కోలీవుడ్ బ్యూటీ అమలాపాల్ నటించిన తాజా చిత్రం ఆడై. తెలుగులో ఈ మూవీ ఆమె పేరుతో జూలై 19న రిలీజ్ కానుందని మేకర్స్ తెలిపారు. కాని కొన్ని ఫైనాన్షియల్ సమస్య వలన ఈ చిత్రం నేడు విడుదల కాలేదు. త్వరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూడగా, వారికి నిరాశే ఎదురైంది. ఆ మధ్య విడుదలైన చిత్ర టీజర్‌లో అమలాపాల్ ఒంటిమీద ఒక్క నూలుపోగు లేకుండా పూర్తి నగ్నంగా చూపించారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. రత్న కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అమలాపాల్‌ని భిన్న షేడ్స్‌లో కనిపించనుంది. వి స్టూడియోస్ బ్యానర్ పై విజ్జి సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్న ఈ మూవీ కి ప్రదీప్ కుమార్ సంగీతం అందించారు.
అమల అడై అదృష్టం
Related tags :