*బిగ్ బాస్ రియాల్టి షోను నిలిపివేయాలంటూ జంతర్ మంతర్ దగ్గర సినిమా నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తా ధర్నా చేశారు. షో పేరుతో కాస్టింగ్ కౌచ్ కు పాల్పడుతున్నారని.. ఈ షోను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా.. ఈ పద్ధతి నచ్చకే షో నుంచి బయటకొచ్చారని చెప్పారు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. బిగ్ బాస్ పేరుతో అశ్లీలతను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ప్రజా ప్రయోజన వ్యాజాన్ని రాష్ట్ర హై కోర్టులో వేశామనీ.. బిగ్ బాస్ లో జరుగుతున్న విషయాలను సినీ హీరో, ప్రోగ్రామ్ హోస్ట్ నాగార్జున తెలుసుకోవాలని ఆయన కోరారు.బిగ్ బాస్ సెలక్షన్ ప్రాసెస్ లో అన్యాయం జరుగుతోందని.. దీనిపైనే న్యాయపోరాటం చేస్తున్నామని యాక్ట్రెస్ గాయత్రి గుప్తా అన్నారు. సెక్సువల్ హెరాస్మెంట్, చీటింగ్.. బిగ్ బాస్ లో జరుగుతోందన్నారు. పబ్లిసిటీ కోసం వెళ్తే లీగల్ గా వెళ్లేంవాళ్ళం కాదన్నారు.బిగ్ బాస్ ముసుగులో మహిళలు, ఆడ పిల్లలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆరోపించారు యాంకర్ శ్వేతారెడ్డి. బిగ్ బాస్ సెలక్షన్ లో ఒక ప్రొడ్యూసర్ అసభ్యకరంగా మాట్లాడారనీ.. కంపెనీలపై ఉన్న నమ్మకంతో అగ్రిమెంట్ కాపీలను ముందే తాము తీసుకోలేదని చెప్పారు. తమకు జరిగిన అన్యాయంపై నాగార్జున స్పందించాలన్నారు. దేశమంతటా బిగ్ బాస్ ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. బిగ్ బాస్ రియాల్టీ షోలో జరుగుతున్న లైంగిక వేధింపులపై దేశమంతటా అందరి సహకారం కోరుతున్నామన్నారు శ్వేతారెడ్డి.
* ట్రాఫిక్ కానిస్టేబుల్ ని ఓ టీఆర్ఎస్ మహిళా నేత చెప్పుతో కొట్టిన సంఘటన కలకలం రేపుతోంది. ద్విచక్రవాహనంపై ముగ్గురు వెళ్తున్నారని… ఫోటో తీసిన కారణం చేత కానిస్టేబుల్ ని టీఆర్ఎస్ మహిళా నాయకురాలు చెప్పుతో కొట్టింది. ఈ సంఘటన మల్కాజిగిరి మౌలాలి కమాన్ సమీపంలో చోటుచేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళితే… మల్కాజిగిరి మౌలాలి కమాన్ వద్ద ముజఫర్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. కాగా.. గౌన్ అనే వ్యక్తి మరో ఇద్దరితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. ట్రాఫిక్ రూల్స్ ప్రకారం ద్విచక్రవాహనంపై ముగ్గురు ప్రయాణించడానికి లేదు. అందుకే.. ఆ వాహనాన్ని కానిస్టేబుల్ ముజఫర్ ఫోటో తీశాడు. అది గమనించిన గౌస్.. కానిస్టేబుల్ ని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.ఈ సంఘటన జరిగిన సరిగ్గా 15నిమిషాల తర్వాత నలుగురు వ్యక్తులు వచ్చి కానిస్టేబుల్ పై దాడి చేశారు. వారిలో టీఆర్ఎస్ మహిళా పేత సయ్యద్ మహమ్మద్ బేగం కూడా ఉన్నారు. ఆమె తన చెప్పుతో కానిస్టేబుల్ ని కొట్టి.. అతని వద్ద ఉన్న కెమేరాను కూడా లాక్కోవడం విశేషం. కానిస్టేబుల్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ పై దాడి చేసిన వారందరినీ అదుపులోకి తీసుకున్నారు.
