DailyDose

ట్విట్టర్ పిట్ట కేటీఆర్-డీకే అరుణ-రాజకీయ–07/19

DK Aruna Slams KTR As Twitter Bird-Today Politics In Telugu-July192019

*టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్విట్టర్ పిట్ట అని.. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏదో సాధించామని ట్విట్టర్‌లో పిట్ట పలుకులు పలుకుతున్నారని బీజేపీ నేత డీకే అరుణ ఎద్దేవా చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని పోలేపల్లిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణకు బుల్లెట్ ట్రైన్ ఇవ్వరా అని అడగడం తన ఆవగాహన రాహిత్యాన్ని తెలుపుతోందన్నారు.మొదట రైల్వే లైన్లను విద్యుదీకరణ చేయాలని.. ఆ తరువాత బుల్లెట్ ట్రైన్ గురించి అడగాలన్నారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికైన కృష్ణ-వికారాబాద్ రైల్వే లైన్ ఏర్పాటుపై కనీసం కేంద్రం దృష్టికి తీసుకెళ్లకుండా… కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం ఉపాధి హామీకి 10 వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని వాటిలో చాలా వరకు నిధులు మళ్లించారని అన్నారు. మున్సిపల్‌ వార్డుల విభజన అశాస్త్రీయంగా చేశారని, తమ పార్టీ అభ్యర్థుల విజయానికి అనుకూలంగా వాటిని విభజించారని విమర్శించారు. ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ మళ్లీ జిమ్మిక్కులు ప్రారంభించారని అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే పెంచిన పెన్షన్లు ఎన్నికల ముందు ఇస్తున్నారన్నారు. యువత బీజేపీలో పనిచేయడానికి ముందుకు వస్తున్నారని,రాష్ట్రంలో అత్యధిక మున్సిపాల్టీలను కైవసం చేసుకుంటుందన్నారు.
* కేవలం రూపాయికే ఇంటి రిజిస్ట్రేషన్‌: కేసీఆర్‌
తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా తెలంగాణ పురపాలక చట్టం-2019పై చర్చ జరుగుతోంది.ఈ చట్టం ఆవశ్యకత, ముఖ్యాంశాలు, లక్ష్యాలు, ఆలోచనలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అవినీతి రహిత పాలన కోసం నూతన పురపాలక చట్టం తెస్తున్నామని చెప్పారు. పంచాయతీ అనేది ఒక విభాగం కాదని, ఓ ఉద్యమమని అన్నారు. గ్రామ స్వరాజ్యం కోసం మహాత్మాగాంధీ కలలు కన్నారని గుర్తు చేశారు. పంచవర్ష ప్రణాళికలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని చెప్పారు. ఎమ్మెల్యేలందరికీ శిక్షణ ద్వారా పంచవర్ష ప్రణాళికలపై అవగాహన కల్పిస్తామన్నారు. భారత ప్రజాస్వామ్యం విస్త్రృతమైనదని, మనది చాలా బలమైన ప్రజాస్వామ్య పునాదులున్న దేశమని గుర్తు చేశారు.
* కేసీఆర్ నోట.. మక్క గడ్క మాట
కొత్తమున్సిపల్ చట్టంతో ప్రభుత్వం ఏం చేయదల్చుకున్నదో వివరించారు సీఎం కేసీఆర్. జాతిపిత మహాత్ముడు చెప్పిన స్వపరిపాలన నినాదంతో తన ప్రసంగం ప్రారంభించారు సీఎం కేసీఆర్. పంచాయతీ రాజ్ అనేది కూడా ఓ మూవ్ మెంట్ అనీ.. అది డిపార్టుమెంట్ కాదని చెప్పారు. పంచాయతీ రాజ్ ఉద్యమాన్ని మాజీ కేంద్రమంత్రి ఎస్కే డే ప్రారంభించారనీ. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ ను హైదరాబాద్ లోనే స్థాపించారని చెప్పారు. ఇక్కడినుంచే దేశమంతటా ప్రమోట్ చేశాని అన్నారు.
* ‘కౌన్సిల్‌’ చాన్స్‌‌ ఇవ్వండి.. కేటీఆర్‌‌తో మాజీలు…….
