సైంటిస్టులుగా అక్షయ్ కుమార్, విద్యాబాలన్, తాప్సీ, నిత్యామీనన్, సోనాక్షిసిన్హా, శర్మాన్ జోషి నటించిన బాలీవుడ్ సినిమా మిషన్ మంగళ్. భూమికి అతి దగ్గరగా ఉన్న కుజ గ్రహంపైకి శాటిలైట్ పంపించి ఇస్రో సృష్టించిన సంచలన విజయం ఇతివృత్తంతో ఈ సినిమా రూపొందించారు. ఆగస్ట్ 15న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ గురువారం విడుదలైంది.ట్రైలర్ కు పాజిటివ్ టాక్ వస్తోంది. జగన్ శక్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సమర్పణలో కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్, హోప్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. చంద్రయాన్ 2 లాంచింగ్ జరుగుతున్న ఈ సమయంలో మంగళ్ యాన్ అద్భుత విజయం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. పైగా ఇండిపెండెన్స్ డే రోజున విడుదల కానుండటంతో… ఇండస్ట్రీ బజ్ ఏర్పడింది.
Mission Mangal Official Trailer
Related tags :