* మధ్యప్రదేశ్‌లో నీమూచ్‌లో ఓ యువకుడిపై స్థానికులు దాడి చేశారు. పేరు పొందిన బాద్వా మాత ఆలయంలో మేకలను దొంగతనం చేశాడనే కారణంతో.. యువకున్ని పట్టుకుని చితకబాదారు. ఒళ్లు హూనం అయ్యేలా కొట్టారు.అంతటితో ఆగని స్థానికులు.. రెచ్చిపోయి బైక్‌లను తగలబెట్టారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..వారిని చెదరగొట్టి యువకున్ని అదుపులోకి తీసుకున్నారు.
* జపాన్ క్యోటో సిటీలోని ఒక యానిమేషన్ కంపెనీకి గుర్తుతెలియని వ్యక్తి గురువారం నిప్పుపెట్టాడు. ఈ ప్రమాదంలో 33 మంది చనిపోయారు. మరో 36 మంది గాయపడ్డారు, వారిలో 10 మంది పరిస్థితి సీరియస్‌గా ఉంది.
* యాదాద్రి జిల్లాలోని రామన్నపేటలో దారుణం చోటు చేసుకుంది. స్కూల్ ఎలక్షన్‌లో ఓడిపోయాననే మనస్థాపంతో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి రైలు కింద పడి చనిపోయాడు. వివరాలు.. సాయి చరణ్ అనే విద్యార్థి రామన్నపేట పట్టణంలోని కృష్ణవేణి పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో గురువారం పాఠశాలలో క్లాస్ లీడర్ ఎన్నికలు జరిగాయి. సాయి చరణ్ పోటీలో నిలిచాడు.
* ట్రాక్టర్ తో ఢీకొట్టి యువకుడిని హత్య చేసిన సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని నాగారం కెనాల్ వద్ద శుక్రవారం ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. అయితే ఈ యువకుడిని ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపేయడం సంచలనం కలిగించింది. కాగా… యువకుడి హత్యకు ఇసుక అక్రమ తవ్వకాల్లో విభేదాలే కారణమని స్థానికులు తెలుపుతున్నారు. పోలీసులు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
* ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్‌బీహెచ్ కాలనీలో ఒంటరిగా వెళుతున్న యువతి పట్ల ఓ యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో ఓ యువతిని బీటెక్ విద్యార్థి శివారెడ్డి వెనుక నుంచి బైక్‌పై వచ్చి ఆమెను టచ్ చేసి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనిని సీసీ కెమెరాల్లో చూసి రవి అనే కాలనీ వాసి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శివారెడ్డిని అరెస్ట్ చేశారు.
* నేపాల్ లోని ధంగధి హోటల్ లో నిన్న పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే పేలుడులో గాయపడిన ఓ వ్యక్తి చికిత్ప పొందుతూ ఇవాళ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
* తన లైంగిక కోరికను తీర్చలేదన్న కారణంతో ఓ వ్యక్తి వివాహితను హతమార్చాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్‌గర్‌లో చోటుచేసుకుంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
* ప్రఖ్యాత టీవీ నటి శోభ కారు ప్రమాదంలో కన్ను మూశారు. కన్నడలో పలు టీవీ సీరియల్స్‌లో ఆమె నటించారు. కర్ణాటకలోని బనశంకరి గుడికి 8 మందితో కలిసి కారులో వెళుతుండగా, కారు టైర్ పేలి ట్రక్కుని ఢీకొంది.
*కడప జిల్లా..లింగాల మండలం లో రైతు కుటుంబలో విషాదం..అప్పుల బాధ తాళ్ళలేక ఆత్మహత్య కు పాల్పడిన యువరైతు..గాల మండలం కర్ణ పాపయ్య పల్లెకు చెందిన కర్ణనరసింహారెడ్డి విషపు గుళికలు సేవించి ఆత్మహత్య..