శాసన మండలి సభ్యులుగా చాన్స్‌‌ ఇవ్వాలని మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు టీఆర్‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్‌‌ను కోరారు. గురువారం అసెంబ్లీ వాయిదా పడ్డాక టీఆర్‌‌ఎస్‌‌ ఎల్పీకి వెళ్లిన కేటీఆర్‌‌ను కలవడానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు క్యూ కట్టారు. వారితో కేటీఆర్‌‌ విడివిడిగా సమావేశమయ్యారు. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీలు ప్రొఫెసర్‌‌ సీతారాం నాయక్‌‌, బూర నర్సయ్యగౌడ్‌‌ తమకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కేటీఆర్‌‌ను కోరారు. దీనిపై పార్టీ చీఫ్‌‌, సీఎం కేసీఆర్‌‌కు వివరిస్తానని ఆయన చెప్పారు. పోడు సమస్య పరిష్కరించండిపట్టా భూముల్లో గొయ్యిలు తవ్వుతూ అటవీ శాఖ అధికారులు దౌర్జన్యానికి దిగుతున్నారని నిజామాబాద్‌‌ రూరల్‌‌ సెగ్మెంట్‌‌కు చెందిన 40 మంది సర్పంచులు కేటీఆర్‌‌కు తెలిపారు. గురువారం టీఆర్‌‌ఎస్‌‌ ఎల్పీలో ఆయన్ను కలిసి తమ ప్రాంత రైతుల సమస్య పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. రెండు రోజులు టైం ఇవ్వాలని, సమస్యను సీఎంకు వివరించి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
* అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం: కేసీఆర్‌
అక్రమ నిర్మాణాలు చేపడితే నోటీసు ఇవ్వకుండానే కూల్చివేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభలో స్పష్టం చేశారు. అక్రమ కట్టడాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమన్నారు. నూతన పురపాలక చట్టం-2019 ప్రాముఖ్యతను వివరిస్తూ సభలో కేసీఆర్‌ మాట్లాడారు. యజమానులే ఇంటి నిర్మాణానికి సంబంధించిన సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ ఇవ్వాలని అన్నారు. తప్పుడు సర్టిఫికేషన్‌ ఇస్తే 25 రెట్లు జరిమానా విధిస్తామన్నారు. కొత్త చట్టంలో జిల్లా కలెక్టర్లు మరింత కీలకం కానున్నారని, పని చేయని సర్పంచ్‌లు, ఛైర్‌పర్సన్లు, వార్డుమెంబర్లు, కౌన్సిలర్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు కలెక్టర్‌ ఆధ్వర్యంలోని ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ బృందం ఇళ్లకు సంబంధించిన కొలతలు చేపడుతుందని స్పష్టం చేశారు. కలెక్టర్‌ తీసుకున్న చర్యలపై స్టే ఇచ్చే అధికారాన్ని మంత్రి నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించారు. 500 చదరపు గజాల వరకు నిర్ణీత సమయంలో ఆన్‌లైన్‌లోనే అనుమతి వస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వానిది ‘సిటిజన్‌ ఫ్రెండ్లీ ఆర్బన్‌ పాలసీ’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.
*ఏపీ అసెంబ్లీలో చర్చలపై ఆసక్తిలేదు: కేటీఆర్‌
కొత్త పురపాలక చట్టం అవినీతిని పారదోలుతుందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. రాజకీయ జోక్యం తగ్గి ప్రజలకు పారదర్శక సేవలు అందుతాయన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిలో పలు అంశాలపై మాట్లాడారు. ‘‘నోటీసు ఇవ్వకుండా అక్రమ కట్టడాలను కూల్చే అధికారం కొత్త పురపాలక చట్టం కల్పిస్తుంది. పురపాలక చట్టంపై అవగాహనకు శిక్షణా తరగతులు నిర్వహిస్తాం. కొత్త చట్టం ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుంది. కొత్త చట్టంతో ఉద్యోగులు ఒకేచోట పాతుకుపోవడం కుదరదు. పురపాలికల్లో 75 గజాల్లోపు ఇళ్ల నిర్మాణానికి అనుమతి అక్కర్లేదు.ఈ అంశాన్ని తెరాస ఎమ్మెల్యేలు ప్రజల్లోకి విస్తృత్తంగా తీసుకెళ్లాలి’’ అని సూచించారు.
*మెగాస్టార్‌ చిరంజీవి మమ్మల్ని సంప్రదించలేదు
బీజేపీలో చేరే విషయమై మెగాస్టార్‌ చిరంజీవి తమతో సంప్రదింపులు జరపలేదని, జాతీయ స్థాయి నేతలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారేమో తెలియదని ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు 11తరువాత పార్టీలో కీలక మార్పులు, చేర్పులు ఉంటాయని వెల్లడించారు. టీడీపీ నుంచి చాలా మంది ఎమ్మెల్సీలు బీజేపీతో టచ్‌లో ఉన్నారన్నారు. తమ పదవులకి రాజీనామా చేసి బీజేపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. రాష్ట్రానికి ఒక కేంద్ర మంత్రి పదవి వస్తుందని, సామాజిక న్యాయం ఆధారంగా ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు అనేది ప్రతి మూడేళ్లకు ఒకసారి జరుగుతుందని, కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడై రెండేళ్లు మాత్రమే అయ్యిందన్నారు.
* యడ్యూరప్ప సీఎం కావాలని.. బీజేపీ ఎంపీ ఏం చేశారంటే…….
కర్ణాటక రాజకీయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. విశ్వాసపరీక్షలో విజయం ఎవరు సాధిస్తారా అని సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ.. కర్ణాటక అసెంబ్లీలో మాత్రం హైడ్రామా ఇంకా కొనసాగుతోంది. నిన్నటితో ఫలితం వెలువడాల్సి ఉండగా.. నేటీకీ ఏదీ తేలలేదు. ఇదిలా ఉంటే…. కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి..యడ్యూరప్ప ముఖ్యమంత్రి కావాలని ఆ పార్టీ నేతలు కోరుకుంటున్నారు.బీజేపీ కర్ణాటక ఎంపీ శోభ కరండ్లజే ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చాముండేశ్వరీ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకముందు ఆలయంలోకి వెళ్లేందుకు ఆమె 1001 మెట్లు ఎక్కడం విశేషం. ఆమెతోపాటు పలు పార్టీ కార్యకర్తలు కూడా 1001 మెట్లు ఎక్కారు. అనంతరం యడ్యురప్ప ముఖ్యమంత్రి కావాలంటూ ఆలయంలో పూజలు చేశారు.
*మునిసిపల్ ఎలక్షన్స్ పై ఉరుకులాట ఎందుకు?: హైకోర్టు…….
మున్సిపల్‌ ఎలక్షన్ల కోసం పరుగులు పెట్టడం ఎందుకు. హడావుడిగా నోటిఫికేషన్‌ ఇవ్వడం.. నాలుగు రోజుల్లో అభ్యంతరాలు కోరడం, వాటిని ఒక్క రోజులోనే పరిష్కరిస్తామనడం సముచితంగా లేదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంతో కీలకం. దీనిపై ఉన్న నమ్మకం సన్నగిల్లకూడదు. ఎన్నికలకు ప్రభుత్వం సహకరించడం లేదంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టును ఆశ్రయించడం బహుశా ఇక్కడే జరిగి ఉంటుంది. ఎలక్షన్లు నిర్వహించడానికి 109 రోజులు పడుతుందని సింగిల్‌ జడ్జి వద్ద చెప్పిన సర్కారు.. ఇప్పుడు ఎందుకు ఇంత హడావుడి చేస్తోంది..”అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. అయితే హడావుడి ఎలక్షన్లు చేపట్టడం లేదని, అభ్యంతరాలను పరిష్కరించాకే నోటిఫికేషన్ ఇస్తామని ఎన్నికల సంఘం కోర్టుకు వివరణ ఇచ్చింది.
*ఆస్తులు తెలంగాణకు.. అప్పులు ఆంధ్రాకు: బుద్దా
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఆస్తులు.. ఆంధ్రప్రదేశ్‌కు అప్పులే మిగిలాయని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజధాని కోసం భూములిచ్చేందుకు రైతులు ముందుకొచ్చారని గుర్తుచేశారు. జగన్ అధికారంలోకి రాగానే పెట్టుబడిదారులు, బ్యాంకర్లు వెనుకడుగు వేస్తున్నారని విమర్శించారు. జగన్ పాలనపై ఎవ్వరికీ నమ్మకం లేదన్నారు. ఆదిలోనే పరిస్థితి ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందోనని ఆందోళన వెలిబుచ్చారు.
* అసెంబ్లీలో మున్సిపాలిటీ బిల్లు పాస్
రాష్ట్ర అసెంబ్లీలో కొత్త మున్సిపల్ చట్టం బిల్లు పాస్ అయింది. సవరణలను స్పీకర్ మూజువాణి ఓటుతో ఆమోదించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఉదయం ప్రవేశపెట్టిన ఈ బిల్లును టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చారు.రాష్ట్రంలో మున్సిపాలిటీల పనితీరు దుర్మార్గంగా ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. భయం.. భక్తి.. ఈ రెండే వ్యవస్థలను నడుపుతున్నాయని చెప్పారు. పద్ధతిగా, వినయంగా చెబితే ఎవరూ వినే పరిస్థితి లేదని.. అందుకే.. భారీ జరిమానాలతో… కఠిన చర్యలతో బిల్లును రూపొందించామన్నారు.
*బలహీనవర్గాలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి: భట్టి
కొత్త మున్సిపల్‌ చట్టంలో ఆఫీసర్లకు అధికారాలు ఇవ్వడమంటే… గ్రామ స్వరాజ్యాన్ని హరించడమేనని.. దీనిపై సీఎం కేసీఆర్ ఒక్కసారి ఆలోచించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సూచించారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీలో కొత్త మున్సిపల్ బిల్లుపై చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ పాలనలో భాగస్వామ్యం చేయడానికి, బలహీనవర్గాలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బలహీనవర్గాల రిజర్వేషన్లకు సంబంధించి పక్క రాష్ట్రం తమిళనాడులో దాదాపు 69శాతం అవకాశం ఇస్తున్నారని, అటువంటి పరిస్థితి తెలంగాణలో ఎందుకు అమలు చేయలేకపోతున్నామని, దీనిపై కమిషన్ వేసి అమలు చేసేటట్టుగా చర్యలు తీసుకుంటామని గతంలో కేసీఆర్ ఇదే సభలో చెప్పారని, కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. మళ్లీ 50 శాతం రిజర్వేషన్స్‌తో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళుతున్నామని చెబుతున్నారని, దీనిపై సీఎం కేసీఆర్ ఆలోచన చేయాలని భట్టి విజ్ఞప్తి చేశారు.
* సభ నిర్వహణ తీరునకు నిరసనగా కాంగ్రెస్‌ వాకౌట్‌
తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. తొలి రోజు పలు కీలక బిల్లులు ఆమోదం పొందాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న మున్సిపాలిటీస్ 2019 యాక్ట్‌ ను సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మున్సిపాలిటి బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుల ఫిరాయింపులపై అధికార, విపక్షం మధ్య చర్చ మాటల యుద్ధానికి దారితీసింది. సీఎల్పీ విలీనంపై స స్పందించిన సీఎం కేసీఆర్.. అది కాంగ్రెస్ పార్టీ లోపమన్నారు. రాజ్యాంగం ప్రకారమే కాంగ్రెస్‌ సభ్యుల విలీనం జరిగిందన్నారు.
* మాయావతికి భారీ ఎదురుదెబ్బ
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయపు పన్ను శాఖ మాయావతికి గట్టి షాక్ ఇచ్చింది. మాయావతి సోదరుడు ఆనంద్ కుమార్‌కు చెందిన ఏడెకరాల భూమిని ఐటీ అధికారులు జప్తు చేశారు. ఈ ఆస్తి బుక్‌ వాల్యూనే 400 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించి జూలై 16న ఐటీ శాఖ బినామీ ప్రొహిబిషన్‌ యూనిట్‌ తాత్కాలిక నోటీసులు జారీ చేసింది. ఆనంద్ కుమార్‌తో పాటు ఆయన భార్య విచితర్ లత పేరుమీదున్న న్యూఢిల్లీ, నోయిడా పరిధిలోని ఆస్తులను జప్తు చేశారు.ఆనంద్ కుమార్ తొలుత నోయిడా అథారిటీలో క్లర్కుగా పనిచేశారు. అనంతరం నకిలీ కంపెనీల పేరుతో కోట్ల రూపాయల రుణాలు పొందినట్లు ఆరోపణలున్నాయి. 2007లో మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్న ప్పుడు ఆయన 49 కంపెనీలు ప్రారంభించారు. ఆయన ఆస్తుల విలువ 1316 కోట్లకు చేరింది. దీనిపై అప్పటినుంచి ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. అటు ఎన్నికల తర్వాత ఎస్పీ కూటమి నుంచి బయటకు వచ్చిన మాయావతి పార్టీ బలోపేతం దిశగా చర్యలు చేపట్టారు.. ఈనేపథ్యంలోనే గత జూన్‌లో ఆనంద్‌ కుమార్ బీఎస్పీ ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఇది జరిగిన కొద్దిరోజులకే ఐటీ దాడులు జరగడంతో కలకలం రేగుతోంది.. ఉన్నట్టుండి విరుచుకుపడిన ఐటీ శాఖ.. ఆనంద్‌కుమార్‌ ఆస్తులపై విచారణ మొదలు పెట్టడంతో బీఎస్పీ వర్గాల్లో కలవరాన్ని కలిగిస్తోంది. బినామీ చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష లేదంటే బినామీ ఆస్తి మార్కెట్‌ విలువలో 25 శాతం వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. మరి, తన సోదరుడి ఆస్తులపై ఐటీ శాఖ యాక్షన్‌కు మాయావతి రియాక్షన్‌ ఎలా ఉంటుందో చూడాలి.
*జగన్ ఒక అడుగు ముందుకేసి రిపోర్ట్ బయటపెట్టండి : వర్ల
ఎస్సీ వర్గీకరణ చాలా సున్నితమైన సమస్య అని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య చెప్పుకొచ్చారు. ఈ వర్గీకరణ సమస్యను జగన్ చాలా లైట్‌గా తీసుకుంటున్నారని.. ఎస్సీ కేటగిరిపై మీ స్టాండ్ ఏంటో చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ వర్గీవకరణపై వెంటనే అసెంబ్లీలో మరో తీర్మానం ప్రవేశపెట్టి ఢిల్లీకి పంపించాలని ఏపీ ప్రభుత్వానికి వర్ల సూచించారు. శుక్రవారం నాడు విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నపుడున్న ఉషామెరన్ కమిషన్‌ను వెలుగులోకి తీసుకురావన్నారు.
* మా ఎమ్మెల్యే కనబడట్లేదు: సిద్ధరామయ్య
కర్ణాటక శాసనసభలో బలపరీక్ష నేపథ్యంలో కన్నడనాట ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీమంత్‌ పాటిల్‌ కనిపించట్లేదంటూ సీఎల్పీ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన శ్రీమంత్‌ కనబడటం లేదని సిద్ధరామయ్య ఆరోపిస్తున్నారు. ఈ మేరకు విధానసౌద పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. సిద్ధరామయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాన్ని ముంబయి పంపారు.
శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల్లోపు శాసనసభలో బలం నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి కుమారస్వామికి గవర్నర్‌ సూచించారు. ఈ మేరకు గవర్నర్‌ వాజూభాయ్‌ వాలా సీఎంకు ఓ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో తమ ఎమ్మెల్యే కనబడటం లేదంటూ సిద్ధరామయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
*‘కౌన్సిల్‌’ చాన్స్‌‌ ఇవ్వండి.. కేటీఆర్‌‌తో మాజీలు
శాసన మండలి సభ్యులుగా చాన్స్‌‌ ఇవ్వాలని మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు టీఆర్‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్‌‌ను కోరారు. గురువారం అసెంబ్లీ వాయిదా పడ్డాక టీఆర్‌‌ఎస్‌‌ ఎల్పీకి వెళ్లిన కేటీఆర్‌‌ను కలవడానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు క్యూ కట్టారు. వారితో కేటీఆర్‌‌ విడివిడిగా సమావేశమయ్యారు. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీలు ప్రొఫెసర్‌‌ సీతారాం నాయక్‌‌, బూర నర్సయ్యగౌడ్‌‌ తమకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కేటీఆర్‌‌ను కోరారు. దీనిపై పార్టీ చీఫ్‌‌, సీఎం కేసీఆర్‌‌కు వివరిస్తానని ఆయన చెప్పారు. పోడు సమస్య పరిష్కరించండిపట్టా భూముల్లో గొయ్యిలు తవ్వుతూ అటవీ శాఖ అధికారులు దౌర్జన్యానికి దిగుతున్నారని నిజామాబాద్‌‌ రూరల్‌‌ సెగ్మెంట్‌‌కు చెందిన 40 మంది సర్పంచులు కేటీఆర్‌‌కు తెలిపారు. గురువారం టీఆర్‌‌ఎస్‌‌ ఎల్పీలో ఆయన్ను కలిసి తమ ప్రాంత రైతుల సమస్య పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. రెండు రోజులు టైం ఇవ్వాలని, సమస్యను సీఎంకు వివరించి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
* పొరుగు రాష్ట్రాలకు పండగ..ఏపీకి దండగ-ప్రతిపక్షనేత చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిధుల మంజూరుకు ప్రపంచబ్యాంకు వెనుకంజ వేసిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. ఇవాళ్టి శాసనసభ సమావేశాల్లో రోడ్ల నిర్మాణం, ఇతర పనుల నిలిపివేతపై చర్చకు పట్టుబట్టాలని పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. వివిధ ప్రాజెక్టుల పనులు నిలిచిపోవడం వల్ల లక్షలాది మంది ఉపాధి కోల్పోవడంపై చర్చకు పట్టుపడదామన్నారు.
*ప్రియాంకగాంధీని అడ్డుకున్న పోలీసులు
ఉత్తరప్రదేశ్‌లోని సోంభద్ర ప్రాంతంలో ఇటీవల ఓ భూవివాదంలో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించడానికి వెళుతుండగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ‘‘నేను బాధిత కుటుంబాలను పరామర్శించడానికి మాత్రమే వెళుతున్నాను. నా కుమారుడి వయసున్న ఓ బాలుణ్ని కాల్చారు. ఇప్పుడు అతను చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో ఉన్నాడు. నన్ను ఇక్కడ ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలి. శాంతియుతంగానే నిరసన తెలిపాం. అడ్డుకోవాలని ఇచ్చిన ఆదేశాల్ని ఎవరైనా చూపగలరా. వారు మమ్మల్ని ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదు. బహుశా అరెస్టు చేసినట్లు అనిపిస్తోంది. ప్రజల సంక్షేమం కోసం ఎక్కడికి వెళ్లడానికైనా సిద్ధం’’ అని మీడియాతో మాట్లాడుతూ ప్రియాంక అన్నారు.
*టీడీపీ సోషల్ మీడియా విభాగ బాధ్యతలు లోకేష్ కు అప్పగింత
చంద్రబాబు లోకేష్ కు అప్పగించిన బాధ్యత చూస్తే ఒకింత ఆశ్చర్యం అనిపించినా ఇప్పుడు రాజకీయాలు కూడా దాని మీదే ఎక్కువ ఆధారపడి సాగుతున్నాయి. ఇప్పుడు ప్రతీ అంశంపై ప్రభావం చూపించే అంశం సోషల్ మీడియా అని చెప్పక తప్పదు . అందుకే ఇప్పటి నుండి లోకేష్ తెలుగు దేశం పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని చూసుకోవాలని చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. లోకేష్ వ్యక్తిగతంగా సోషల్ మీడియా టీం తో సమన్వయం చేసుకుంటారు. అంతే కాదు వారికి కావాల్సిన ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తారు.
*క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాకే..
తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానే అని మునుగోడు కాంగ్రెస్ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఆ పార్టీ నుంచి తనకు ఆహ్వానం ఉందని ధ్రువీకరించారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల భాజపాలో చేరడం ఆలస్యం అవుతుందన్నారు. కాంగ్రెస్ తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న మరుక్షణమే తుది నిర్ణయం తీసుకుంటానని, అప్పటి వరకు ఆ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతానన్నారు.
*నేను రాజకీయాల్లో ఉండాల్సిన వ్యక్తినని మండేలా ఎప్పుడో చెప్పారు
నల్లజాతి సూరీడుగా ప్రఖ్యాతిగాంచిన నెల్సన్ మండేలా తనకు స్ఫూర్తిప్రదాత, మార్గదర్శకుడని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ గురువారం అన్నారు. తనను రాజకీయాల్లో ఉండాల్సిన వ్యక్తిగా ఆయన అభిప్రాయపడినట్లు ఆమె చెప్పారు. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడైన నెల్సన్మండేలా 101 జయంతిని పురస్కరించుకుని గురువారంనాడాయనకు ప్రియాంక ఘననివాళులర్పించారు. వ్యక్తిగతంగా తనకు ఆయన ‘నెల్సన్ మండేలా అంకుల్’ అంటూ ఆయనతో కలిసి తీయించుకున్న ఫొటోలను ట్విటర్లో పెట్టారు.
*నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై తెరాస దృష్టి
నిజామాబాద్ స్థానిక సంస్థల శాసనమండలి స్థానం ఎన్నికపై తెరాస దృష్టి సారించింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గురువారం శాసనసభాపక్ష కార్యాలయంలో జిల్లాకు చెందిన పలువురు జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ స్థానానికి గతంలో ఎమ్మెల్సీగా ఉన్న భూపతిరెడ్డిపై పార్టీ ఫిరాయింపు చట్టం కింద తెరాస ఫిర్యాదు చేయగా శాసనమండలి ఛైర్మన్ అనర్హత వేటు వేశారు. దీనిపై ఆయన న్యాయస్థానానికి వెళ్లగా శాసనమండలి ఛైర్మన్ నిర్ణయానికి అనుగుణంగా బుధవారం హైకోర్టు తీర్పు వెలువడింది.
*ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెలంగాణలో అమలయ్యేలా చూడాలి
అగ్రవర్ణాల్లోని పేదలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 10 శాతం రిజర్వేషన్లు తెలంగాణలో అమలు కావడం లేదని.. అమలయ్యేలా చూడాలని కరీంనగర్ లోక్సభ సభ్యుడు బండి సంజయ్ కోరారు. లోక్సభలో గురువారం రాత్రి ఆయన మాట్లాడారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఆవాస్ యోజన పథకాలనూ తెలంగాణలో అమలు చేయడం లేదని తెలిపారు.
*భాజపా గూటికి అల్పేశ్ ఠాకూర్
గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవులకు ఇప్పటికే రాజీనామా చేసిన ఓబీసీ నేత అల్పేశ్ ఠాకూర్, ఆయన సన్నిహితుడు ధవళ్సిన్హ్ జలా గురువారం భాజపాలో చేరారు. గాంధీనగర్లోని కమలం పార్టీ ప్రధానకార్యాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జితూ వఘానీ సమక్షంలో వారిద్దరూ ఆ పార్టీలో చేరారు. రాజ్యసభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటేసినట్లు భావిస్తున్న ఈ ఇద్దరూ జులై 5న తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు.
*మంత్రులు రాలేదని వాయిదా వేయటం ఇదే మొదటిసారి
మంత్రిమండలి సమావేశం నిర్ణీత గడువు కంటే రెండు, మూడు నిమిషాలు అదనంగా నిర్వహించడంతో సకాలంలో సభకు హాజరు కాలేకపోయానని, అందుకు మన్నించాలని శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కోరారు. ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని సభకు హామీ ఇచ్చారు. గురువారం ఉదయం 9 గంటలకు సభాపతి తమ్మినేని సీతారాం సభను ప్రారంభించినపుడు మంత్రులెవరూ లేకపోవడంపై తెదేపా ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సభాపతి కొద్దిసేపు సభను వాయిదా వేసి తిరిగి ప్రారంభించారు. దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతూ మంత్రులు సకాలంలో సభకు రాకపోవడం అసెంబ్లీని తక్కువ చేయడమేనని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాల్సిన బాధ్యత సభలో అందరిపైనా ఉందని అన్నారు. మంత్రులు లేరని సభను వాయిదా వేయడం ఇదే మొదటిసారని ఆయన చెప్పారు. ఆలస్యానికి మంత్రి బుగ్గన క్షమాపణలు చెప్పారని సభాపతి పేర్కొంటూ ప్రశ్నోత్తరాల్లోకి వెళ్లారు.
*విద్యుత్ ఒప్పందాలపై చర్చకు పట్టు
విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై చర్చ జరగాలంటూ గురువారం మండలిలో తెదేపా సభ్యులు పట్టుబట్టారు. ఇది అత్యవసరమని డిమాండ్ చేశారు. ఛైర్మన్ షరీఫ్ మాత్రం తిరస్కరించారు. సభ ఆరంభమైన వెంటనే పొరుగు సేవల (ఔట్సోర్సింగ్) ఉద్యోగుల తొలగింపు అంశంపై పీడీఎఫ్ సభ్యులు, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై తెదేపా సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు ఛైర్మన్ షరీఫ్ ప్రకటించారు. దీంతో తెదేపా సభ్యులు తమ స్థానాల నుంచి ముందుకు వచ్చి విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై చర్చకు డిమాండ్ చేశారు.
* సీఎం సీటు కావాలంటే తీసుకోండి..
కర్ణాటకలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. సంకీర్ణ ప్రభుత్వం ఆధిక్యాన్ని నిరూపించుకునేందుకు నిన్న ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై రెండో రోజు చర్చ జరుగుతోంది. శుక్రవారం సభ ప్రారంభమైన తర్వాత విశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభించాలని స్పీకర్‌ సీఎంను కోరారు. అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ.. మరోసారి భాజపాపై ధ్వజమెత్తారు.