Movies

నిశ్శబ్దం ఆస్వాదిద్దాం

Anushka Shetty Calls To Enjoy Silence

దాదాపు పద్నాలుగేళ్ల క్రితం ‘సూపర్’ (2005) సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు అనుష్కా శెట్టి. ఆ తర్వాత ‘విక్రమార్కుడు’ (2006), ‘లక్ష్యం’ (2007), ‘అరుంధతి’ (2010), ‘మిర్చి’ (2013), ‘బాహుబలి’ (2017), ‘రుద్రమదేవి’, ‘భాగమతి’ (2018) వంటి సూపర్హిట్ సినిమాలతో ప్రేక్షకులతో సూపర్ హీరోయిన్ అనిపించుకున్నారు అనుష్క. ఆమె నటించిన తొలి సినిమా ‘సూపర్’ విడుదలై ఈ నెల 21తో 14 ఏళ్లు పూర్తి అవుతుంది.ఈ సందర్భంగా అనుష్క నటిస్తున్న తాజా చిత్రం ‘నిశ్శబ్దం’లోని ఫస్ట్ లుక్ను ఈ ఆదివారం విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో బదిర యువతి (చెవిటి, మూగ) పాత్ర చేస్తున్నారు అనుష్క. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ యూఎస్లో జరుగుతోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడసన్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, తమిళం, హిందీ భాషల్లో కూడా విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.