాధించటం విశేషం. సితార, ఆద్యాల వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన మహేష్.. చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు.
Channel Link: https://www.youtube.com/channel/UClbiBGaJBIWR1Wq3qj-n3ZA
సితార యూట్యూబ్ ఛానెల్ ప్రారంభం
Related tags :