సహజసిద్ధమైన నటనతో ఆకట్టుకుంటోంది సాయి పల్లవి. ‘ఫిదా’లో ఆమె నటన చూసి అంతా ముగ్ధులయ్యారు. ‘పడి పడి లేచె మనసు’లోనూ చక్కటి నటన కనబరిచింది. ‘నా బలం సహజమైన నటనే.. గ్లామర్ కాదు’ అని చెబుతుంటుంది సాయి పల్లవి. ‘‘తెలుగు నాయికలంతా గ్లామర్గా కనిపిస్తారు. నేను అలా కాదు. తెరపై నా కాస్ట్యూమ్స్ కూడా అంత గొప్పగా కనిపించవు. ‘ఫిదా’లో చూడండి. పల్లెటూరిలో అమ్మాయిలు ఎంత సాదాసీదాగా ఉంటారో అలానే కనిపిస్తా. మేకప్ కూడా వేసుకోలేదు. ఆ సినిమా చేస్తున్నప్పుడు చాలా భయపడ్డాను. ‘నేను తెలుగు ప్రేక్షకులకు నచ్చుతానా? వాళ్లు నా మొహం చూస్తారా’ అనిపించింది. థియేటర్కి అదే భయంతో వెళ్లాను. కానీ ప్రేక్షకుల స్పందన చూసి మతి పోయింది. నేను కనిపించగానే పేపర్లు విసిరారు. ‘తెలుగులో ఒక్క సినిమా చేసినా ఇంత స్పందన ఉంటుందా’ అని ఆశ్చర్యం వేసింది. థియేటర్లోనే ఏడ్చేశాను. ఇదంతా నా గొప్పదనం కాదు. తెలుగు ప్రేక్షకులదే’’ అంది సాయి పల్లవి.
పల్లవి మతి పోయిన వేళ
Related tags :