ఇప్పటివరకు సోషల్‌మీడియాలో టిక్ టాక్ వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు టక్ టుక్ అనే ఓ కొత్త వీడియోకు శ్రీకారం చుట్టారు బాలీవుడ్ నటి విద్యా బాలన్. ఎర్ర చీర కట్టుకుని పద్ధతిగా తయారై.. ‘ప్రతి ఆడపిల్లలో అమ్మావారి తొమ్మది రూపాలు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. వివాహమయ్యాక ఓ మహిళ నుంచి ఏ అమ్మవారి రూపం బయటికి వస్తుందో అది భర్తల ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది’ అంటూ ఓ పండితుడి వాయిస్‌ను అనుకరిస్తూ వీడియోను రూపొందించారు విద్య. దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘టైంపాస్ కోసం ఓ టక్ టుక్ వీడియో’ అని క్యాప్షన్ ఇచ్చారు. కేవలం గంట వ్యవధిలోనే ఈ వీడియోను 1.35 లక్షల మంది వీక్షించారు. వర్క్ పరంగా ప్రస్తుతం విద్య ‘మిషన్ మంగళ్’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు.