‘బ్యూటీ విత్ బ్రెయిన్’ అందమనేది ముఖానికి కాదు మనసుకు ఉండాలి. మనకు ఉన్న పాషన్‌ను నేరవేర్చుకోవాలనే తపన ఉండాలే కానీ చేస్తున్న వృత్తి కూడా అడ్డుకాదు. ఈ మాటలకు సాక్ష్యంగా నిలిచింది ప్రీతి అనే పోలీస్ ఆఫీసర్. పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఆమె.. అందాలపోటీలో పాల్గొని ‘మిసెస్ ఇండియా’ టైటిల్ గెలుచుకుంది. తన వృత్తికి ఏమాత్రం సంబంధం లేని ఈ ఈవెంట్‌లో పాల్గొని టైటిల్ గెలిచుకుని అందరి చేత ప్రశంసలు అందుకుంటుంది.పూణేలోని కరాడ్ ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల ప్రేమ స్పెషల్ బ్రాంచ్‌లో అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తుంది. 2010లో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా చేరిన ప్రేమ.. తొలిత ముంబైలోని థానే పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఎన్నో కేసులను చాకచక్యంగా చేధించారు. వృత్తి పట్ల తనకు ఉన్న నిబద్దతకు డిపార్ట్‌మెంట్ మెచ్చి ఆమెను పూణేలోని స్పెషల్ బ్రాంచ్‌లో అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతిని ఇచ్చింది. 2014లో విఘ్నేశ్‌ని ప్రేమ వివాహం చేసుకున్న ఆమెకు రెండేళ్ల కొడుకున్నాడు. ఓ వైపు వృత్తి మరోవైపు కుటుంబం ఇన్ని బాధ్యతలున్నా ఆమె మాత్రం తన ఇష్టాన్ని మాత్రం వదులుకోలేదు. అందాలపోటీల్లో పాల్గొనాలనే సంకల్ప బలం ఆమెనువిజేతగా నిలిపింది,ప్రతి పురుషుడు విజయం వెనుక ఓ స్త్రీ ఉన్నట్లు. ఇక్కడ ప్రేమ విజయం వెనుక ఆమె భర్త ఉన్నాడు. డ్యూటీయే కాకుండా ఇతర అంశాలపై కూడా ఆసక్తిని పెంచుకోవాలనిరొటీన్‌కి భిన్నంగా ఆలోచించాలని చేప్పేవారు. అందం ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుందని.. అందాలపోటీలపై ఆసక్తి పెంచుకోవాలని ప్రోత్సహించారు.దాంతో ఆమె ప్యాషన్‌పై ఆసక్తి పెంచుకుంది. దానికి సంబంధించిన సమాచారం తెలుసుకుని వాటిని ఆచరిస్తుండేది. డ్యూటీ అనంతరం ఇంటికి వచ్చి ర్యాంప్‌వాక్ ప్రాక్టీస్ చేసేది. జనరల్ నాలెడ్జ్ కోసం దినపత్రికలు, పుస్తకాలు చదువుతుండేది. జీ-20 సమ్మిట్‌లో భాగంగా నిర్వహించిన ‘మిసెస్ ఇండియా’ టైటిల్ పోటీల్లో ప్రేమ సుమారు 20 మంది మహిళలతో పోటీపడ్డారు. పోటీలో ఉన్న అన్ని అంశాలను దాటుకుంటూ న్యాయనిర్ణేతలు అడిగిన పలు ప్రశ్నలకు చక్కగా సమాధానాలిచ్చి ఈ ఏడాది ‘మిసెస్ ఇండియా’ టైటిల్ విజేతగా నిలిచారు.మిసెస్ ఇండియా’ టైటిల్ గెలవడం పట్ల ప్రేమ ఆనందం వ్యక్తం చేసింది. “నా విజయం వెనుక నా భర్త ఉన్నాడు. చాలామంది ఫోన్లు చేసి అభినందిస్తుంటే గర్వంగా ఉంది. టైటిల్ గెలుపుతో నేనొక సెలబ్రిటీగా మారాను. చాలామంది మహిళలు రొటీన్ జీవితాన్ని గడుపుతుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే మనలో దాగున్న ప్రతిభను చాటుకోవచ్చు అందుకు నేనే ఒక ఉదాహరణ’’ అన్నారు ప్రేమ. ఆమె విజయాన్ని పూణే పోలీస్ డిపార్ట్‌మెంట్ కూడా సెలబ్రెట్ చేసుకుంటుంది. ట్విట్టర్లో ప్రేమ ఫోటోలను షెర్ చేసి ప్రశసించింది.
పోలీసు అందం
Related tags :