ఆరు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న మృతుడు…శోకసంద్రంలో మృతుడి కుటుంబ సభ్యులు, భార్య…
*విశాఖపట్నం నుంచి బెంగుళూరుకు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న వోల్వో బస్ ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న మిని ట్రక్కు వాహనంపై పడిపోయింది. ఈ ఘటన రేణిగుంట ఆర్టీవో చెక్‌పోస్టు సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున జరిగింది. బస్‌లో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మిని ట్రక్కులో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న రేణింగట అర్బన్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. అతివేగం, బ్రేకులు ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
*తూర్పుగోదావరి జిల్లా కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ వద్ద మురుగు నీటి కాల్వలో మృతదేహాం కనిపించింది. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
*కర్నూలు జిల్లా నంద్యాల వన్ టౌన్ పరిధిలోని బాల్కొండ ప్రాంతం లో అబ్దుల్ సలాం అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా నకిలీ బీడీ ల వ్యాపారం చే స్తూ పట్టుబడ్డాడు.
*ధర్మవరం సమీపం లోని పోతుకుంట ప్రభుత్వ పాఠశాల లో దారుణం.2 వ తరగతి విద్యార్థి పవన్ ను స్కూల్ లో కాటేసిన విష సర్పం.గత 3 రోజులుగా అనంత సర్వ జన ఆసుపత్రి లో మృత్యువు తో పోరాటం.
*అధిక వడ్డీ ఆశజూపి ప్రజల నుంచి సుమారు రూ.2,500 కోట్లు సేకరించి బోర్డు తిప్పేసిన .. బెంగళూరుకు చెందిన ఐ మానెటరీ అడ్వైజరీ (ఐఎంఏ) అనే ఇస్లామిక్ బ్యాంకింగ్, నగల సంస్థ యజమాని మహమ్మద్ మన్సూర్ ఖాన్‌ను ఇవాళ ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి ఢిల్లీ చేరుకున్న అతన్ని విమానాశ్రయంలో ఆధీనంలోకి తీసుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
*చిత్తూరు జిల్లాలోని రేణిగుంట సమీపంలో శుక్రవారం ఉదయం ఓ ప్రైవేటు వోల్వో బస్సు బోల్తా కొట్టింది. దీంతో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. విశాఖపట్టణం నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేటు వోల్వో బస్సు రేణిగుంట సమీపంలో పల్టీ కొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా… బస్సు బోల్తా కొట్టడానికి అతివేగమే కారణమని గాయపడ్డ వారు తెలిపారు..
*బంగ్లాదేశ్ అక్రమ వలసదారులతో వెళుతున్న ఓ మినీబస్సు బోల్తాపడిన ఘటనలో 15 మంది మరణించారు.మినీబస్సు డిచ్ మీదుగా వెళుతుండగా ప్రమాదవశాత్తూ పక్క లోయలో బోల్తా పడింది. ఈ ఘటనలో మరో 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారిలో బంగ్లాదేశ్ తోపాటు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ వాసులున్నారని టర్కీ గవర్నరు మెహమెత్ ఎమిన్ బిల్ మెజ్ చెప్పారు.
*వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళను గ్రామస్తులు ట్రాక్టర్‌కు కట్టేసి చితకబాదారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోనాల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలకు వెళ్తే.. బోనాల గ్రామానికి చెందిన కున్న లావణ్య భర్త నాగరాజు విదేశాల్లో ఉంటాడు. అయితే ఇక్కడ ఒంటరిగా ఉంటున్న లావణ్య.. అదే గ్రామానికి చెందిన పడుగే నారాయణ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. నారాయణకు భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. లావణ్య, నారాయణల మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్టు బయటకి పొక్కడంతో గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టారు. దీంతో వారిద్దరు గ్రామం నుంచి పారిపోయారు.
*వరంగల్ రూరల్ రెండు లారీలు ఢీకొనడంతో లారీ డ్రైవర్లిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఆకేరు వాగుపై రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులిద్దరినీ హుటాహుటిన చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
*చిత్తూరు జిల్లాలోని రేణిగుంట సమీపంలో శుక్రవారం ఉదయం ఓ ప్రైవేటు వోల్వో బస్సు బోల్తా కొట్టింది. దీంతో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. విశాఖపట్టణం నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేటు వోల్వో బస్సు రేణిగుంట సమీపంలో పల్టీ కొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా… బస్సు బోల్తా కొట్టడానికి అతివేగమే కారణమని గాయపడ్డ వారు తెలిపారు.
*తమిళనాడులో గురువారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయారు.
*అప్పుల బాధతో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా నందిగామ శివారు హనుమంతుపాలెంలో చోటుచేసుకుంది.
*విజయనగర రాజుల తొలి రాజధాని అయిన ఆనెగుంది నవ బృందావనంలో దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు.
*నిషిద్ధ మాదక ద్రవ్యమైన ‘మెథంఫెటామైన్’ బిళ్లలను పెద్దసంఖ్యలో మయన్మార్ సరిహద్దుల్లో ఉన్న సైలులక్ గ్రామంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి ఖరీదు సుమారు రూ.15 కోట్లదాకా ఉండవచ్చన్నది అధికారుల అంచనా. నలుగురు వ్యక్తుల నుంచి ఆరులక్షల మెథంఫెటామైన్ బిళ్లలను స్వాధీనం చేసుకున్నట్లు ఓ ఉన్నతాధికారి గురువారం తెలిపారు. ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
*అరక దున్నతుండగా పిడుగు పడడంతో కాడెడ్లతో సహా అన్నదాత మృతిచెందిన సంఘటన గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. ఇదే జిల్లాలో మరో రెండు వేర్వేరు సంఘటనల్లో పిడుగుపాటుకు ఇద్దరు మహిళారైతులు మృతి చెందారు.
*తమిళనాడులోని కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయంలో అత్తివరదర్ ఉత్సవాల్లో గురువారం మధ్యాహ్నం జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు మహిళలు సహా నలుగురు మృతి చెందారు.
*ఝార్ఖండ్లో భద్రతా దళాలతో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు తీవ్రవాదులు చనిపోయారు. లోహరడగ జిల్లాలోని బహేగర గ్రామం వద్ద ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. రెండు ఏకే-47 తుపాకులు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని, గాలింపు కొనసాగుతోందని పేర్కొన్నారు.
*మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించి ఇద్దరు గిరిజనులను హత్య చేశారు. పోలీసులకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తుండటంతో మరణ శిక్ష అమలు చేసినట్లు ప్రకటించారు. విశాఖ మన్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
*ఏసీ కంప్రెషర్ మరమ్మతులు చేస్తుండగా అది పేలి ముగ్గురికి గాయాలైన ఘటన ఏలూరులో గురువారం జరిగింది.
*తమిళనాడులోని కాంచీపురంలో అత్తివరద రాజస్వామి ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయంలో తొక్కిసలాట జరిగిన ఘటనలో నలుగురు భక్తులు మృతిచెందారు. మరో ఐదుగురు భక్తులు కాంచీపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఏపీకి చెందిన మహిళతో పాటు మరో ముగ్గురు ఉన్నారు.
*ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో కటకటాల పాలైన రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్ లావణ్యకు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం కస్టడీకి అనుమతించింది.
*ద్విచక్రవాహనంపై ముగ్గురు వెళ్తుండగా వీడియో తీసినందుకు విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్పై ఓ తెరాస మహిళ నేత తన కుటుంబ సభ్యులతో కలిసి దాడిచేశారు. ఈ సంఘటన హైదరాబాద్లోని మౌలాలి కమాన్వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఐదుగురుని అరెస్టు చేశారు.
బిగ్‌బాస్‌ను బ్యాన్ చేయాలి:ఢిల్లీలో ధర్నా-నేరవార్తలు–07/19
Related tags :